భయంకరమైన వరదలు, కారులో చిక్కుకున్న తల్లీబిడ్డ.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన యువకుడు
సినిమాల్లో హీరోలు వీరోచితం పోరాటం చేసి ప్రజలను కాపాడితే అందరం చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో అలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు. నిజ జీవితంలో రియల్ హీరోలు అంటే మనకు సైన్యంలో పనిచేసే వారు, పోలీసులు మాత్రమే. కానీ వారిని కూడా మరిపిస్తూ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు ఈ యువకుడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సరిగ్గా గమనిస్తే నిజ జీవితంలోనూ హీరోలు చాలా మంది ఉంటారు. కానీ వారిని మనం గుర్తించం. ఈ రోజు ప్రపంచమంతా ఓ రియల్ హీరోను ప్రశంసలతో ముంచెత్తుతోంది. కారణం వరదల్లో చిక్కుకుపోయిన ఓ తల్లీబిడ్డకు పునర్జన్మనిచ్చాడు ఆ రియల్ హీరో.. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. బ్రెజిల్‌లో ఇటీవల తీవ్ర వరదలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో బ్రెజిల్(Brazil Viral Video)లోని ఓ వరద ప్రభావిత ప్రాంతంలో ఓ తల్లీబిడ్డ కారులో చిక్కుకున్నారు.
వీడియోను పరిశీలించినట్లయితే ఈ వైరల్ వీడియోలో వరదలో చిక్కుకున్న కారును మనం చూడవచ్చు. అది గమనించిన ఓ యువకుడు కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఆ వ్యక్తి పేరు మార్కస్ వినిసియస్. వారిద్దరినీ కాపాడిన మార్కోస్‌ను అందరూ అభినందిస్తున్నారు.

తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ.. కారులో చిక్కుకున్న ఆ తల్లీబిడ్డను మార్కస్ వినిసియస్ సురిక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ముందుగా చిన్నారిని రక్షించి ఆ తర్వాత చిన్నారి తల్లిని రక్షించి బయటకు తీసుకువచ్చాం. అతి భయానకమైన వరదల పరిస్థితుల్లో యువకుడు.. చిన్నారిని తల్లిని రక్షించిన తర్వాత కొన్ని సెకన్లలోనే కారు వరదలో కొట్టుకుపోయింది.
సినిమాలో థ్రిల్లర్ సన్నివేశాలను తలపించేలా ఉన్న ఈ దృశ్యం.. వీడియో చూస్తున్నంత సేపూ నెటిజన్లకు ఉత్కంఠను కలిగించింది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. మార్కస్ వినిసియస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే కారులో చిక్కుకున్న వారిని కాపాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే బ్రెజిల్‌లో కారు వరదల్లో ఎలా చిక్కుకుందనే దానిపై పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నదులను తలపించాయి. అతి తక్కువ సమయంలోనే బీభత్సమైన వర్షాలకు రోడ్లన్నీ వరదలను తలపిస్తున్నాయి. కాబట్టి వర్షాకాలంలో వాహనాల్లో ప్రయాణించేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం కూడా అవసరమని గుర్తుంచుకోవాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








