ప్రముఖ కంపెనీ నుంచి రూ. 50 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన యువకుడు.. కారణం తెలిస్తే అభినందించకుండా ఉండలేరు..

మన దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు. సాంకేతికత, క్రీడలు, విద్య ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో దేశంలోని యువత ప్రతిభను చాటుకుంటున్నారు. దేశ అభివృద్ధితో విదేశాల అభివృద్ధిలోనూ పాలు పంచుకుంటున్నారు. ఉద్యోగం చేయడం లేని ఇష్టం లేని వారు తమ ప్రతిభతో స్టార్టప్‌లను నెలకొల్పి తమకంటూ గుర్తింపును ఏర్పరుచుకుంటున్నారు.

మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో యువత తమ ప్రతిభాపాటవాలను వెలికి తీసి ఔరా అనిపిస్తున్నారు. అందుకు ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ చరిత్రలో దేశానికి అగ్రగామిగా నిలిచి ఎనలేని గౌరవాన్ని పొందుతున్నారు. అలా దేశం గర్వించేలా చేసిన అలాంటి భారతీయుల్లో మోహిత్ యాదవ్ ఒకరు.

Man-Rejects-Tata-Motors-Rs-50-Crore

హరియాణాకు చెందిన మోహిత్ యాదవ్ అనే 23 ఏళ్ల కుర్రాడు కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన కొత్త టెక్నాలజీ కోసం ప్రముఖ ఆటో దిగ్గజం కంపెనీ నుంచి రూ. 50 కోట్ల ఆఫర్‌ను మోహిత్ యాదవ్ సున్నితంగా తిరస్కరించాడు. దీంతో వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మోహిత్ యాదవ్.. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అదనంగా, ఈ సాఫ్ట్‌వేర్ 50 శాతం శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది. రెండు ఆఫర్లను కలిపి, ఇది గ్లోబల్ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. అందుకే పలువురు ఆటో దిగ్గజాలు మోహిత్‌కు మద్దతుగా నిలిచినట్లు సమాచారం.

ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే లక్షల మంది జీవితాలను కాపాడుతుంది. అంతే కాకుండా కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. ప్రస్తుతం, ఆటో రంగంలో ఆటో మేకర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కానీ మార్కెట్లో ఫ్యూయెల్ వాహనాలకు అధిక డిమాండ్ కారణంగా ఈవీలు ఆటో రంగాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడానికి మరో 40 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.

అయితే, మెహిత్ యాదవ్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని విధాలుగా సమర్థవంతంగా తయారు చేయడంతో పాటు ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీని అవలంబించే వాహన కంపెనీలు మార్కెట్లో నెం.1 స్థానంలో ఉంటాయి. ఇది గ్రహించిన కార్ల కంపెనీలు ఆ యువకుడికి భారీ ఆఫర్లు ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఆటో మేకర్ టాటా మోటార్స్ మోహిత్‌కు రూ. 50 కోట్లు ఆఫర్ చేసింది. ఆ ఆఫర్‌ను సున్నితంగా నిరాకరించినట్లు మోహిత్ తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం ఈ టెక్నాలజీని ఉచితంగా ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఆ యువకుడు ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌కు తెలిపినట్లు సమాచారం.

మోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక బాధాకరమైన సంఘటన ఉన్నట్లు సమాచారం. ట్రక్కు కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురి మృతి చెందడం తనను కలవరపెట్టిందని మోహిత్ తెలిపారు. ఆ ప్రమాదమే తనను ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి దారితీసిందని తెలిపారు.

చండీగఢ్ యూనివర్శిటీలో బి.టెక్ చివరి సంవత్సరంలో ఈ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసినట్లు మోహిత్ తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న ఏ వాహనం కూడా క్రాష్ కాదు. అలాగే డ్రైవరు మద్యం తాగి ఉంటే వాహనాన్ని స్టార్ట్ చేయడానికి సాఫ్ట్ వేర్ అనుమతించదు. 50 శాతం ఇంధనాన్ని ఆదా చేయడంలో ఈ సాఫ్ట్‌వేర్‌ పాత్ర ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

ప్రస్తుతం భారతీయ రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఈ సమయంలో కార్లలో ఈ తరహా సాఫ్ట్‌వేర్ ముఖ్యమని అర్థమవుతోంది. ఇది అమల్లోకి వస్తే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు. దేశ ప్రజల కోసం మోహిత్ ఇంత మంచి ఉపయోగకరమైన సాఫ్ట్‌వేర్ రూపొందించడం దేశానికే గర్వకారణం.

More from DriveSpark

Article Published On: Sunday, August 13, 2023, 8:01 [IST]
English summary
Young man rejects rs 50 crore offer for his new software technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+