భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

మనదేశంలో రైలు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే రంగు బ్లూ లేదా మెరూన్. ఎక్కువగా ప్యాసింజర్ రైళ్లు బ్లూ కలర్ లో కనిపిస్తాయి, గూడ్స్ రైళ్లు మెరూన్ కలర్ లో కనిపిస్తాయి. అయితే, భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సంచరించే రైళ్లు వివిధ రకాల రంగులతో కూడిన కోచ్‌లను కలిగి ఉంటాయి. మరి ఈ కోచ్ ల రంగు మాత్రమే భిన్నంగా ఉంటుందా? లేక ఈ కోచ్‌ల లోపలి వైపు కూడా ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా అని చాలా మందికి సందేహం ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతుంటే, ఈ కథనం మీకు ఖచ్చితంగా సందేహాలను తీరుస్తుంది.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

భారతీయ రైల్వేస్ కోచ్ లపై ఈ నిర్దిష్ట రంగులను ఉపయోగించటానికి ఒక కారణం ఉంది మరియు ఆ కోచ్‌లలో కూడా భారీ వ్యత్యాసం ఉంటుంది. విభిన్న రంగులు వేర్వేరు కోచ్ మోడల్‌లను సూచిస్తాయి. కోచ్‌ల వైపు ఉన్న చారల రంగు కూడా చాలా ముఖ్యమైనదాన్ని సూచిస్తుంది. ఈ కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత, నిర్దిష్ట కోచ్‌లో ఏ తరగతి (క్లాస్) సీటింగ్ ఉంది, అది ఎలాంటి రైలు, మొదలైనవాటిని మీరు కూడా చెప్పగలుగుతారు.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

నీలం రంగు ఐసిఎఫ్ కోచ్ (Blue-Coloured ICF Coach)

భారతీయ రైల్వేలలో చాలా వరకు రైళ్లు బ్లూ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తాయి. ఇది ICF కోచ్ అని సూచిస్తుంది. ఇక్కడ ICF అంటే చెన్నైకి సమీపంలోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇక్కడే ఈ కోచ్‌ల డిజైన్ మరియు డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఇది భారతదేశంలో అత్యంత సాంప్రదాయమైన కోచ్ మరియు ఇది మెయిల్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు మరియు ఇతర ప్యాసింజర్ రైళ్లలో కనిపిస్తుంది.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఈ కోచ్‌లు గరిష్టంగా 140కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటాయి మరియు ఇవి భారతదేశంలోని ఎంట్రీ లెవల్ కోచ్‌లు. ఈ కోచ్‌లు విభిన్న ప్రయోజనాలకు ఉపయోగపడతాయని చూపించడానికి వేర్వేరు గీతలను కలిగి ఉంటాయి. విండో లైన్ పైన ఉన్న కోచ్ చివర వికర్ణ పసుపు లేదా తెలుపు చారలు ఉంటే అది రిజర్వ్ చేయని సాధారణ తరగతి కంపార్ట్‌మెంట్ అని సూచిస్తుంది. అదే ఈ చారలు లేకపోయినట్లయితే, అది స్లీపర్ కోచ్ అని చూపిస్తుంది.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి కోచ్‌లు (LHB Coaches) మరియు వాటి విభిన్న రంగులు

ఇక్కడ ఎల్‌హెచ్‌బి అంటే లింక్ హాఫ్‌మాన్ బుష్ (Linke-Hofmann-Busch), ఇది ఈ కోచ్‌లను మొదటగా రూపొందించిన కంపెనీ పేరు. ఈ కంపెనీ పోలాండ్‌లో ఉంది మరియు దాని కోచ్‌లను జర్మనీలో ఉత్పత్తి చేయబడుతాయి. భారతదేశంలో మొదటి బ్యాచ్ కోచ్‌లు దిగుమతి చేయబడ్డాయి, ఆ తర్వాతి కాలంలో భారతీయ రైల్వేలు తమ స్వంత డిజైన్ వెర్షన్‌ను అభివృద్ధి చేసి, వాటికి LHB అని నామకరణం చేశారు.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఈ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు అల్యూమినియంతో తయారు చేయబడి ఉంటాయి మరియు ఇవి ICF కంటే తేలికగా ఉంటాయి. అంటే దీని అర్థం, ఇవి ఐసిఎఫ్ రైళ్ల కన్నా వేగంగా వెళ్లగలవన్నమాట. ఇది గంటకు 200కిమీల వేగంతో వెళ్లగలిగినప్పటికీ, భారతీయ రైల్వేలు వీటి వేగాన్ని గంటకు 180 కిమీ వరకు మాత్రమే పరీక్షించి, 160 కిమీ/గం వేగంతో నడుపుతోంది. రైళ్లపై విభిన్న రంగులు అంటే, వివిధ ఆపరేటింగ్ సామర్థ్యాలు అని కూడా అర్థం.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి రాజధాని (LHB Rajdhani)

