రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ధరలో ఎలక్ట్రిక్‌ జీప్‌.. యువకుడి క్రియేటివిటీని మెచ్చుకోవాల్సిందే.!!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన బైక్‌లంటే యువతకు చాలా క్రేజ్‌. ధర కూడా అంతే క్రేజ్‌గా ఉంటుంది. అయితే జీప్‌లతో పోలిస్తే ఆర్‌ఈ బైక్‌ల ధర తక్కువే. కానీ ఇక్కడ ఓ యువకుడు ఇటీవల లాంచ్‌ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌(Royal Enfield Himalayan) ధరలో జీప్‌ను రూపొందించి ఔరా అనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారత మార్కెట్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ధర రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల్లో ఉంటుంది. ఇక వాస్తవానికి వస్తే భారత మార్కెట్లో ఇంత సరసమైన ధరలో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా జీప్‌ను విడుదల చేయలేదు. కానీ కస్టమైజేషన్ లేదా వెహికల్ మోడిఫికేషన్ ద్వారానే ఇలాంటివి సాధ్యం. దీన్ని నిజం చేస్తూ ఓ యువకుడు ఇంత తక్కువ ధరలో జీప్‌(Electric Jeep)ను రూపొందించారు.

Electric-Jeep-At-Royal-Enfield-Himalayan

ఈ మోడిఫికేషన్‌ కోసం యువకుడు పాతకాలపు మహీంద్రా విల్లీస్‌ జీప్‌ను ఉపయోగించాడు. దీనిని ఇది సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారు ద్వారా పనిచేసేలా రూపొందించారు. మొత్తంగా ఎలక్ట్రిక్‌ జీప్‌ను తయారు చేశారు. ఈ మోడిఫికేషన్‌ కోసం మొత్తం రూ. 2.6 లక్షలు ఖర్చు చేసినట్లు యువకుడు తెలిపారు.

మార్కెట్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ బైక్‌ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ జీప్‌ను యువకుడు రూపొందించాడు. ఇందుకోసం ఇతను వేరే వాహనాన్ని ఉపయోగించినప్పటికీ మోడిఫికేషన్లు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పనే.. దాని బాడీని ఫైబర్‌తో డిజైన్ చేశారు. అందుకే ఇది ఎగుడుదిగుడుగా ఉండే విల్లీస్ లుక్‌ని కలిగి ఉంది.

Electric-Jeep-At-Royal-Enfield-Himalayan

కాగా విల్లీస్ జీప్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ కారు మోడల్ అని. మోడిఫికేషన్లలో భాగంగాముందు భాగంలో, వృత్తాకార ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు అమరార్చు. దీని ముందు భాగంలో స్టోరేజీ సౌకర్యం ఉంది. దీని కెపాసిటీ 30 లీటర్లు. అయితే ఇది సాధారణ జీపులతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది.

సాధారణంగా డ్రైవర్ సీటులో రకరకాల కంట్రోలింగ్‌ ఆప్షన్లు ఉంటాయి. కానీ ఈ మోడిఫైడ్‌ జీపులో చిన్న డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ మాత్రమే ఇచ్చారు. ఇంకా యాక్సిలరేషన్, బ్రేక్ కోసం పెడల్స్ మాత్రమే అందించారు. ఇది ఎలక్ట్రిక్ జీప్‌ కాబట్టి ఇందులో గేర్ ఆప్షన్ ఇవ్వలేదు.

Electric-Jeep-At-Royal-Enfield-Himalayan

కాగా ఈ మోడిఫైడ్ జీప్‌లో ఫార్వర్డ్ మూవ్‌మెంట్, బ్యాక్‌వర్డ్ మూవ్‌మెంట్ కోసం స్విచ్చింగ్ సదుపాయంతో పాటు ఇందులో హ్యాండ్ బ్రేక్ ఫీచర్ కూడా అందించారు. మోడిఫైడ్‌ మహీంద్రా విల్లీస్‌ జీప్‌లో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణించవచ్చు. వెనుక వైపున స్టాప్‌ లైట్‌తో పాటు, ఇండికేటర్‌ లైట్లు కూడా అమర్చారు.

మోడిఫైడ్‌ ఎలక్ట్రిక్‌ జీప్‌ మొత్తం ఎత్తు 1.32 మీ, పొడవు 2.87 మీ గా ఉంది. వాహనం యొక్క మొత్తం బరువు 350 కిలోలు. కాగా గ్రౌండ్ క్లియరెన్స్ 459 మి.మీ. ఈ స్పెసిఫికేషన్లతో దేశంలోని కఠినమైన రోడ్లపై సైతం సులభంగా ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. కాగా ఇది ఎలక్ట్రిక్ జీప్‌ కావడంతో ఫుల్ ఛార్జింగ్‌తో 100 కి.మీ రేంజ్ ఇస్తుందని యువకుడు తెలిపారు.

Electric-Jeep-At-Royal-Enfield-Himalayan

అయితే ఈ మోడిఫైడ్‌ జీప్‌లో బ్యాటరీకి సంబంధించిన పూర్తి వివరాలను యువకుడు వెల్లడించలేదు. మెరుగైన పనితీరు కోసం ఎలక్ట్రిక్ జీప్‌లో 1500 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగించారు. ఈ మోటార్ గరిష్ఠంగా 2 bhp శక్తిని, 9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని స్పీడ్‌ వెల్లడించకపోయినా మోటార్‌ స్పెసిఫికేషన్ల ప్రకారం ఈ ఎలక్ట్రిక్‌ జీప్‌ గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 28, 2023, 9:20 [IST]
English summary
Young man made mini electric jeep at royal enfield himalayan bike cost
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+