మీ కారు ఇంజిన్‌లోకి వరద నీరు చేరిందా.. ఈ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.!!
మిచాంగ్ తుపాను కారణంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు వరదల్లో చిక్కకున్నాయి. తెలంగాణలోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో వరద నీటిలో వాహనాలు మునిగిపోయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీని వల్ల మీ కారు లేదా ఇతర వాహనం ఏదైనా రిపేర్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం సరైన మెకానిక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మిచాంగ్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ప్రధాన నగరాలను వరద చుట్టుముట్టింది. చాలా చోట్ల నీటి ఎద్దడి కొనసాగుతోంది. వరద ప్రభావ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల కోసం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో వాహనాలపై కూడా వరద నీటి ప్రభావం తీవ్రంగా పడింది.

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాలు, అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో నిలిచిన వాహనాలు వరద నీటితో చుట్టుముట్టడంతో ఆ నీరు కార్ల లోపలికి చేరుతోంది. దీంతో వాహనాల్లో ఇంజిన్, ఇతర భాగాలు దెబ్బతింటున్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలను నీటి ఎద్దడి తగ్గిన తర్వాత మెకానిక్ వద్దకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలి.
మీ కారు వరద నీటిలో చిక్కుకున్నట్లయితే.. ఇంజిన్‌లోకి నీరు చేరే అవకాశం ఉంది. కాబట్టి నైపుణ్యం కలిగిన మెకానిక్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేసిన తర్వాతే మీ కారును స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సరైన మెకానిక్‌ని ఎలా ఎంచుకోవాలో ఇక్కడ మీకు కొన్ని సలహాలు అందిస్తున్నాం.

వర్షపు నీటి వల్ల మీ వాహనం పాడైపోయిందని, వరద నీరు మీ కారు ఇంజిన్‌లోకి చేరిందని మీకు అనిపిస్తే, ముందుగా సరైన మెకానిక్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఇది కొత్త కారు అయితే, ఆటోమేకర్ నడుపుతున్న సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. సంబంధింత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడమే ఇక్కడ మంచి ఆప్షన్.
మీరు మీ కారును సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లిన తర్వాత, అక్కడ చాలా వాహనాలు సర్సీస్ కోసం వేచి ఉండొచ్చు. ఈ క్రమంలో మీ వాహనాన్ని సర్వీస్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందో మెకానిక్‌ను అడిగి తెలుసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లయితే.. అదే కంపెనీకి చెందిన మరో సర్వీస్ సెంటర్‌కు వెళ్లండి.

ఈ క్రమంలో మీరు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాక అక్కడ ఎంత సమయం పడుతుందో ముందుగానే మీరొక అంచనాకి రావాలి. అదేవిధంగా వాహనం ఇంజిన్‌లోకి నీరు చేరిందని మీరు భావిస్తే ఇంజిన్‌ని తొలగించి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంజిన్‌ను విడదీయడం చాలా బాధ్యతాయుతమైన పని. కాబట్టి దీనిని ఎన్ని రోజులు గ్యారెంటీ ఇస్తారో వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.
ఒకవేళ మీరు పాత కారు వాడుతున్నట్లయితే షోరూమ్ సర్వీస్ సెంటర్‌కి తీసుకుపోలేరు. షోరూమ్ సర్వీస్ సెంటర్ మీ నివాసానికి సమీపంలో లేకపోయినా మీరు దానిని సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉండదు. మీరు సమీపంలోని మరొక మెకానిక్ కోసం వెతకాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ప్రొఫెషనల్ మెకానిక్‌ని ఎంచుకోవడం మంచి ఆప్షన్.

అదే సమయంలో, మీ సమస్యను పరిష్కరించడానికి ఏ మెకానిక్ ఎంత ఛార్జీలు వసూలు చేస్తారో ముందుగానే తెలుసుకోవాలి. ఇంజిన్‌ను వేరు చేసి, దానిపై పని చేయడానికి చాలా ఖర్చు అవుతుండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుని మీ వాహనాన్ని సర్వీసింగ్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలి.
వరదల కారణంగా మీ వాహనంలోకి నీరు చేరినట్లయితే, అది ఖచ్చితంగా ఇంజిన్‌లోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రిపేర్లను బాగా అనుభవం ఉన్న మెకానిక్ మాత్రమే చేయగలరు. కాబట్టి మీరు మీ వాహనాన్ని రిపేర్ లేదా సర్వీసింగ్ చేయించాలి అనుకున్నప్పుడు మంచి మెకానిక్‌ను ఎంచుకోవాలి.



Click it and Unblock the Notifications








