కారుపై యువకుడి బర్త్‌డే వేడుకలు.. నోట్లు విసురుతూ, పటాసులు పేల్చుతూ రచ్చరచ్చ.. మాంచి ఝలక్‌ ఇచ్చిన పోలీసులు

పుట్టినరోజు సందర్భంగా యువకులు రచ్చరచ్చ చేసిన సంఘటన సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆదివారం(అక్టోబర్‌ 29న) రాత్రి ఘజియాబాద్‌లో రాజ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముగ్గురు యువకులు మహీంద్రా బొలెరో వాహనంపై నిలబడి నానా హంగామా చేశారు. కరెన్సీ నోట్లను విసురుతూ పటాకులు పేల్చుతూ.. రభస సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అపార్ట్‌మెంట్ యజమానుల సంఘం X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.

Birthday-celebrations-On-Car

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై నందగ్రామ్ ఏసీపీ రవికుమార్ సింగ్ స్పందించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. యువకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కొందరు అసభ్య పదజాలంతో సందడి చేశారని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని.. విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

దాదాపు 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్‌లో, ముగ్గురు యువకులు కారు టాప్‌పై నిలబడి, పటాకులు పేల్చుతున్నారు. ఆ సమయంలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఇతర నివాసితులు.. నాయిస్‌తో ఇబ్బంది కలిగించవద్దని కోరినా వారు పట్టించుకోలేదు. ఫొటోలకు పోజులిస్తూ గాలిలో డబ్బులు విసిరారు.

Birthday-celebrations-On-Car

సోషల్‌ మీడియా ద్వారా తరచుగా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొందరు యువకులు ఖరీదైన లగ్జరీ కార్లలో మద్యం సేవిస్తూ వెళ్తూ రైఫిళ్లతో హల్‌చల్‌ సృష్టించారు. ఘజియాబాద్‌లోని ఎలివేటెడ్‌ రోడ్డుపై ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అయింది.

కాగా కొద్ది రోజుల క్రితం హర్యానాలోని గురుగ్రామ్ పీఎస్‌ పరిధిలో కదులుతున్న కారులో పటాకులు పేల్చినట్లు గుర్తు తెలియని యువకుడిపై కేసు నమోదు చేశారు. అక్కడి గోల్ఫ్ కోర్స్ రోడ్డులో కదులుతున్న కారు బానెట్ లోపల నుంచి పటాకులు పేలాయి. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Birthday-celebrations-On-Car

అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇటీవలి కాలంలో ప్రైవేట్‌ ప్లేసుల్లో కాకుండా పబ్లిక్‌ ప్లేసుల్లో యువ జంటలు రొమాన్స్‌ చేసుకోవడం ఎక్కువైపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇలాంటి ఘటనలో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో రోడ్డుపై కదులుతున్న కియా కారుపై యువ జంట ముద్దులు పెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రన్నింగ్‌ బైక్‌పై యువ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో కూడా హల్‌చల్‌ సృష్టించింది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై కూర్చొని యువతి రైడ్‌ చేస్తున్న యువకుడిని కౌగిలించుకుంది. రొమాన్స్‌ మత్తులో ఎలాంటి భయం లేకుండా యువకుడు బైక్ నడుపుతున్నాడు. ఇద్దరూ హెల్మెట్ ధరించకపోగా.. ఇలాంటి అసభ్యకరమైన పనులకు పాల్పడటంతో పోలీసులు వారికి రూ. 8000 జరిమానా విధించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 31, 2023, 8:55 [IST]
English summary
Young men burst crackers and throw currency on birthday celebrations in ghaziabad video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+