వర్షం పడిన తర్వాత కారు శుభ్రం చేయకుండా వదిలేస్తున్నారా?? అయితే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు..!
వర్షాకాలంలో రోడ్లపై బురద, వరదల కారణంగా వాహనాలను తరచుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. టైర్లతో పాటు వాహనాలపై మట్టి పడటంతో ఈ సీజన్‌లో తరచూ వాహనదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొంతమంది వర్షం పడుతుండగా తమ వాహనాలను అలాగే ఉంచుతారు. ఆ నీటిని శుభ్రం అవుతాయనే ఉద్దేశంతో. కానీ అది చాలా పొరపాటు.
చాలా మంది కార్ల యజమానులు వర్షం పడిన తర్వాత తమ కార్లను కడగడం అవసరమా అని అనుకుంటారు. వర్షం పడుతుండగా ఆ నీళ్లతో కారు శుభ్రం అవుతుందిలే అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు రిపేర్లను కొనితెచ్చుకున్నట్లే. వర్షం తర్వాత మీ కారును కడగడం చాలా అవసరం. వర్షం పడిన తర్వాత మీ కారు నిర్వహణపై దృష్టి సారించాలి. అదెలా అంటే..

వర్షపు నీటిలో దుమ్ము, కాలుష్య కారకాలతో వివిధ మలినాలు ఉంటాయి. వర్షపు నీటిలో మీ కారు తడుస్తున్నప్పుడు ఈ కలుషితాలు కారుపై చేరతాయి. ఈ ప్రభావంతో మున్ముందు కారు రంగు పోయే అవకాశం ఉంది. వెంటనే కారును శుభ్రం చేయడం ద్వారా మలినాలు పోయి కారు కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది.
చాలా మంది వర్షపు నీరు పూర్తిగా స్వచ్ఛమైనదిగా భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. వాతావరణంలో కాలుష్యం కారణంగా ఆ నీటిలో కొద్దిగా ఆమ్లం ఉంటుంది. దీని ద్వారా కారులో కొన్ని కెమికల్ మార్పులు జరిగే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వర్షం తర్వాత మీ కారును క్రమం తప్పకుండా కడగడం వల్ల వానాకాలంలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి ఇతర మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలా చేయడం ద్వారా వర్షపు నీటిలోని ఆమ్ల మూలకాల వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు. వర్షం తర్వాత వెంటనే కారును కడగడం వల్ల దాని ఎక్స్‌టీరియర్ భాగాల నుంచి హానికరమైన పదార్థాలు వెంటనే తొలగిపోతాయి. దీన వల్ల కారుపై తుప్పు ఏర్పడకుండా ఉంటుంది.
వర్షపు నీటి ద్వారా తరచుగా మీ కారు కిటికీలు, అద్దాలు మరియు లైట్లపై నీటి మచ్చలను ఏర్పడతాయి. వర్షం తర్వాత మీ కారును కడగడం వలన ఈ నీటి మచ్చలు తొలగిపోయి అద్దాలు నీట్‌గా ఉండటంతో మీ దృశ్య మానత మెరుగుపడుతుతంది. దీని ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ అనుభవించవచ్చు.

వర్షం పడిన తర్వాత మీ కారును క్రమం తప్పకుండా కడగడం వల్ల అది శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా దాని మొత్తం పరిశుభ్రతకు దోహదం చేస్తుంది. దుమ్ము, మరియు ధూళిని తొలగించడం ద్వారా, మీరు వాహనం లోపల మరియు వెలుపల నీట్‌గా ఉంటుంది.
ఇంకా కారును కడిగేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. కారు పెయింట్ పోకుండా ఉండాలంటే కార్ షాంపూని ఉపయోగించండి. వాటర్‌మార్క్‌లు పోవడానికి మీ కారును మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడవండి. తుప్పు పట్టకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇంకా చాలా మంది కారు బయట అంతా శుభ్రం చేసినా.. అసలైన భాగంపై నిర్లక్ష్యం వహిస్తారు.
చాలా కార్ వాష్‌లు కారు దిగువ భాగాన్ని శుభ్రం చేయడం మరచిపోతాయి. దీంతో వాహనం అడుగుభాగంలో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి, బురద పేరుకుపోతుంది. కాబట్టి కారు దిగువ భాగాన్ని కూడా శుభ్రం చేయాలి. మీరు మీ ఇంటి వద్ద కార్ పార్కింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లయితే, కారు దిగువ భాగాన్ని శుభ్రం చేయడానికి సులభంగా ఉండేలా చూసుకోండి.
వర్షం తర్వాత మీ కారును కడగడం ద్వారా దాని లుక్‌ను కాపాడుకోవడంతో పాటు రిపేర్లకు గురవ్వకుండా చూసుకోవచ్చు. అంతే కాకుండా సురక్షితమైన డ్రైవింగ్ ఆస్వాదించవచ్చు. రెగ్యులర్ మెయింటెనెన్స్ మీ వాహనాన్ని సౌందర్య పరంగా ఆహ్లాదకరంగా ఉంచుతూ కారు సర్వీసు పెరగడంలో దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications








