సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కార్లలో బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ (Bentley)విక్రయిస్తున్న బెంటైగా (Bentayga) ఎస్‌యూవీ కూడా ఒకటి. ఈ కారుకు ఓ చారిత్రాత్మక ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకూ సెడాన్ కార్లను మాత్రమే తయారు చేస్తూ వచ్చిన, బెంట్లీ మొట్టమొదటి సారిగా తయారు చేసిన ఎస్‌యూవీ ఇది. అందుకే, బెంట్లీ బెంటైగాకు ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉంది. లిమిటెడ్ ఎడిషన్ కారణంగా ఈ మోడల్ కూడా చాలా అరుదుగా అందుబాటులో ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

అలాంటి ఓ అరుదైన కారును కొనుగోలు చేశారు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తం యోహాన్ పూనావల్లా. పూనవల్లా ఇంజినీరింగ్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన యోహాన్ స్వతహాగా కార్ ప్రియుడు. ఆయన కార్ కలెక్షన్‌లో ఇప్పటికే అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా, ఇప్పుడు అతను ఇప్పుడు తన కార్ల శ్రేణికి బెంట్లీ బెంటైగాను జోడించాడు. అయితే ఇది సరికొత్త కారు కాదు. ఈ కారు గతంలో వేరొకరికి చెందినది.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ఈ లగ్జరీ ఎస్‌యూవీని జోహన్ పూనవల్లా బిగ్ బాయ్ టాయ్జ్ నుండి కొనుగోలు చేశారు. యోహాన్ పూనావల్లా తన భార్య మిచెల్ పూనావల్లా కోసం ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. యోహాన్ పూనావల్లా వద్ద ఇప్పటికే చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటిలో లాంబోర్ఘిని గల్లార్డో ఎస్ఈ. ఆడి ఆర్ఎస్7, ఫెరారీ 458 స్పెషాలే అపెర్టా, రోల్స్ రాయిస్ డ్రాప్‌హెడ్ కూపే, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ మరియు మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి మొదలైనవి ఉన్నట్లు సమాచారం.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ప్రస్తుతం యోహాన్ పూనవల్లా కొనుగోలు చేసిన బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీ ఖరీదు దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ కారు చాలా అద్భుతమైన డిజైన్ తో మరియు ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ స్పోర్టీ వెర్షన్ కారు 2019 మోడల్ కారు. కానీ ఇది 2020 సంవత్సరంలో రిజిస్టర్ చేయబడింది. ఈ కారు రిజిస్టర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకూ కేవలం 2,800 కిలోమీటర్లు మాత్రమే తిరిగినట్లు సమాచారం.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

బెంట్లీ బెంటైగా లగ్జరీ ఎస్‌యూవీలో శక్తివంతమైన 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, వి8 ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 550 పిఎస్ శక్తిని మరియు 770 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ కారు మొత్తం బరువు 2.3 టన్నులు. ఇది అంత అధిక బరువును కలిగి ఉన్నప్పటికీ, కేవలం 4.9 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ఈ లగ్జరీ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 290 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం, కంపెనీ ఇందులో 6.0 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, డబ్ల్యూ12 ఇంజన్‌తో కూడిన పవర్‌ఫుల్ వేరియంట్ ను కూడా అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 625 పిఎస్ పవర్ ను మరియు 900 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ వెర్షన్ కూడా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అమర్చబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ప్రస్తుతం, బెంట్లీ భారత మార్కెట్లో వి8 వెర్షన్‌ను మాత్రమే విక్రయిస్తోంది. దేశీయ విపణిలో కొత్త బెంట్లీ బెంటైగా వి8 వెర్షన్ ధర రూ. 4.10 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. అయితే యోహాన్ పూనావల్లా కొనుగోలు చేసిన బెంట్లీ బెంటైగా సెకండ్ హ్యాండ్ మోడల్ కాబట్టి, దాని ముందు యజమాని ఎవరు మరియు ఎంత డబ్బు చెల్లించి ఈ కారును కొనుగోలు చేశారు అనే అంశాలపై ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఈ కారు నడిచిన కిలోమీటర్లను బట్టి చూస్తుంటే, దాని ధర కూడా దాదాపు కొత్త కారు ధరకు సమానంగా ఉంటుందని అంచనా.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

బెంట్లీ బెంటైగాలో స్పోర్టీ వెర్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో కొత్త బెంట్లీ బెంటైగా ఎస్ అనే మోడల్ ను అందిస్తోంది. ఇది అనేక ఆఫ్-రోడ్ టెర్రైన్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది. వీటిలో స్నో అండ్ వెట్ గ్రాస్, డర్ట్ అండ్ గ్రావెల్, మడ్ అండ్ ట్రైల్ మరియు సాండ్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ 500 మి.మీ వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. బెంట్లీ బెంటైగా ఎస్ మెరుగైన స్పోర్ట్ మోడ్ ద్వారా ఉత్తమ సామర్థ్యాన్ని అందిస్తుంది.

సెకండ్ హ్యాండ్ బెంట్లీ బెంటైగా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త!

ఈ స్పోర్టీ మోడల్ ఎయిర్ సస్పెన్షన్ డంపింగ్‌లో అదనంగా 15 శాతం పెరుగుదల ఉంటుంది మరియు ఇందులోని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కారణంగా మెరుగైన స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ మరియు తక్కువ బాడీ-రోల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ అధునాతన బెంట్లీ ఎస్ ఎస్‌యూవీలో బెంట్లీ డైనమిక్ రైడ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ టెక్నాలజీని కలిగిన ఎస్‌యూవీ. అంటే, ఈ కారుని వేగంగా నడుపుతున్నప్పుడు లేదా మలుపుల వద్ద ప్రమాదవశాత్తూ దొర్లిపోకుండా ఉండేందుకు ఈ ఫీచర్ సహకరిస్తుంది.

Most Read Articles

English summary
Yohan poonawalla brought pre owned bentley bentayga luxury suv details
Story first published: Tuesday, January 25, 2022, 17:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X