21 ప్లేట్స్ చోలే కుల్చా తిని బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేస్తారా? అయితే ఒక్క షరతు

ఈ మధ్య కాలంలో ఫుడ్ ఛాలెంజెస్ గురించి ఎక్కువుగా వింటూనే ఉన్నాము. ఈ ఫుడ్ ఛాలెంజెస్ లో నిర్ణీత సమయంలో నిర్వహణకు చెప్పిన ఫుడ్ తినాలి, అలా చేసే క్యాష్ రివార్డులు లేదా బైకులు వంటివి గెలుపొందిన వారికి అందిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనల గురించి మనం గతంలో కూడా చాలానే విన్నాము. అయితే ఇలాంటి సంఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఇంతకీ ఆ ఫుడ్ ఛాలెంజె ఏమిటి.. ఇందులో గెలుపొందినవారికి బహుమతిగా ఏం లభిస్తుంది, అనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

భారత రాజ‌ధాని నగరం ఢిల్లీతోపాటు మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో తరచూ ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ గెలుపొందిన‌వారికి భారీ బ‌హుమ‌తులు అంద‌జేస్తున్నారు. ఈ విధంగా ఫుడ్ ఛాలెంజ్‌లు నిర్వహించే రెస్టారెంట్లలో ఒకటి ఢిల్లీ నగరంలోని చోలే కుల్చా రెస్టారెంట్‌.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

ఈ రెస్టారెంట్ ఇటీవల ఆహార ప్రియులకోసం మరో ఫుడ్ ఛాలెంజె తీసుకువచ్చింది. ఇందులో కేవలం 30 నిముషాల్లో ఒకటి రెండు కాదు, 21 ప్లేట్స్ మటర్ చోలే కుల్చే తినాలి. అలా తిన్న వారు ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది అంత సులభమైన పని మాత్రం కాదు. అయితే ఒక వ్యక్తి ఈ పందెంలో గెలిచి బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నాడు.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

ఇక్కడ 21 ప్లేట్స్ మటర్ చోలే కుల్చే తిన్న వ్యక్తి ఏ కుంభకర్ణుడొ లేక భీముడో కాదు, 'రజనీష్ జ్ఞాని' అనే యూట్యూబర్, ఫుడ్‌ బ్లాగర్‌. ఇతడు 30 నిముషాల్లో 21 ప్లేట్స్ మటర్ చోలే తినటమే కాకున్నా మధ్యలో 6 నుంచి 7 గ్లాసుల లస్సి కూడా తాగేశాడు. ఈ సంఘటన మొత్తం మీరు ఈ కథనంలోని వీడియోలో చూడవచ్చు.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

అతను తినే సమయంలో మధ్య మధ్యలో గెంతడం, వ్యాయామాలు చేయడం, అటూ ఇటూ తిరగడం వంటివి కూడా మీరు వీడియోలో చూడవచ్చు. మొత్తానికి రెస్టారెంట్ నిబంధనల ప్రకారం 30 నిమిషాల్లో 21 ప్లేట్ల చోలే కుల్చేలు తిని ఛాలెంజ్‌లో గెలిచాడు. వారు గెలిచిన ఆనందంలో డాన్స్ చేయడం వంటివి కూడా చూడవచ్చు.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

మొత్తానికి చెప్పిన ప్రకారం మొత్తమ్ ఫుడ్ తినేసి రెస్టారెంట్ యజమాని నుంచి బుల్లెంట్‌ బండి తాళం అందుకున్నాడు. అయితే ఇదంతా ప్రమోషన్లలో భాగంగానే చేశాన‌ని చెప్పి ఆ బుల్లెట్ బైక్‌ను ఆ య‌జ‌మానికి మళ్ళీ వారు తిరిగి ఇచ్చేసారు.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

కావున మళ్ళీ ఈ పందెంలో ఈ బుల్లెట్ బైక్ పొందవచ్చు. ఈ బైక్‌ గెలవాలనుకునేవారు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతంలోగ‌ల‌ బన్సల్ స్వీట్స్ ఎదురుగా ఉన్న ఆచార్య నికేతన్ మార్కెట్‌లోగ‌ల హరి ఓం కే స్పెష‌ల్‌ చోలే కుల్చేకు వెళ్ళవచ్చు అని కూడా ఈ వీడియోలో వెల్లడించారు. ఇలాంటి చాలెంజస్ లో పోటీ చేయాలనుకునే వారు ఈ పోటీలో పాల్గొని బుల్లెట్ బైక్ సొంతం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా గతంలో కూడా ఇలాంటి సంఘటన పూణేలో వెలుగులోకి వచ్చింది. ఇందులో 'హోటల్ శివరాజ్' అనే రెస్టారెంట్ 'బుల్లెట్ థాలి' ఛాలెంజ్‌ ఆఫర్ చేసింది. ఈ బుల్లెట్ థాలి తిన్నవారికి రూ.1.65 లక్షల విలువైన సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ ఉచితంగా అందిస్తారు.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

ఈ 'బుల్లెట్ థాలి' ప్లేట్‌లో దాదాపు 4 కేజీల ఫుడ్ ఉంటుంది. ఇందులో మటన్ మరియు వేయించిన చేపలతో పాటుగా సుమారు 12 రకాల వంటకాలతో కూడిన ఆహారం ఉంటుంది. ఇవన్నీ కేవలం ఒక గంటలోపు తినేయాలి. అలా తిన్న వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ ఉచితంగా లభిస్తుంది.

30 నిముషాల్లో 21 ప్లేట్స్ చోలే కుల్చా స్వాహా చేసాడు.. బుల్లెట్ బైక్ పట్టేసాడు: మీరు ట్రై చేయండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ కొత్తేమీ కాదు, ఇవన్నీ కూడా ఆసక్తికలిగిన యువకులకు ఒక సాహసంగా ఉంటుంది. ఇలాంటి సాహసాలను చేసేవారు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ఛాలంజెస్ స్వీకరించడం అనేది అంత సులభమేమీ కాదు. కానీ ఇప్పుడు బుల్లెట్ బైక్ సొంతం చేసుకునాలనుకునే వారు 21 ప్లేట్ల చోలే కుల్చే పోటీలో పాల్గొనవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విషయాలతోపాటు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, August 30, 2022, 11:10 [IST]
English summary
Young man eats 21 plate chole kulche in 30 minutes challenge wins bullet bike details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+