రోడ్డు దాటుతూ స్కూటర్‌ని ఢీకొట్టిన అమ్మాయి.. తరువాత ఏమైందంటే (వీడియో)

ప్రమాదం ఎప్పుడు, ఏ మూల నుంచి వస్తుందో చెప్పలేము. రోడ్డు ప్రమాదాలైతే మరీ దారుణంగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని అమాయక ప్రాణులు లేకపోలేదు. మనదేశంలో ప్రతి రోజూ కొన్ని వందలమంది రోడ్డు ప్రమాదాల వల్ల కన్ను మోస్తున్నారు. అనుకోను ప్రమాదంలో బయటపడేవారి సంఖ్య తక్కువే.. అయినా వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇటీవల సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. వాహనాల రాకపోకతో రద్దీగా ఉన్న రోడ్డు కనిపిస్తుంది. ఆలా వాహనాలు వెల్తూ ఉన్నాయి. కొన్ని సెకన్ల తరువాత రోడ్డు పక్కన నిలబడి ఉన్న అమ్మాయి, వాహనాలు రావడం లేదు కదా అని.. అటువైపు వెళ్ళడానికి పరుగెత్తింది. అకస్మాత్తుగా ఓ స్కూటర్ వచ్చేస్తుంది. అయితే రైడర్ వెంటనే బ్రేక్ వేయడం వల్ల ఏమి జరగలేదు.

Young Girl Crosses Public Road Without Looking

అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన అమ్మాయి వెంటనే స్కూటర్ మీద వాలుతుంది. వెంటనే తేరుకుని స్కూటర్ రైడ్ చేస్తున్న వ్యక్తికి నమస్కరిస్తూ సారీ చెప్పింది. ఇంతటితో వీడియో ముగుస్తుంది. ఆ అమ్మాయి గమనించకుండా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. స్కూటర్ నడుపుతున్న వ్యక్తి రెప్పపాటులో బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్కూటర్ వేగంగా వచ్చి ఉంటే? అక్కడ ఏమి జరిగేదో ఊహించవచ్చు.

నిజానికి ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి చాలానే వెలుగులోకి వచ్చాయి. అలంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారు, బలమైన దెబ్బలు తిన్నవారు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి రోడ్డు దాటేటప్పుడు సిగ్నెల్ గమనించాలి. సిగ్నెల్ లేని సమయంలో తప్పకుండా వాహనాలు రాలేదని నిర్దారించుకున్నప్పుడే రోడ్డు దాటాలి. లేకుంటే ప్రమాదాన్ని ఆహ్వానించినవారమే అవుతాము.

Young Girl Crosses Public Road Without Looking

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు స్కూటర్ రైడర్‌ను మరియు ఆ అమ్మాయిని ప్రసంసిస్తున్నారు. అమ్మాయి వెంటనే క్షమాపణలు చెప్పడం మరియు స్కూటర్ రైడర్ యొక్క సానుభూతి వల్ల గొడవ జరగకపోవడం వంటివి గొప్ప విషయమే. కొన్ని సార్లు రైడర్లు లేదా ఇతరులు ఇలాంటి సంఘటనల్లో గొడవలకు దిగుతారు. అప్పుడు ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుంది.

అనుకోని సందర్భాల్లో ప్రమాదాలు జరిగితే.. వెంటనే గొడవకు దిగటం ఏ మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఎలాగో ప్రమాదం అనుకోకుండా జరిగింది. అక్కడ ఎవరి ప్రమేయమూ పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో క్షమాగుణం చాలా అవసరం. ఈ విషయాన్ని వాహనదారులు గానీ, పాదాచారులు గానీ తప్పకుండా గమనించాలి. అయితే రోడ్డుపైన వెల్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

గతంలో వెలుగులోకి వచ్చిన కొన్న సంఘటనల్లో కొందరు రోడ్డుపైనే గొడవలుపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల ముగ్గురు వ్యక్తులు ఎమర్జెన్సీ సమయంలో వేగంగా వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సమయానికి పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఇలాంటి చర్యలు సమంజసం కాదు, నేరం కూడా.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2024, 12:30 [IST]
English summary
Young girl crosses public road without looking and gets hit by scooter
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+