ఈ కోచ్‌లు ఎరుపు రంగులో ఉంటాయి, దిగువన మరియు ఎగువన బూడిద రంగులో పెయింట్ చేయబడి ఉంటాయి.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి శతాబ్ది (LHB Shatabdi)

ఎల్‌హెచ్‌బి శతాబ్ది కోచ్‌లు పై భాగంలో లేత నీలం రంగు (లైట్ బ్లూ కలర్) మరియు దిగువ భాగంలో బూడిద రంగు (గ్రే కలర్) లో పెయింట్ చేయబడి ఉంటాయి.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి డబుల్ డెక్కర్ (LHB Double-Decker)

ఇది భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన రైళ్లలో ఒకటి మరియు ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన మార్గాలలో మాత్రమే ఈ రైళ్లు నడపబడుతున్నాయి. ఇది స్లీపర్‌లకు బదులుగా సీట్లతో కూడిన డబుల్ డెక్కర్, కాబట్టి ఇవి చిన్న ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించబడుతాయి. ఇది పసుపు (యల్లో) మరియు నారింజ (ఆరెంజ్) రంగులలో అలంకరించబడి ఉంటుంది.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి దురంతో (LHB Duronto)

ఎల్‌హెచ్‌బి దురంతో కోచ్ లపై బహుళ రంగులు ఉంటాయి. ఈ పెయింట్ జాబ్‌గా చాలా ప్రత్యేకంగా మరియు అంతే క్లిష్టంగా ఉంటుంది కాబట్టి, దీనికి పెయింట్ కి బదులుగా వినైల్ వ్రాప్ ని ఉపయోగిస్తారు.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి హమ్సఫర్ (LHB Humsafar)

ఇవి అసాధారణంగా కనిపించే రైళ్లు మరియు చాలా అరుదైనవి. ఈ కోచ్ లకు దిగువన నారింజ (ఆరెంజ్) మరియు ఆకుపచ్చ (గ్రీన్) రంగులతో ప్రత్యేకమైన బ్లూ వినైల్‌ను కలిగి ఉంటాయి.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి గతిమాన్ (LHB Gatimaan)

గతిమాన్ భారతీయ రైల్వేలలో సరికొత్తగా వచ్చిన మోడళ్లలో ఒకటి మరియు ఇది దాని పూర్తి వేగానికి (ఫుల్ స్పీడ్) కి ప్రసిద్ధి చెందింది. ఈ రైలు క్రమం తప్పకుండా గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది నీలి రంగు కోచ్‌లను కలిగి ఉంటుంది మరియు దిగువ భాగంలో బూడిద రంగు ఉంటుంది.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి తేజస్ (LHB Tejas)

తేజస్ భారతీయ రైల్వేలో అత్యంత ఆధునిక కోచ్‌లలో ఒకటి. ఈ కోచ్‌ల తలుపులు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) గా ఉంటాయి మరియు ఈ కోచ్‌లు ప్రత్యేకమైన పసుపు (యల్లో) మరియు నారింజ (ఆరెంజ్) వినైల్‌ వ్రాప్ ను కలిగి ఉంటాయి.

భారతదేశంలో రైళ్లు వివిధ రకాల రంగులను కలిగి ఉంటాయి, ఎందుకో తెలుసా?

ఎల్‌హెచ్‌బి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (LHB Antyodaya Express)

ఇవి ఎల్‌హెచ్‌బి కోచ్‌లు మరియు అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ మొత్తం అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంది, ఈ రైలు పనిచేసే విధానంలో ఇదే దాని ప్రత్యేకతగా ఉంటుంది. ఈ కోచ్‌లు ఎరుపు (రెడ్) రంగులో ఉంటాయి మరియు విండో లైన్ వద్ద పసుపు (యల్లో) రంగు ఉంటుంది.

https://telugu.drivespark.com/four-wheelers/2022/mahindra-xuv300-electric-suv-to-be-launched-in-2023-first-quarter-details-020260.html

Article Published On: Wednesday, June 1, 2022, 9:52 [IST]
English summary
You can tell the train name by its color indian railways trains colour codes
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+