సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

సాధారణంగా సినిమాలలోని ఫైట్ సీన్లలో రోడ్డుకి అడ్డంగా నిలిపిన ట్రక్కుల క్రింద నుంచి హీరోలు తమ వాహనాలతో వేగంగా వెళ్లడం చాలా వరకు చూసే ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడు ఇదే రీతిలో రోడ్డుకి అడ్డంగా ఉన్న ట్రక్కు కింద తన స్కూటర్‌ను తీసుకెళ్లిన వీడియో సోషల్ నెట్‌వర్క్‌లో తెగ వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

ఈ వీడియోలో, హీరో మాస్ట్రో స్కూటర్‌లో హెల్మెట్ ధరించన ఒక యువకుడు రోడ్డుపై ఆపి ఉంచిన ట్రక్కు కింద నుంచి తీసుకెళ్లాడు. ఈ వీడియో ఇట్స్ సైని విమల్ అనే ఇస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయబడింది. వీడియో షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

ఇస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు దాదాపు 12,33,640 లైక్‌లను పొందింది. ఈ వీడియోను చూసిన చాలామంది ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారు.

MOST READ:పెట్రోల్ బంక్‌లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

కొంతమంది తన స్కూటీని ట్రక్కు కింద నుంచి తీసుకెళ్లడం వల్ల అతన్ని టార్జాన్ 2.0 అని పిలుస్తున్నారు. సినిమాల్లో కూడా ఇప్పటివరకు ట్రక్కుల కింద కార్లు మాత్రమే వెళ్లిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాల్లో కూడా చాలా వరకు చిన్న రకం కార్లు మాత్రమే ఉపయోగించబడుతున్నాయి.

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

అయితే సినిమాలలో కూడా బైక్స్ మరియు స్కూటర్లు ఉపయోగించిన సంఘటనలు చాలా అరుదు. కానీ ఇప్పుడు ఈ యువకుడు ట్రక్కు కింద తన స్కూటర్ ని తీసుకెళ్లడంతో చాలా పాపులర్ అయ్యాడు. ఆ యువకుడు చేసిన ఈ పని వల్ల ట్రక్కు కింద నుంచి స్కూటర్ వెళ్లగలదని ఋజువుచేయబడింది.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

సాధారణంగా, ఇలాంటి క్రాసింగ్స్ రైల్వే గేట్ల వద్ద చూడవచ్చు. రేల్వే గేట్ వేసిన తర్వాత కూడా చాలామంది వాహనదారులు గేట్ కింద నుంచి వెళ్తారు. అయితే ఇప్పుడు ఒక ట్రక్కు కింద స్కూటర్ తీసుకెళ్లడం అనేది కొంత వింతైన చర్య.

ఇలాంటి చర్యలు అనుకోకుండా ప్రమాదానికి దారి తీస్తాయి. ఒక వేళా స్కూటర్ దాటుతున్న సందర్భంలో వాహనం కదిలితే ఆ వాహనదారుని ప్రాణాలకే ముప్పు. కావున ఇలాంటి చర్యలకు వీలైనంత దూరంగా ఉండటం చాలా వరకు మంచిది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాహనదారులు కొంత ఓపికగా ఉండటం అవసరం.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది

అయితే ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు సమాచారం. కానీ ఖచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగింది అని మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ ఈ వీడియో చూసి యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలి. లేకుంటే అనుకోని ప్రమాదాన్ని మీరే ఆహ్వానించినట్లు అవుతుంది.

Most Read Articles

English summary
Young Man Takes Scooter Under Truck Video Goes Viral. Read in Telugu.
Story first published: Saturday, April 10, 2021, 9:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X