బైక్‌పైన యువజంట రొమాన్స్.. ఏకంగా పబ్లిక్ రోడ్డుపై అభ్యంతరకర ప్రయాణం..!
పబ్లిక్ రోడ్లపై కొందరు వాహనదారులు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం కొందరు, ఇతరాత్ర కార్యక్రమాలు కోసం మరికొందరు ప్రమాదక ప్రయాణాలు చేస్తున్నారు. తాజాగా ఓ జంట బైక్‌పైన రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై ప్రమాదకంగా ప్రయాణం చేస్తున్నారు.
ఈ ఘటన రాజస్థాన్‌లో ఓ రద్దీ రోడ్డుపై జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే సమాచారం లేకున్నా.. ఓ నెటిజన్ సెప్టెంబర్ 15 తన సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు. పబ్లిక్ రోడ్డుపై ఉన్నామనే, అది కూడా బైక్ డ్రైవింగ్‌లో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా అభ్యంతరకరంగా ప్రయాణం చేసిన జంట ప్రవర్తనను వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియోను రజనీ సింగ్ అనే ట్విట్టర్ (X) యూజర్ షేర్ చేశాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రద్దీ రోడ్లపై ఓ జంట బైక్‌పై ప్రయాణం చేస్తున్నారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడు.. వెనుక సీట్లో కూర్చొన్న యువతితో రొమాన్స్ చేసేందుకు ప్రమాదకరంగా వెనక్కి తిరిగాడు. ఫలితంగా బైక్‌పై ఎటువంటి అప్రమత్తంగా లేకుండా ప్రయాణం చేస్తున్నాడు.
ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది సేపటికే వైరల్ అయింది. ఈ వీడియోలోని జంట ప్రవర్తనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నెటిజన్ల ఫిర్యాదులు సహా వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతీయువకులు ఎవరూ, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడికాలేదు.

పబ్లిక్ రోడ్లపై ఇలాంటి ప్రవర్తన కారణంగా ప్రజలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. దాంతోపాటు ఎటువంటి రక్షణ, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇలాంటి డ్రైవింగ్ కారణంగా పాదచారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరియు బైక్ రైడర్ సహా వెనుక కూర్చున్న యువతి కూడా ఎటువంటి హెల్మెట్ ధరించలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే భారీగా గాయపడే అవకాశం ఉంది.
భారత్ రోడ్లపై ఇటువంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా ఘటనలు జరిగాయి. పోలీసులు చర్యలు తీసుకున్నా.. పరిస్థితిలో ఎటువంటి మార్పులు రావడం లేదు. ఢిల్లీ- మీరట్ జాతీయరహదారిపై యువతిని బైక్ ట్యాంక్‌పైన కూర్చోబెట్టుకొని, ఓ యువకుడు బైక్‌ను డ్రైవింగ్ చేశాడు. ఆ సమయంలో పరస్పరం హగ్ చేసుకొంటూ బైక్‌పైన ప్రయాణం చేశారు.

ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. బైక్ రైడర్‌కు రూ.21000 జరిమానా విధించారు. అయితే ఇలాంటి ఘటనలు పబ్లిక్ రోడ్లపై ఎప్పుడూ ప్రమాదకరం. ఆ క్షణానికి సంతోషాన్ని కలిగించవచ్చు గానీ.. ఏదైనా ప్రమాదం జరిగితే ఇద్దరు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








