మహీంద్రా థార్‌ SUVతో నది దాటాలని ప్రయత్నించారు.. కానీ ఒక్కసారిగా..!

సోషల్‌ మీడియా ప్రభావమో లేదా ఇతరుల కంటే తాము గొప్పవారమని చూపించేందుకు ప్రయత్నం చేస్తారో ఏమో కొంత మంది తన బైక్‌, కార్లలో ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఉత్తరాఖండ్‌లోని రామగంగా నది (Ram Ganga River) ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ముగ్గురు యువకులు మహీంద్రా థార్ ఎస్‌యూవీ (Mahindra Thar SUV)లో నదిని దాటే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గ్రేటర్‌ నోయిడా అనే X (ట్విట్టర్‌) ఖాతా ద్వారా షేర్‌ చేశారు.

3 men entered fast flowing ram ganga river with Mahindra Thar

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం సరదా వ్యాఖ్యలు చేశారు. 'మెదడును నోయిడాలో వదిలేశారా' అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. 'మరొకరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా..' అంటూ రాసుకొచ్చారు. 'వీరికి జరిమానా విధించారా లేదా' అని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

ఈ ముగ్గురు యువకులు ఢిల్లీకి చెందినవారని తెలుస్తోంది. వీడియో ఆధారంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే కొంత దూరం వచ్చాక.. మహీంద్రా థార్‌ వాహనం నది మధ్యలో నిలిచిపోయింది. అయితే నది ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ యువకులు థార్‌ వాహనం రూఫ్‌ పైకి ఎక్కి కూర్చున్నారు. ఇంతలో స్థానికులు వీరిని గుర్తించారు. తాడు సాయంతో యువకులకు రక్షించారు.

3 men entered fast flowing ram ganga river with Mahindra Thar

ప్రస్తుత యువత ఎక్కువగా పర్యటక ప్రాంతాలకు వెళ్లేందుకు, ఆఫ్‌ రోడ్ డ్రైవింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు ప్రవర్తించే తీరు వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. తాజా ఘటన అందుకు సరైన ఉదాహరణ. ప్రయాణాలు సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర విన్యాసాలు ఎప్పుడు ఇబ్బందులకు గురిచేస్తాయి.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌ 3 డోర్‌ వేరియంట్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.10.54 లక్షల నుంచి రూ.16.78 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ SUV పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం 15.2kmpl మైలేజీని అందిస్తుంది.

3 men entered fast flowing ram ganga river with Mahindra Thar

మహీంద్రా థార్‌ 4 వీల్‌ డ్రైవ్‌, రేర్ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఎవరెస్ట్‌ వైట్‌, రెడ్‌ రేజ్‌ సహా వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కారు 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, మాన్యువల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్‌, మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ సహా అనేక కీలక ఫీచర్లు సహా భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 4, 2023, 17:33 [IST]
English summary
Young man trying to cross ram ganga river in mahindra thar suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+