కదులుతున్న ఆడి కారు పైకెక్కి యువకుల హల్‌చల్‌.. పోలీసులు ఏం చేశారంటే.??

పబ్లిక్‌ రోడ్లపై ఇటీవల తరచూ కొందరు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. బైక్‌పై స్టంట్లు, కారు రూఫ్‌పై కూర్చుని ప్రయాణించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలా విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు యత్నిస్తున్నారు. తాజాగా యూపీ(Viral Videos)లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం కొందరు ఎలాంటి చర్యలకైనా పాల్పడుతున్నారు. రోడ్డుపై ఇతర వాహనదారులను ఆందోళనకు గురిచేయడమే కాకుండా వారు కూడా కష్టాల్లో(Stunts On Public Roads) పడుతున్నారు. పబ్లిక్‌ రోడ్లపై విన్యాసాలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వైరల్‌ అవడం అటుంచి పోలీసులకు చిక్కుతున్నారు.

Stunts-On-Moving-Audi-Car

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇలాంటి సంఘటనే(Stunts On Audi Sunroof) ఒకటి వైరల్‌గా మారింది. వీడియోలో, ఒక యువకుడు రోడ్డుపై ఆడి లగ్జరీ సెడాన్ రూఫ్‌పై కూర్చోవడాన్ని చూడవచ్చు. వైరల్‌ అయ్యేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో.. రూ.31 వేల జరిమానా విధించారు.

ఈ వీడియోను ట్రిసిటీ టుడే తమ X ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోను పరిశీలించినట్లయితే నోయిడాలోని ఎలివేటెడ్ రోడ్‌పై ఆడి A4 సెడాన్‌ను చూడవచ్చు. సెడాన్ సన్‌రూఫ్ వెలుపల పైకప్పుపై కూర్చుని ఓ వ్యక్తి హల్‌చల్‌ చేస్తున్నాడు. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే ఈ స్టంట్ చేశారన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది.

Stunts-On-Moving-Audi-Car

మధ్యమధ్యలో యువకుడు ఒకటిరెండు సార్లు కెమెరా వైపు చూస్తూ దానికి పోజులివ్వడాన్ని చూడవచ్చు. అతడిని మరో కారులో వెంబడిస్తున్న స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియోను రికార్డ్ చేసిన కోణం నుంచి, అతని స్నేహితుడు వీడియోను రికార్డ్ చేస్తున్న వాహనం పైకప్పుపై కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను అతను తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో పోస్ట్ చేయగా, కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

కొంతమంది నెటిజన్లు అదే వీడియోను నోయిడా ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ షేర్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రకారం వీడియోను పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు నోయిడా పోలీసులు తెలిపారు. ఒకటి కాదు రెండు ఆడి కార్లు ఇలాంటి విన్యాసాలు చేయడాన్ని వీడియోలో కనిపిస్తున్నాయి.

Stunts-On-Moving-Audi-Car

నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఈ కేసులో 7 నేరాలను గుర్తించారు. ఉల్లంఘనలకు రూ.31,000 జరిమానా విధించారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, సరైన సిగ్నల్స్ లేకుండా లేన్లు మార్చడం, లేతరంగు అద్దాలు, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం, అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వీడియో రికార్డింగ్ చేయడం ఇలా మరెన్నో చలాన్లు జారీ చేశారు.

ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సన్‌రూఫ్ అంటే ఇలాంటి కసరత్తులు, విన్యాసాలు చూపించే ప్లేస్‌ కాదని, ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా రోడ్డుపై వాహనాలు నడపకూడదని అంటున్నారు. పబ్లిక్ రోడ్లపై ఇటువంటి విన్యాసాలు చేయవద్దని.. ఇందుకోసం ప్రైవేట్‌ ట్రాక్‌లు లేదా ప్రైవేట్‌ స్థలాలను ఉపయోగించుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 16, 2024, 9:01 [IST]
English summary
Young boys sitting on moving audis roof fined rs 31 thousand video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+