ఎప్పుడు యోగానే కాదు.. అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలిగా..! సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న రామ్‌దేవ్ బాబా
ఇండియాలో ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి పతంజలి బాగా ఫేమస్. వీటి నుంచి వచ్చే వాటిని చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. పతంజలి పేరు వినపడగానే మొదటగా గుర్తుకు వచ్చేది ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా. ఈయన మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యోగా గురువుగా గొప్ప పేరు కలిగిన వ్యక్తి. ప్రజలకు నేచురల్‌గా తయారయ్యే నిత్యవసరాలు, ఆహార పదార్థాలను అందించడానికి పతంజలి కంపెనీని ఏర్పాటు చేసి దాని పేరు మీదగానే వీటన్నింటిని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్‌దేవ్ బాబా ఇటీవల కాలంలో తరుచుగా కార్లను డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా ఆయన తన ఆశ్రమంలో కొత్త మహీంద్రా థార్ రాక్స్‌ను స్వయంగా నడుపుతూ కనిపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్‌దేవ్ బాబా తన ఆశ్రమం కాంపౌండ్‌లో ఎంతో ఉత్సాహంగా కొత్త రాక్స్‌ను టెస్ట్ డ్రైవింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా యోగా గురువుగానే కాకుండాడ్రైవింగ్‌లో కూడా బాబా చాలా పెర్‌ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇంకా పలు విధాలుగా వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు బిజీగా గడిపే ఆయన థార్ రాక్స్‌ను ఒక విధమైన ఆనందంతో నడిపారు.

అయితే బాబా నడిపిన కారు ఆయన కొన్నారా..? లేక వేరే వారిదా అనే చర్చ కూడా బయట జరుగుతుంది. దీనికి సమాధానం దొరికింది. బాబా నడిపిన థార్ రాక్స్ ఆయనది కాదు. ఆయన సహచరుల్లో ఒకరిది. ఆశ్రమం కాంపౌండ్‌లో కనిపించడంతో సరదాగా అలా టెస్ట్ డ్రైవింగ్ చేశారన్న మాట. థార్ రాక్స్‌ను ఇటీవల మహీంద్రా విడుదల చేసింది. 3 డోర్ థార్‌కు అప్‌డేట్ వెర్షన్‌యే 5 డోర్ థార్ రాక్స్.
బాబా వద్ద ఈ కారు లేనప్పటికి వేరే కార్లు మాత్రం ఉన్నాయి. ఆయనకు కొత్త కార్లు అంటే చాలా ఇష్టం. గతంలో కూడా వేరే కార్లను స్వయంగా నడుపుతూ కనిపించిన వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన వద్ద ఇప్పటికే ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు ఉంది. దీన్ని గత సంవత్సరం జులైలో కొన్నారు. దీని ధర దాదాపు రూ.1.5 కోట్లు.

ఇంత ధర పెట్టి కొనడం అంటే మామూలు విషయం కాదు. ఈ కారు ఇంజిన్ చాలా శక్తివంతమైనది. ఇది 394bhp పవర్, 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కొనుగోలు చేసిన తరువాత స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వీడియోలు గతంలో కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎప్పుడూ యోగాసనాలు చేస్తూ కనిపించే బాబా సరికొత్తగా కారు డ్రైవింగ్ చేయడంతో ఈ వీడియోను చాలా మంది చూశారు.
ఈ కారు కంటే ముందు రామ్‌దేవ్ బాబా వద్ద మహీంద్రా XUV 700 కూడా ఉంది. మొదట్లో ఈ కారును కూడా నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది ఇప్పుడు ఆయన ఆశ్రమంలోనే ఉంది. ఇతర అవసరాలకు ఈ కారును వాడుతున్నారు. దీన్ని తరుచుగా నడుపుతూ ఆయన బయట చాలా సార్లు కనిపించారు.

లగ్ఝరీ కార్లు మాత్రమే కాకుండా ఆయనకు బైకులన్న కూడా చాలా ఇష్టం. గతంలో లగ్జరీ బైకులను నడిపారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇంతకుముందు రామ్‌దేవ్ బాబా ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరోకు చెందినటువంటి ఇంపల్స్ అనే బైకును కూడా నడిపారు. ఈ వీడియో ఇప్పటికి ట్రెండింగ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications








