కారులో స్విమ్మింగ్ పూల్.. ఈ వీడియో చూస్తే మీరూ అలాగే చేస్తారేమో.!!
వేసవి కాలం వచ్చిందంటే ఎవరికైనా మొదటగా ఎక్కువగా గుర్తుకువచ్చేది స్విమ్మింగ్. ఈ వేడి వాతావరణంలో బీచ్‌లు, నదీ స్నానాలు, స్మిమ్మింగ్ పూల్స్‌కు జనం క్యూ కడుతుంటారు. ధనవంతులు అయితే ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్లు కొంచెం వెరైటీగా ఆలోచించి.. ఉన్న చోటే స్మిమ్మింగ్ పూల్ కట్టేశారు. అదెలా అంటే..
సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం వింత ఘటనలు జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాంటి వైరల్ సంఘటనల్లో ఇప్పుడు ఒకటి మిమ్మల్ని విపరీతంగా ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఇంతవరకు స్విమ్మింగ్ పూల్స్‌ను బయటనో లేదా.. ఇంట్లోనో చూసి ఉంటారు. కానీ కారులో ఎక్కడైనా చూశారా. కారులో స్విమ్మింగ్ పూల్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..?

కొందరు స్నేహితులు కారులో స్విమ్మింగ్ పూల్(Swimming Pool In Car)ను ఏర్పాటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హ్యుందాయ్ శాంట్రో లోపల ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం కొన్ని మార్పులు చేశారు. ఈ కారులో ప్రయాణికుల సీటును తొలగించారు. ఇంకా వెనుక సీట్లను కూడా తొలగించారు.
హ్యుందాయ్ శాంట్రో(Hyundai Santro) కారులో సీట్లు తొలగించిన తర్వాత కారులో నీలిరంగు టార్పాలిన్ వేసి అందులో నీళ్లు పోసి స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు. ఈ కార్ స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది స్నేహితులు ఈత కొడుతూ ఎంజాయ్ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండటంతో నెట్టింట్లో విపరీతంగా వ్యాపిస్తోంది.

సాధారణంగా, కారు లోపల ఉష్ణోగ్రత బయట(Swimming Pool In Hyundai Santro) కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని నిమిషాలు హాట్ స్పాట్‌లో పార్క్ చేసి కారు ఎక్కినా, కూర్చోలేనంతగా వేడిగా ఉంటుంది. కాబట్టి గతంలో వేసవిలో ఆవు పేడతో కార్లకు 'కోట్' వేయడం ఒక 'ట్రెండ్'. రానున్న కాలంలో కారులోపల స్విమ్మింగ్ పూల్ ఉండటం 'ట్రెండ్'గా మారినా ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేడి గాలుల తీవ్రతతో, భానుడి తాపంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ కారణంగా జనాలకి ఇలాంటి ఐడియాలు రావడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. అయితే ఇలా కారులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదని ఇక్కడ గమనించాలి. కొన్నేళ్ల క్రితం కొందరు మారుతీ 800 కారులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు.

అందులో కూడా ఇలాగే, సీట్లను తీసివేసి నీటితో నింపి, కారులో స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. ఇప్పుడు అదే తరహాలో కారులో స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. వేసవి ముగిసే వరకు ఇలాంటి ఎన్నో వినూత్నమైన వినూత్న ఘటనలు ఎన్ని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








