బైకుపై వెళ్తూ బరితెగించిన ప్రేమ జంట.. వీడియో చూసి మండిపడుతున్న నెటిజన్లు

రాను రాను మనుషులు కనీస విలువలను మర్చిపోయి, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ట్రెండింగ్ అనే ముసుగులో పడి నాగరికతకు మంగళం పాడేస్తున్నారు. చదువుకునే రోజుల్లో ప్రేమించడమే తప్పు, అలాంటిది ఒక జంట ఏకంగా నడి రోడ్డు మీద బైకుపై ప్రయాణిస్తూ బరితెగించి అసభ్యంగా ప్రవర్తించింది.

'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు' అన్న కృష్ణశాస్త్రి మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోడ్ లో ఓ ప్రేమ జంట బైకుపై వెళుతూ చూసే వారికి రోత పుట్టేలా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పల్సర్ బైకు మీద యువకుడు రైడ్ చేస్తుంటే, ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద యువతి కూర్చుని ఉంది.

బైకుపై వెళ్తూ బరితెగించిన ప్రేమ జంట

నడిరోడ్డుపై బైకు మీద వెల్తూ చుట్టూ జనం చూస్తారని ఏ మాత్రం భయం లేకుండా హగ్గులతో రెచ్చిపోయారు. ఇది చూసిన వారిలో కొంతమంది వారిని ఆపి వార్ణింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్త వైరల్ అయిపోయింది. ఇది చూసిన పోలీసులు ఆ ప్రేమ జంటను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి హెచ్చరించారు.

ఈ వీడియోలో బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి కానీ అతని ముందు కూర్చున్న యువతీ కానీ హెల్మెట్ ధరించలేదు. అంతే కాకుండా ఆ యువతి కాలేజ్ యూనిఫామ్ ధరించింది. కావున ఆమె కాలేజీ స్టూడెంట్ అని తెలుస్తోంది. బుద్దిగా చదువుకోమని తల్లిదండ్రులు కస్టపడి కాలేజీకి పంపిస్తే వారు చేసే నిర్వాకం ఇది. ఇది నిజంగానే అమానుషమైన సంఘటన. బరి తెగించి రోడ్డుపైన ఆ విధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రుల పరువు ఏమవుతుందో అని కూడా ఆలోచించని పిల్లలు ఆ కుటుంబనికే చేటు అని చెప్పాలి.

బైకుపై వెళ్తూ బరితెగించిన ప్రేమ జంట

ప్రస్తుత సమాజంలో ఎంతోమంది చదువుకోవాలని ఉన్నప్పటికీ చదువుకోలేకపోతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వీడియోలో కనిపించే అమ్మాయి మాత్రం చదువుకి చరమగీతం పాడి ప్రేమికునితో చక్కర్లు కొట్టేస్తోంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ ప్రేమ జంటకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్పల్సిందే. ఆలా చేసినప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఇది తప్పకుండా ఖండించాల్సిన విషయం.

నిజానికి ప్రేమ చాలా పవిత్రమైనదని మనం ఎన్నో పుస్తకాల్లో చదువుకున్నాం.. అయితే ఇటీవల కాలంలో ప్రేమికులు చేసే మితిమీరిన అల్లరి అసహ్యం పుట్టిస్తోంది. పట్టపగలే రొమాన్స్ చేస్తూ చూసే వారికి రోత పుట్టిస్తోంది. ప్రేమపేరుతో నడిరోడ్డుపై హంగామా చేస్తూ అడ్డదిడ్డంగా నడుచుకుని చివరకు పోలీస్ స్టేషన్ కు చేరడం వింత గొలుపుతోంది. ప్రేమ అనే పేరుతో ఎన్నో చేసేతున్నారు, చివరికి ఏవేవో జరిగిపోతున్నాయి. ఇలాంటి సంఘటనల వల్ల ప్రేమంటేనే బూటకం అనిపిస్తోంది.

ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. 2021 ఆగస్టులో బీహార్ నుండి ఒక జంట ఇలాగే ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో కూడా యువకుడు బైక్ రైడ్ చేస్తుంటే యువతి బైక్ పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చుంది. వారిద్దరూ ఆ సమయంలో పరిసరాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. ఈ సంఘటనను స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఆ జంట కొంత దూరం ప్రయాణించిన తరువాత కొంతమంది స్థానికులు ఆపి నిలదీశారు, మళ్ళీ ఇలా చేసారంటే పోలీసులను పిలుస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగే సంఘటనలను కూడా మన ముందుకు వచ్చేస్తున్నాయి. కావున ఇలాంటి పనులు చేసే ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే పోలీసులుకు పట్టుబడాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 4, 2023, 14:25 [IST]
English summary
Young man rides pulsar bike with lover seated on fuel tank video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+