కారు సన్‌రూఫ్ నుంచి 6 ప్యాక్ బాడీ చూపించిన యువకుడు.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
భారత్ మార్కెట్‌లో సన్‌రూఫ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందులో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ ఫీచర్‌ను తమ వాహనాల్లో అందిస్తున్నాయి. ఈ ఫీచర్ ఒకప్పుడు ప్రీమియం మోడల్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం బడ్జెట్ రేంజ్ కార్లలోనూ అందిస్తున్నారు.
హ్యుందాయ్, టాటా వంటి చాలా సంస్థలు తమ చౌక ధరల కార్లలోనూ సన్‌రూఫ్‌ను అందిస్తున్నాయి. హ్యుందాయ్ సంస్థ తన కొత్త వెర్నా మోడల్‌లో సన్‌రూఫ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు హ్యుందాయ్ కొన్ని వేరియంట్లలో సన్‌రూఫ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కారు ప్రయాణంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా సన్‌రూఫ్‌ను అందిస్తోంది.

అయితే సన్‌రూఫ్ ఫీచర్‌ను కొందరు సరిగా వినియోగించుకోవడం లేదు. ముఖ్యంగా కారు ప్రయాణంలో ఉన్నప్పుడు సన్‌రూఫ్ నుంచి బయటకు చూడడం, దానిపై కూర్చోవడం వంటి విన్యాసాలు చేస్తూ రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనలో ఒకటి వెలుగులోకి వచ్చింది.
కదులుతున్న కారులో సన్‌రూఫ్ నుంచి ఓ యువకుడు తన 6 ప్యాక్ బాడీని ప్రదర్శించాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి, చివరకు పోలీసులకు చేరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. జరిమానా విధించారు.

కారు ప్రయాణంలో ఉన్నప్పుడు అవసరం లేకుండా కిటికీలోంచి చూడడం కూడా ప్రమాదకరం. అలాంటికి సన్‌రూఫ్ గుండా బయటకు వచ్చి తన శరీరాన్ని 6 ప్యాక్ బాడీని చూపించినందుకు జరిమానా విధించారు. దీంతోపాటు మరో ఉల్లంఘన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కారుకు స్పష్టమైన నంబర్ ప్లేట్ లేదు. దీనిపైనా పోలీసులు చలాన్ విధించారు.
సన్‌రూఫ్ గుండా చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు వేస్తే.. కారు నుంచి దూరంగా విసిరి వేయబడే అవకాశం ఉంటుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ఇతర కారణాలతో పోలీసులు ఈ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యువత తమ సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి విన్యాసాలు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
యువత సోషల్ మీడియా క్రేజ్ కారణంగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా ఉంటున్నా కొంత మంది యువతలో మార్పు రావడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా యధేచ్చగా రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








