కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇటీవల తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో, ఒక యువకుడు కదిలే స్కార్పియో కారు యొక్క పై భాగంలో షాకింగ్ స్టంట్స్ చేయడం చూడవచ్చు.

కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

నివేదికల ప్రకారం ఆ యువకుడు కదిలే కారు డోర్ గుండా కారు పైకి ఎక్కి అక్కడ స్టంట్స్ చేసాడు. అంతే కాకుండా ఈ యువకుడు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేశాడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయిన ఈ వీడియో ఉత్తర ప్రదేశ్ పోలీసుల దృష్టికి వచ్చింది.

కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

వీడియో ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని గుర్తించారు. కదిలే కారుపైన చేసిన ఈ చర్యలకు ఆ యువకుడు క్షమాపణలు చెప్పాడు. బహిరంగ రహదారిపై ఈ విధంగా చేసిన ఆ యువకుడికి జరిమానా విధించబడింది.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

ఈ సంఘటనలో కనిపిస్తున్న ఈ యువకుడు యువ సోషలిస్టు పార్టీ నాయకుడు కృష్ణ మురారి యాదవ్ కుమారుడు ఉజ్వాల్ యాదవ్ అని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఉజ్వాల్ యాదవ్ చేసిన ఈ చర్యల వీడియో వైరల్ అయింది. ఈ కారణంగా పోలీసులు అతనిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు.

కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

సాధారణంగా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలో వైరల్ అవుతూ ఉంటాయి. బహిరంగ రహదారులపై జరిగే ఈ సంఘటనలు చాలా ప్రమాదానికి దారి తీస్తాయి. ఇవి కేవలం వాహనదారునికి మాత్రమే కాదు అతని చుట్టూ ఉన్న వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంది.

MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

దీని గురించి ఐపిఎస్ అధికారి అజయ్ కుమార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని హెచ్చరించే రీతిలో మాట్లాడారు. ఈ సంఘటనకు కారణమైన కార్ ఓనర్ ఉజ్వాల్ యాదవ్‌కు రూ .2,500 జరిమానా విధించినట్లు పోలీసులు వీడియో ద్వారా ధృవీకరించారు.

కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, బహిరంగ రహదారిపై ఒక మహిళా బైకర్‌ వీడియో కూడా వైరల్ అయింది. ఇలాంటి సంఘటనలు చాలామంది యువతను ప్రేరేపిస్తాయి. కావున ఎలాంటి సంఘటనలకు కారణమైన వారిపై వేంటనే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

Most Read Articles

English summary
Young Man Arrested For Doing Push Ups On Moving Mahindra Scorpio. Read in Telugu.
Story first published: Wednesday, March 17, 2021, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X