మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

ప్రస్తుతం యువతరానికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అంతే కాదు క్రికెట్ ఆటగాళ్లంటే కూడా చాలా ఇష్టం. చాలామంది యువకులు వారికీ ఇష్టమైన క్రికెటర్ ని అనుసరిస్తూ, వారి హెయిర్ కట్, డ్రెస్సింగ్ స్టైల్ వంటివి పాటిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జరుగుతోంది.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

ఇప్పుడు చాలామంది యువకులు తప్పకుండా ఈ ఐపిఎల్ వీక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇండియన్ క్రికెట్ టీమ్ లో చాలామంది యువకులు మరియు కొత్త ఆటగాళ్లు చేరారు, ఆ సంగతి క్రికెట్ ప్రేముకులందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ మ్యాచ్‌లలో విజయం సాధించిన తరువాత, యువ క్రికెటర్లు తమ గ్యారేజీలలో కొత్త కార్లను కొనుగోలు చేసి చేరుస్తున్నారు.

ఇప్పుడు మనం ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉండే యువ ఆటగాళ్ల కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

మహమ్మద్ సిరాజ్:

మహమ్మద్ సిరాజ్ ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా అరంగేట్రం చేసి, అతని ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. సిరాజ్ ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన తరువాతే జనవరిలో బీఎండబ్ల్యూ 520డి లగ్జరీ సెడాన్ కొనుగోలు చేశాడు.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

అంతే కాకుండా ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభ చూపినందుకు గాను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొంతమంది క్రికెటర్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎట్టకేలకు సిరాజ్ మహీంద్రా థార్ కూడా కైవసం చేసుకున్నాడు.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

సూర్య కుమార్ యాదవ్:

ఇండియన్ క్రికెట్ టీమ్ లో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 'సూర్య కుమార్ యాదవ్' కొంతకాలంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అతను ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా భారత జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. సూర్య కుమార్ యాదవ్ ఇటీవల సెకండ్ హ్యాండ్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశారు.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

యువరాజ్ సింగ్:

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఒకరైన యువరాజ్ సింగ్ గురించి దాదాపు అందరికి తెలుసు, యువరాజ్ సింగ్ ఇప్పటికే తన గ్యారేజ్ లో చాలా విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. యువరాజ్ సింగ్ గ్యారేజ్ లో ఆడి, బెంజ్ వంటి కార్లతో సహా చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

యువరాజ్ సింగ్ 2021 జనవరిలో ఒక మినీ కూపర్ కంట్రీమాన్ ను కొనుగోలు చేసి, తన భార్య హజెల్ కీచ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది జేసీడబ్ల్యు ఇన్స్పైర్డ్ వెర్షన్, దీనిని జాన్ కూపర్ వర్క్స్ ఏరోడైనమిక్ కిట్‌తో విక్రయిస్తున్నారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా లగ్జరీ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంది.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

రిషబ్ పంత్:

భారత క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్ మాన్ గా పాపులర్ అయిన రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. రిషబ్ పంత్ ఫోర్డ్ ముస్తాంగ్ జిటి కారుని కొనుగోలు చేశారు. ఇది చాలా ఆకర్షణీయమైన ఎల్లో కలర్ కారు. దీనితో పాటు రిషబ్ పంత్ తన గ్యారేజ్ లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లగ్జరీ కారు కూడా ఉంది.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

ఇషాన్ కిషన్:

ఇషాన్ కిషన్ 2021 మార్చిలో ఇండియన్ క్రికెట్ టీమ్ లో చేరాడు. ప్రస్తుతం 2021 ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్ తరఫున ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ ఇటీవల బీఎండబ్ల్యూ ఎక్స్5 ను కొనుగోలు చేశాడు. అంతే కాకూండా ఇటీవల కాలంలో అతడు బీఎండబ్ల్యూ ఎక్స్6 ను కూడా కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

MOST READ:ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

టి.నటరాజన్:

టి. నటరాజన్ ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ క్రికెట్ టీమ్ లో చేసి ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతమైన ప్రతిభను కనపరిచాడు.ఈ ప్రతిభకు గాను ఇటీవల నటరాజన్ కి కొత్త మహీంద్రా థార్ లభించింది. ఈ సిరీస్‌ను గెలుచుకోవడంలో నటరాజన్ బాగా పాపులర్ అయ్యాడు.

మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

శార్దుల్ ఠాకూర్:

ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులలో శార్దుల్ ఠాకూర్ ఒకరు. శార్దుల్ ఠాకూర్ కూడా ఇటీవల కొత్త మహీంద్రా థార్ పొందారు. అతను మహీంద్రా థార్ యొక్క సిల్వర్ కలర్ కారుని సొంతం చేసుకున్నారు. శార్దుల్ ఠాకూర్ దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా పోస్ట్ చేసాడు.

Most Read Articles

English summary
Young Indian Premier League Players And Their Cars Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X