Yokohama లేడిస్‌ స్పెషల్‌.. అట్టహాసంగా ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీ

యోకోహామా నుంచి ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న యోకోహామా WOW ర్యాలీ (ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌) తొలి ఎడిషన్‌ బెంగళూరు నగరంలో ఇవాళ అట్టహాసం ప్రారంభించ బడింది. TSD (ట్రైమ్‌ స్పీడ్‌ డిస్టెన్స్) ట్రెజర్‌ హంట్‌ ఫార్మాట్‌ ర్యాలీలో భాగంగా అనేక మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీలో సుమారు 50 పైగా కార్లు పాల్గొన్నాయి.

ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీపై యోకోహామా ఇండియా డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ హోన్‌మోడ్‌ స్పందించారు. ఈ ర్యాలీకి వచ్చిన మహిళల స్పందన.. తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. కేవలం ప్రయాణం మాత్రమే తమ ఉద్దేశం కాదని, డ్రైవింగ్‌ చేసే మహిళలను ఒకే దగ్గరకు చేర్చడం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని హర్షవర్ధన్‌ హోన్‌మోడ్‌ తెలిపారు.

Yokohama first women on wheels

దీంతోపాటు ఈ ర్యాలీలో పాల్గొన్న వారి నైపుణ్యం, ఉత్సాహం ఎంతో స్ఫూర్తిదాయకమని యోకోహామా ఇండియా డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ హోన్‌మోడ్‌ తెలిపారు. ‌డ్రైవింగ్‌ను వీలైనంత సౌకర్యవంతంగా చేసేందుకు మరియు ప్రతి వినియోగదారుడిని మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉంటామని చెప్పేందుకే ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు హర్షవర్ధన్‌ హోన్‌మోడ్‌ చెప్పారు.

యోకోహామా ర్యాలీలో పాల్గొనేందుకు ప్రముఖ రేడియో ఆర్‌జే మలిష్కా ముంబయి నుంచి బెంగళూరుకు వచ్చారు. కొత్త మార్గాలు, అవాంతరాలను ఛేదించడాన్ని తాను బాగా నమ్ముతానని మలిష్కా తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి సాహసం చేసిన అనుభూతి మరియు వినోదం రెండు పొందుతారని ఆర్‌జే మలిష్కా పేర్కొన్నారు.

గత చాలా సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువ అవుతుందని.. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన కరుణా శర్మ తెలిపారు. కేవలం వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌ మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుంచి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

యోకోహామా ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. సుమారు 80 నుంచి 100 కి.మీ దూరం ప్రయాణం చేశారు. ఈ ర్యాలీలో మహిళా జౌత్సాహికులు మరియు పలు రంగాల నిపుణులను రెండు కేటగిరీలుగా విభజించారు. వారంతా ఉత్సాహ వంతంగా పోటీల్లో పాల్గొన్నారు. మరియు బహుమతుల కోసం పోటీపడ్డారు. యోకోహామా ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీలో పాల్గొన్న వారు థ్రిల్లింగ్ అనుభూతిని పొందారని నిర్వహకులు వెల్లడించారు.

యోకోహామా ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ ర్యాలీకి చేతన్‌ శివ్‌రాం మోటార్స్‌ గ్రౌండ్‌ భాగస్వామిగా మరియు షేతరన్‌ గ్రాండ్‌ బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ హోటర్‌ & కన్వెన్షన్‌ సెంటర్‌ ఆతిత్య భాగస్వామిగా వ్యవహరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటో మొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. అందరికి ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 22, 2023, 13:58 [IST]
English summary
Yokohama first women on wheels cars rally got succeed in bangalore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+