Just In
- 1 hr ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 4 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 5 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 6 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
- Sports
RCB vs RR: శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా.. అతడి షాట్లను బాగా ఇష్టపడతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Finance
భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, మధ్య సేవించి వాహనాలు డ్రైవ్ చేయడం మరియు వాహనాలపై భయానకమైన స్టంట్స్ చేయడం. ఈ మధ్య కాలంలో యువతకు స్టంట్స్ చేయడం చాలా ఫ్యాషన్ గా మారిపోయింది.

ఇటీవల కాలంలో ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇద్దరు మహిళలు స్టంట్స్ చేస్తున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రాంతంలో జరిగిందని నివేదికల ద్వారా తెలిసింది. వైరల్ స్టంట్ వీడియోను ఘజియాబాద్ పోలీసులు గమనించి, వారు చేసిన ఈ భయంకరమైన స్టంట్స్ కి 11,000 రూపాయల జరిమానా విధించారు.

ఇక్కడ వీడియోలో మీరు గమనించినట్లయితే ఇద్దరు మహిళలు ఒకే రంగు టీ షర్టు ధరించి కనిపిస్తారు. ఒక మహిళ మోటారుబైక్ రైడ్ చేస్తుండగా, మరొకరు మహిళా బైక్ రైడ్ చేస్తున్న మహిళ భుజాలపై కూర్చుంది.
MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

ఇద్దరు మహిళలు బైక్ స్టంట్స్ చేస్తుండగా ఈ పబ్లిక్ రోడ్డుపై, ఇతర వాహనదారులు కూడా కనిపిస్తారు. ఆ రోడ్డుపై ఇతర వాహనాలను కూడా వీడియోలో చూడవచ్చు. ప్రజా రహదారులపై ఈ రకమైన ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరం. బైక్ మీద స్టంట్స్ ధరించిన మహిళలు ఇద్దరూ ఏ మాత్రం భద్రతా పరికరాలు ధరించలేదు.

ఈ ఇద్దరూ హెల్మెట్ కూడా ధరించలేదు. కార్లలో అయినా, బైక్‌లపైనా బహిరంగ రహదారులపై ఈ విధంగా చేయడం చట్టవిరుద్ధం. ఈ విధమైన విన్యాసాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఈ ప్రమాదాల వాళ్ళ తోటి వాహనదారులు కూడా ఇబ్బందిపడవలసి వస్తుంది.
MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు
స్టంట్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే, అది పెద్ద విపత్తు కావడం ఖాయం. మీరు మీ వాహనాన్ని స్టంట్స్ చేయవలసి వస్తే, సురక్షితమైన ప్రదేశాల్లో చేయడం మంచిది. అందులోనూ సరైన భద్రతాయా పరికలను తప్పనిసరైగా ఉపయోగించాలి.

అనుభవజ్ఞులైన నిపుణులు, యువతకు అకాడమీలలో ఇటువంటి శిక్షణ తీసుకుంటారు. మీరు ఇటువంటి స్టంట్స్ బహిరంగ రహదారులపై చేయకూడదు. ఇది చాలా ప్రమాదం. కానీ ఇక్కడ కనిపిస్తున్న యువతులు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజా రహదారులపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధం.
MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]