సల్మాన్‌ ఖాన్‌ నటించిన ఈ హీరో హోండా బైక్‌ యాడ్‌ గుర్తుందా.. అప్పట్లో ఇదొక సెన్సేషన్‌.!!

ఒకప్పుడు హీరో హోండా(Hero Honda B) బైక్స్‌ యూత్‌ ఫేవరెట్‌గా ఉండేవి. హీరో, హోండా కంపెనీలు విడిపోకముందు దేశంలో ఈ ఉమ్మడి కంపెనీకి చెందిన మోడళ్లు ఎక్కువగా అమ్ముడయ్యేవి. ఎందుకంటే ఇవి భారత్‌లో మధ్య తరగతి ప్రజల ఫేవరెట్‌ మోటార్‌సైకిల్‌ బ్రాండ్స్‌గా ప్రసిద్ధి చెందాయి.

భారతీయ మార్కెట్లో ఒకప్పుడు హీరో హోండా కంపెనీ బైకులు ఓ వెలుగు వెలిగేవి. ముఖ్యంగా హీరో హోండా సీడీ100(Hero Honda CD100) ఒకటి. కాగా ప్రస్తుతం ఈ బైక్‌కు సంబంధించిన టీవీ కమర్షియల్ యాడ్‌ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Salman-Khan-Hero-Honda-CD100-Ad

కాగా ఈ వీడియో వైరల్‌ కావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి హీరో హోండా CD100 బైక్‌ కాగా.. మరో కారణం ఈ బైక్‌కు సంబంధించి టీవీ వాణిజ్య ప్రకటనలో బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించడం.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ టీవీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ 1985 సంవత్సరంలో విడుదలైంది. అప్పట్లో బైక్ యాడ్‌లంటే చాలా ఆసక్తికరంగా ఉండేది. 80's జనరేషన్‌ వారికి ఈ యాడ్స్‌ ఓ స్వీట్‌ మెమరీ.. అందుకే ఈ యాడ్‌ చూస్తే.. వారికి ఒకప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తుకువస్తాయి.

Salman-Khan-Hero-Honda-CD100-Ad

ఈ వీడియోను ఓ యూట్యూబర్ తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. అప్పట్లో యంగ్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన హీరో హోండా సీడీ100 బైక్‌ యాడ్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. కొందరు తమ స్వీట్‌ మెమరీ అంటూ కామెంట్‌ చేయగా.. మరికొందరు ఈ యాడ్‌ చూస్తే చాలా మందికి పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయని పోస్టు చేస్తున్నారు.

కాగా హీరో హోండా CD100 బైక్ టీవీ యాడ్‌ను.. మూడు దశల్లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ వేర్వేరు బైక్‌లలో కనిపించడాన్ని చూడవచ్చు. వీడియోలోని లొకేషన్‌ను చూసినట్లయితే.. ఈ యాడ్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో షూట్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఈ యాడ్‌ సమయంలో దీని ప్రధాన ఎజెండా ఈ బైక్ మైలేజ్‌.

Salman-Khan-Hero-Honda-CD100-Ad

నిజం.. ఎందుకంటే ఆ కాలంలో టాప్ మైలేజ్ బైక్‌లలో హీరో హోండా సీడీ100 ఒకటి. అందుకే అప్పట్లో భారత మార్కెట్లో ఈ బైక్ విపరీతమైన సేల్స్‌తో.. హీరో హోండా కంపెనీకి భారీ మార్కెట్‌ను అందించడంలో విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ బైక్ మినిమలిస్టిక్ డిజైన్, మెరుగైన అధిక పనితీరు దానిని కస్టమర్లకు మరింతగా దగ్గర చేసింది.

హీరో హోండా సీడీ100 బైక్‌ టీవీ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఈ బైక్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వైపు వెళుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అందుకే ఈ యాడ్‌ని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూట్ చేసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ హీరో హోండా CD 100 బైక్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. కాబట్టి ఈ బైక్‌ గురించి పూర్తి వివరాలు మీరు కథనంలో తెలుసుకోవచ్చు.

వింటేజ్‌ Hero Honda CD 100 బైక్ భారతీయ మార్కెట్లో మోటార్‌సైకిల్ రంగం వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా దాని మైలేజ్‌, పనితీరు కారణంగా బాగా ఆదరణ పొందింది. అప్పటి కాలంలో రహదారులు, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని రూపొందించారు. హీరో హోండా సీడీ100 బైక్ లీటరుకు సుమారు 80+ కి.మీ మైలేజ్‌ను ఇచ్చేది అంటే.. దాని పనితీరును మనం మెచ్చుకోవాల్సిందే.

అంతే కాకుండా హీరో హోండా CD100 భారత మార్కెట్లో లాంచ్ అయినప్పుడు అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బైక్ కూడా ఇదే కావడం విశేషం. హీరో హోండా తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వారి మొదటి మాస్టర్ ప్లాన్ ఈ బైక్‌. ఆ సమయంలోనే మార్కెట్లో ఖరీదైనది ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, రాజ్‌దూత్ వంటి బైక్‌లను కొనుగోలు చేయలేని వారికి ఇది ప్రధాన ఆప్షన్‌గా మారింది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 15, 2023, 14:27 [IST]
English summary
Young salman khan evergreen tv advertisement for hero honda cd100 bike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+