Circular Ticket ఈ ఒక్క రైల్‌ టికెట్‌తో 56 రోజులు ప్రయాణించవచ్చు.. జనరల్‌ టికెట్‌ కంటే ధర తక్కువ!!

భారతీయ రైల్వేలో ఎక్కువగా జనాలు ప్రయాణిస్తుంటారు. బీద, మధ్య తరగతికి చెందిన వారంతా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ఎక్కువగా సామాగ్రి తరలించాలనుకుంటే రైల్వే రవాణాను ఎంచుకుంటారు. అందుకు తగినట్లుగానే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ల ధరలను అందుబాటులో ఉంచుతుంది.

అయితే భారతీయ రైల్వే అందించే టికెట్లపై చాలా మందికి అవగాహన ఉండదు. ముఖ్యంగా జనరల్‌ టికెట్ కౌంటర్‌ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. వీటితో పాటు స్లీపర్, సెమీ స్లీపర్‌, ఏసీ, వికలాంగులు లేదా వృద్ధులకు ప్రత్యేక టికెట్ల సదుపాయం ఉంటుంది. ఇవి కాకుండా ఆఫ్‌లైన్‌లో వివిధ రకాల సదుపాయలతో రైల్వే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తీర్థ యాత్రలకు ప్రయాణించే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి.

Circular-Train

వీటిలో చాలామందికి రైల్వే అందించే ఆఫర్లు, బల్క్‌ టికెట్ల విక్రయాల గురించి అవగాహన చాలా తక్కువ. సామాన్యుల నుంచి మొదలు సంపన్నల వరకు తీర్థ యాత్రలు ఇతర డెస్టినేషన్‌ల కోసం భారతీయ రైల్వే సర్వీసులను వినియోగించుకుంటారు. అందులో భాగంగా దూర ప్రాంతాలు లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ఇతర విహార యాత్రల వంటి వాటి కోసం భారతీయ రైల్వే ఫుల్ టారిఫ్ రేట్ (FTR) అనే సేవను అందిస్తుంది.

FTRని ఉపయోగించుకుని రైలులోని ఒక పూర్తి కోచ్ లేదా మొత్తం రైలును రిజర్వ్ చేసుకోవచ్చు. దీనిని ఎనేబుల్‌ చేసుకోవడానికి https://www.ftr.irctc.co.in/ftr అధికారిక వెబ్‌సైట్‌లో బల్క్‌ టికెట్లు పొందవచ్చు. వీటితో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం మరొక టికెట్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు 56 రోజులు ప్రయాణించవచ్చు. ఇది కూడా ఓ డెస్టినేషన్‌ టికెట్‌ల ప్రయాణికులకు సహాయ పడుతుంది.

Circular-Train

అయితే ఈ టికెట్‌లో ఒక ప్రాంతం నుంచి మరొక స్థానానికి మాత్రమే వెళ్లే వెసులు బాటు ఉంటుంది. కానీ ఒక టికెట్‌తో 8 స్టేషన్లు మారుతూ వచ్చే ‌అవకాశం కొన్ని స్థానాలకు కూడా ఉంటుంది. ఒక స్థానం నుంచి మరొక స్థానానికి సింగల్‌గా లేదా ఫ్యామిలీతో వెళ్లాలనుకునేవారి మరొక టికెట్‌ కూడా ‌అందుబాటులో ఉంది. దానిపేరే సర్క్యూలర్‌ టికెట్‌. దీనికోసం ఈ టికెట్‌ తీసుకున్న వారు 56 రోజుల్లో ఎనిమిది ప్రదేశాలు మారుతూ తమ గమ్యాన్ని చేరుకోవచ్చు.

సర్క్యులర్ జర్నీ టికెట్ అనేది సాధారణ టికెట్‌ లాంటిదే. ఈ టికెట్ తో ఏకంగా 56 రోజుల పాటు ప్రయాణం చేయవచ్చు. మీకు నచ్చిన ముఖ్యమైన ఎనిమిది ప్రదేశాలను మారుతు ఈ టికెట్‌ని ఉపయోగించుకోవచ్చు. తీర్థ యాత్రలు లేదా ఇతర డెస్టినేషన్‌ ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ టికెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Circular-Train

కొంతమంది దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రాంతాలకు ప్రయాణించల్సి వస్తుంది. అంతే కాకుండా టికెట్ల కోసం ఎక్కువ డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా గమ్య స్థానం నుంచి మళ్లీ చేరుకోవాల్సిన స్టేషన్‌కి ఊహించని విధంగా తక్కువ ధరలో ప్రయాణానికి వీలుంటుంది. ఈ టికెట్‌ని ఎలా బుక్‌ చేసుకోవాలో ఓ సారి పరిశీలిద్దాం.

ఉదాహరణకు మీరు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయలు దేరారు అనుకోండిు. అక్కడి నుంచి మీరు ఊటీ లేదా ఇతర ఆథ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే ఈ టికెట్‌తో ప్రయాణించవచ్చు. అంటే మీ జర్నీ ప్రారంభమైన సికింద్రాబాద్‌ నుంచి తిరిగి 8 మెయిన్‌ స్టేషన్ల తర్వాత మళ్లీ సికింద్రాబాద్‌ చేరుకునే అవకాశం మీకు ఉంటుంది. దీనిని ఒక సర్కిల్‌గా అధికారులు నిర్ణయిస్తారు. దీనినే సర్క్యూలర్ జర్నీగా ప్రయాణికులు భావించాలి.

ముందుగా ఈ సర్క్యులర్ జర్నీ టికెట్‌ కావాలనుకునేవారు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్‌కి దరఖాస్తు చేసుకోవాలి. మీ జర్నీ ఆధారంగా టికెట్‌ ధర నిర్ణయించబడుతుంది. ఇది పూర్తయిన తర్వాత మీ జర్నీకి సంబంధించి ప్లాన్‌ వివరాలు అక్కడి స్టేషన్ మేనేజర్‌కు తెలియజేస్తారు. మీరు రైలు ఎక్కే ప్రదేశంలోని స్టేషన్ బుకింగ్ కౌంటర్‌ వద్ద సర్క్యులర్ టికెట్‌ని తీసుకోవచ్చు.

సాధారణంగా 400 కిలోమీటర్ల దూరానికి 1 రోజుగా.. ప్రయాణం చేయని రోజుల్లో 200 కిలో మీటర్లు కౌంట్‌ రైల్వే లెక్కిస్తుంది. సర్క్యులర్ టికెట్‌పై ప్రయాణికుడి సంతకం కచ్చితంగా ఉండాలి. అంతే కాకుండా 1000 కిలో మీటర్ల దూరం లోపు ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు సర్క్యులర్ జర్నీ టికెట్లపై సబ్సిడీ లభిస్తుంది. ఇలా మరెన్నో రైల్వే టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, December 3, 2023, 10:00 [IST]
English summary
You can travel 56 days with circular train ticket full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+