ఈ పడవలో వారం రోజులు ప్రయాణించాలంటే రూ. 27 కోట్లు.. రారాజులా బతికేయొచ్చు.!!
ప్రపంచాన్ని మర్చిపోయి ఓ కొత్త ఆనంద లోకంలో ఓ వారం రోజులు గడపాలి అనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ వారం రోజులూ మీరు అక్కడ ఓ రారాజులా బతికేయొచ్చు. ఆ ప్రపంచం ఎక్కడో కాదు ఓ పెద్ద పడవలో.. ఏంటీ పడవలో లగ్జరీ సౌకర్యాలు ఏంటని అనుకుంటున్నారా.?? అవునండీ.. ఈ లగ్జరీ పడవ పేరు Kismet MegaYacht...
రూ.27 కోట్లు ఖర్చు చేస్తే 'కిస్మత్' అనే ఆనంద పడవలో 1 వారం రోజులు మీరు రారాజులా జీవించవచ్చు. ఆశ్చర్యపోతున్నారా.. అవును మరీ.. ఇందులో అందుకు తగినట్లుగా ఓ ఖరీదైన ప్రపంచమే ఉంది. ఇంతకీ.. ఈ లగ్జరీ యాచ్ట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఈ పడవను ఎవరు తయారు చేశారు.? ఇందులో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి.? పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఒక సంపన్న అమెరికన్ తన వద్ద ఉన్న ఓ యాచ్ట్‌ను అప్‌గ్రేడ్ చేసి, దానిని తిరిగి సేవలోకి తీసుకురావడానికి సిద్ధం చేశారు. ఈ పెద్ద పడవను 'లగ్జరీ యాచ్ట్'గా మార్చి వ్యాపారం ప్రారంభించబోతున్నారు. ఆ క్రూయిజ్ షిప్ పేరు 'Kismet'. 'కిస్మత్' అంటే రాయల్ అని కూడా అర్థం వస్తుంది.
అమెరికన్ వ్యాపారవేత్త షాహిద్ ఖాన్.. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి 2018లో తన యాచ్‌ని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంత పెద్ద లగ్జరీ యాచ్ట్‌ను అప్‌గ్రేడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ బోట్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి మొత్తం 360 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.3,000 కోట్లు.

అంతేకాదు ఇది షాహిద్ ఖాన్ యొక్క 3వ Kismet Yacht. ఆయన 2007లో తొలిసారిగా 60 మీటర్ల పొడవున్న కిస్మెత్ అనే చిన్న ఆనంద పడవను ప్రారంభించారు. అయితే ఈ రెండు కిస్మెత్ యాచ్ట్‌లతో పోలిస్తే, కొత్త కిస్మెత్ యాచ్ పెద్దదిగా కనిపిస్తూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 3వ కిస్మెత్ 'ప్లెజర్ బోట్' అనే పేరుకు అనుగుణంగా ఉంటుందట.. దీని పొడవు 400 అడుగులు.. అంటే 122 మీటర్లు ఉంటుంది.

మొత్తం 6 డెక్‌లతో నిర్మితమైన ఈ పడవను 'జిగా యాచ్ట్' అని కూడా పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రేమండ్ లాంగ్డన్ డిజైన్ గ్రూప్ సహకారంతో షాహిద్ ఖాన్ కుటుంబం యాచ్ లోపలి భాగాన్ని సర్వాంగ సుందరగా డిజైన్ చేసింది. అయితే దీన్ని అప్‌గ్రేడ్ చేసిన తర్వాత, ఈ కిస్మెట్ యాచ్ట్ ఇంకా వ్యాపారాన్ని ప్రారంభించలేదు. ఇది త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
సేవలోకి వచ్చిన తర్వాత, ఈ ఫెర్రీలో టిక్కెట్లు వేర్వేరు ధరలకు విక్రయించబడతాయి. ఇందులో టిక్కెట్లు గరిష్ఠంగా 33 లక్షల డాలర్లకు భారత కరెన్సీలో రూ. 27.30 కోట్లకు విక్రయించబడుతుంది. రూ. 27 కోట్లు పెట్టి టికెట్ కొంటే మీరు ఈ కిస్మత్ బోట్‌లో వారం రోజులు రారాజులా గడిపేయొచ్చు. అయితే ఈ కిస్మెత్ బోట్‌లో మొత్తం 50 మంది ఉంటారు.

ఈ క్రూయిజ్‌లో మొత్తం 6 సూట్‌లు ఉంటాయి. గరిష్ఠంగా 14 మంది ప్రయాణికులకు అనుమతి ఉంటుంది. 50 మందిలో, మిగిలిన 36 మంది సిబ్బంది కావడం ఆశ్చర్యకరం. అంటే 14 మంది కస్టమర్లకు సర్వీస్ చేసేందుకు ఈ 36 మంది బోటులో నియమించబడతారు. ఈ 36 మందిలో పడవ నడిపే కెప్టెన్ కూడా ఉంటాడు.

ఈ బోట్‌లో 6 సూట్‌లలో ఉన్నవారు అవసరమైతే ఒకే చోట కలుసుకునేలా ఒక ప్రాంతాన్ని కూడా ఇందులో రూపొందించారు. ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ కిస్మత్ యాచ్డ్.. నీళ్లపై తేలియాడే ఓ చిన్న ద్వీపంలా కనిపిస్తుంది. ప్రయాణికులు, సిబ్బందిలో వారి ఆరోగ్య, మానసిక స్థితులకు సంబంధించి ఈ ప్రయాణంలో ఎటువంటి అసౌకర్యానికి గురి కారని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








