‘మోటార్ మంచం' ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే వీళ్ల క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేరు.!!
సోషల్ మీడియాలో తరచూ మోడిఫైడ్ బైక్‌లు, కార్లకు సంబంధించిన వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇలా కస్టమర్లకు నచ్చేలా సవరించేందుకు కొన్ని వర్క్‌షాప్‌లు కూడా ఉన్నాయి. తమకు అందుబాటులో ఉన్న మెటిరీయల్‌ను ఉపయోగించి వినూత్నంగా మోడిఫై చేస్తుంటారు. కానీ మీరెప్పుడైనా మంచం మోటార్‌సైకిల్‌ను చూశారా..
ఇటీవల ఓ వ్యక్తి తన సాధారణ కారును రోల్స్‌రాయిస్ కారులా మార్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. మరో వ్యక్తి తన పల్సర్ బైక్ ముందు చక్రం స్థానంలో ట్రాక్టర్ టైర్‌ను అమర్చి సునాయాసంగా బండిని నడిపాడు. మరో వాహనదారుడు తన టయోటా ఫార్చ్యూనర్ కారులో మోడ్రన్ టాయిలెట్‌ను అమర్చి ఔరా అనిపించాడు. అయితే ఈ వ్యక్తి మాత్రం కొత్తగా మోటార్‌కు ఏకంగా మంచాన్నే అమర్చాడు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఈ వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇది చూడటాని(Customized Motor Bed)కి చాలా ఫన్నీగా అనిపించినా.. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. అయితే దీన్ని ఎలా తయారు చేశారనే సమచారం మాత్రం ఇవ్వలేదు. ఇద్దరు వ్యక్తులు ఆ మంచం మోటార్‌ను పెట్రోల్ బంకుకు తీసుకెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు.
ఇద్దరు యువకులు ఆ కదులుతున్న మంచం మోటార్‌పై పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారు. ఒక యువకుడు స్టీరింగ్‌వీల్ పట్టుకుని ముందు భాగంలో కూర్చున్నాడు. మరో యువకుడు వెనకాల కూర్చున్నాడు. ఈ కొత్త వాహనం నాలుగు చక్రాలు, స్టీరింగ్‌తో కూడిన మంచం. కాగా మంచం వెనుక కుడి భాగంలో మోటారును అమర్చారు. దీనికి వెనుక చక్రానికి కనెక్ట్ చేశారు.

ఈ మోటారైజ్డ్ బెడ్‌ను నడుపుతూ వారు పెట్రోల్ బంక్‌కు వెళ్లడంతో అక్కడున్న సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడ ఉన్న ఓ బైకర్ వారి క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోగా.. సిబ్బంది మాత్రం షాక్‌లో ఉన్నారు. వారు షాక్‌లో ఉండగానే పెట్రోల్ బంక్‌లో మోటారైజ్డ్ బెడ్‌ను ఆపి.. ఫ్యూయెల్ ట్యాంక్‌ను తెరిచి పెట్రోల్ పోయించుకున్నారు.
ఇప్పటికే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పేజీల్లో పలు మోడిఫైడ్ కార్లు, బైక్‌లను మీరు ఎన్నో చూసే ఉంటారుర. కానీ ఇలా ఓ మంచంపై మోటార్‌ను ఇన్‌స్టాల్ చేసి నడపడం ఇదే మొదటిసారి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డుపై ఇలాంటి వాహనాలను చట్టవిరుద్ధం. ఇది చూడటానికి ఫన్నీగా ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇలాంటి వాటికి మోటార్ వాహన శాఖ అనుమతించదు.

ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. కస్టమైజ్డ్ కార్లు, బైక్‌లు ఎలా పాపులర్ అయ్యాయో.. ఈ వీడియో కూడా చాలా వ్యూస్‌ను సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు సైతం వినూత్నంగా స్పందిస్తున్నారు. దేశంలోని ప్రతి మూలలో ఇలాంటి ఇన్నోవేటర్లు ఉంటారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లిందా లేదా అనే సమచారం స్పష్టంగా లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








