హైదరాబాద్‌ అందాల నడుమ స్కూటీపై యువకుడి విన్యాసాలు.. కట్‌ చేస్తే ఖతర్నాక్‌ ట్విస్ట్‌!!

హైదరాబాద్‌ నగరంలో ఇటీవల ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోయాయి. సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం బైక్‌లు, కార్లతో చట్ట విరుద్ధమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు. తోటి వాహనదారులకు ఆటంకం కలిగిస్తూ రోడ్లపై స్టంట్లు చేస్తున్నారు. పాతికేళ్ల లోపు వయసు యువత ఇలాంటి చర్యలకు పాల్పడటం పోలీసులకు నిత్యం తలనొప్పిగా మారుతోంది.

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు క్రమక్రమంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్నాయి. ఇరుకైన ఈ మహానగరం లోపల చుట్టూ విశాలమైన రహదారులు నిర్మిస్తుండటంతో నగరవాసులకు ప్రయాణం కూడా సులభంగా మారుతోంది. ఈ క్రమంలో ఇది ఆకతాయిలకు అడ్వాంటేజ్‌గా మారింది. నడిరోడ్డుపై బైక్‌లతో స్టంట్ల(Bike Stunts)కు పాల్పడుతూ ఆందోళన సృష్టిస్తున్నారు.

Stunts-On-Bike-At-Telangana-Secretariat

నగరంలోని కొన్ని ప్రాంతాలు టూరిజం ప్లేసెస్‌గా మారుతున్నాయి. వారాంతాలు, సెలవు రోజుల్లో ట్యాంక్‌బండ్‌ తీరం, సచివాలయం, అంబేడ్కర్‌ భవనం, నెక్సెస్‌ రోడ్డు, కేబుల్‌ బ్రిడ్జి చూసేందుకు ఔత్సాహికులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో వాటి పరిసర ప్రాంతాల్లో విశాలమైన రహదారులు.. ట్రాఫిక్‌ ఏర్పడకుండా దోహదపడుతున్నాయి.

అయితే ఇదే అదనుగా భావించిన నగరంలోని ఆకతాయిలు రోజురోజుకీ రెచ్చిపోతూ రోడ్డుపై ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రేసింగులు, స్టంట్లకు పాల్పడుతున్నారు. ఇలా చేయడం ద్వారా తోటి వాహనదారులకు ఆటంకం కలిగిస్తూ వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చలాన్లు విధిస్తున్నప్పటికీ.. ఈ తరహా చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.

Stunts-On-Bike-At-Telangana-Secretariat

ఇటీవల ఓ యువకుడు నగర నడిబొడ్డున ఉన్న రాష్ట్ర సచివాలయం(Stunts at Secretariat), ఎదుట ప్రమాదకర స్టంట్లకు పాల్పడ్డాడు. దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వైరల్‌ అవ్వడం కోసం ఇలా విన్యాసాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉంటుంటడంతో ఈ రోడ్లపై ఇలాంటి సాహసోపేతమైన చర్యలకు పూనుకుంటున్నారు.

నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సచివాలయం వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు ఉంటుంది. అయినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా ఈ యువకుడు ఇలా పాల్పడటం(Stunts Viral Video)తో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. యువకుడు ఇలా సచివాలయం ఎదుట స్కూటీపై స్టంట్లు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Stunts-On-Bike-At-Telangana-Secretariat

దీంతో ఓ నెటిజన్‌ ఆ వీడియోను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నడిరోడ్డుపై ఇలా ప్రమాదకరమైన రీతిలో టూ వీలర్‌పై విన్యాసం చేస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులను కోరారు. అంతే కాకుండా ఆ స్కూటర్‌ నెంబర్‌ వివరాలను సైతం పోలీసులకు ట్యాగ్‌ చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.

కాగా కొందరు ఆకతాయిలు కేవలం సచివాలయం వద్దే కాకుండా నెక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్‌తో సహా పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లపై బైక్‌తో స్టంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల కింద తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

Stunts-On-Bike-At-Telangana-Secretariat

గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేక రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. దీపావళి సందర్భంగా ఇంటి ఎదుట పటాసులు కాల్చుకోకుండా.. బైక్‌కి ముందు, వెనుక భాగాల్లో బాంబులు అమర్చి వాటిని కాలుస్తూ వేగంగా ప్రయాణించారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

More from DriveSpark

Article Published On: Friday, November 24, 2023, 16:05 [IST]
English summary
Young man performs dangerous stunts on scooty at telangana secretariat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+