కొత్త కారు కొనాలా? లేక పాత కారు కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా?.. ఇదిగో టిప్స్..
కారు కొనాలనుకోవడం ప్రతి ఒక్కరి కల. తమ సంపాదనలో పొదుపు చేసిన మొత్తంతో కుటుంబ అవసరాల కోసం కారును కొనాలని నిర్ణయించుకుంటారు. కానీ చాలా మంది కొత్త కారు కొనుగోలుదారులకు ఓ సందేహం ఉంటుంది. కొత్త కారు కొనుగోలు చేయాలా లేదంటే సెకండ్ హ్యాడ్‌లో కొనాలా అని ఆలోచిస్తుంటారు. వారి కోసం ఈ కథనం.
కారు కొనాలని నిర్ణయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. వ్యక్తి తన సంపాదనలో పొదుపు చేసిన మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేస్తారు. తన మొదటి కారును కొనుగోలు చేసేటప్పుడు అందుకు సంబంధించి అనేక అంశాల గురించి ఆలోచించి, ఏ కారును కొనుగోలు చేయాలో నిర్ణయిస్తారు. లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

తమ మొదటి కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది కొత్త కారును కొనుగోలు చేయాలా లేక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయాలా అనే అయోమయంలో ఉంటారు. కొందరికి కొత్త కార్లతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరికొంతమంది సెకండ్ హ్యాండ్‌లో కారును కొనుగోలు చేసిన తర్వాత ఆ కారు సర్వీసు బాగాలేకపోతే మళ్లీ వేలల్లో ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది.
కొత్త కారు విషయానికొస్తే, ఈ రోజుల్లో కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం, రూ. 3 లక్షలతో మంచి కొత్త కారును కొనుగోలు చేయవచ్చు. కానీ నేడు కనీసం రూ.5 లక్షలు కావాలి. ఈ క్రమంలో చాలా మంది మొదటిసారి కారు కొనుగోలు చేసేట్పపుడు రుణం తీసుకొని లేదా ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కార్ల విషయానికొస్తే మార్కెట్‌లో తక్కువ ధరలకే లభిస్తాయి. అయితే పాడైపోయిన విడిభాగాలు లేదా డూప్లికేట్ భాగాలు ఉన్న వాహనాలను కూడా కొందరు తెలివిగా మోసపూరితంగా విక్రయించే అవకాశం ఉంది. మనం అప్రమత్తంగా లేకపోతే.. కారు కొనుగోలు చేసిన తర్వాత మరమ్మతుల కోసం మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా కారు యొక్క సగటు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాలు లేదా 1 లక్షల నుంచి 1.5 లక్షల కి.మీ. ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఏడాదికి సగటున 10 వేల కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏ తరహా కారు కొనాలో చూద్దాం.

ఉదాహరణగా చూసుకుంటే మీ చేతిలో రూ.4 లక్షలు ఉన్నాయనుకుందాం. మీరు దానితో స్పోర్ట్స్ పెట్రోల్ కారు కొనాలనుకుంటున్నారని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆ బడ్జెట్‌లో హ్యుందాయ్ ఐ20 కారు మీకు ఉత్తమ ఎంపిక. దీని కొత్త కారు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.9 లక్షలు ఉంది.
మీ చేతిలో ఉన్న రూ.4 లక్షలు పోను మిగిలిన రూ.5 లక్షలను లోన్ ద్వారా కొనుగోలు చేస్తే.. దాని కోసం, మీరు 6 సంవత్సరాలకు సంవత్సరానికి 10 శాతం వడ్డీగా చూసుకుంటే, మీరు రూ. 1.5 లక్షలు ఎక్కువగా చెల్లించాలి. కాబట్టి మొత్తంగా మీరు ఈ కారును కొనుగోలు చేయడానికి రూ. 10.5 లక్షలు వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది.
అంటే 20 వేల కి.మీ లేదా లేదా 2 సంవత్సరాల పాత కారు మార్కెట్‌లో మీరు ఈ కారును రూ. 4.5 లక్షలకు విక్రయించవచ్చు. కొత్త కారు కొనడం కంటే దీన్ని కొంటే మీకు రూ.6 లక్షలు తక్కువ ఖర్చు అవుతుంది. వాడిన కారు కొన్న తర్వాత ఖర్చు తక్కువగా ఉంటుందని లెక్కలేసుకుందాం.
వాడిన కారు కొంటే ఆ వాహనం ఇచ్చే మైలేజీ తక్కువగా ఉంటుంది. అందుకు మీరు రూ.20 - 30 వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే ఎలాగైనా రూ.2 లక్షలకు మించదు. అలా చూసుకుంటే పాత కారు కొంటే మీకు గరిష్ఠంగా రూ.6.5 లక్షలు అవుతుంది. ఎలాగైనా రూ.4 లక్షల లాభం ఉంటుంది.
కొత్తగా కారు కొనాలనుకునేవారు కొత్త కారు కంటే ఉపయోగించిన కారును కొనుగోలు చేయడం లాభదాయకంగా ఉండవచ్చు. అయితే ఉపయోగించిన కారును కొనుగోలు చేసేటప్పుడు, మీరు దాని స్థితిగతులను సరిగ్గా చూడాలి. అప్రమత్తంగా లేకపోతే డ్యామేజ్ అయిన కారు కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో 20 వేల కి.మీ కంటే ఎక్కువ నడిచిన కారును కొనుగోలు చేస్తే సమస్య వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








