కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ఇటీవల కాలంలో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్ల బిజీగా ఉన్న విక్కీ కౌశల్, ఈ మధ్య కాలంలోనే మళ్ళీ షూటింగ్స్ లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం విక్కీ కౌశల్, సారా అలీఖాన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సమయంలో అనుకోని ఒక కేసులో విక్కీ కౌశల్ పేరు నమోదైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

ప్రస్తుతం విక్కీ కౌశల్, సారా అలీఖాన్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ లో జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బయటపడింది. ఇందులో విక్కీ కౌశల్ సారా అలీఖాన్ ని బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లడం చూడవచ్చు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పై భారీగా అంచనాలు ఉన్నట్లు సామజిక వర్గాలు చెబుతున్నాయి.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

అయితే ఇండోర్ కి చెందిన జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి విక్కీ కౌశల్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఎందుకంటే సినిమా సీక్వెన్స్‌లోఉపయోగించిన మోటార్‌ సైకిల్ నంబర్ ప్లేట్‌ తనకు చెందినది. తన అనుమతి లేకుండా తన వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ ఉపయోగించడంపైన పోలీసులకు పిర్యాదు చేసాడు.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

పోలీసులు ఈ విషయాన్నీ గురించి మీడియాతో ప్రస్తావిస్తూ.. మాకు నెంబర్ ప్లేట్ సొంత వ్యక్తి యొక్క అనుమతి పొందకుండా వినియోగించారనే ఆరోపణ ఉంది. అయితే దీనిపైన పూర్తి వివరాలను తెలుకున్న తరువాత, మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

విక్కీ కౌశల్ తన రాబోయే చిత్రం కోసం ఇండోర్ వీధుల్లో సారా అలీ ఖాన్‌తో కలిసి బైక్ నడుపుతూ కనిపించిన తర్వాత ఫిర్యాదు నమోదైంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఏవి అధికారికంగా బయటకు రాలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

భారతదేశంలో రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చడం అనేది అతిపెద్ద నేరం. కార్లు, ట్రక్కులు, బస్సులు, ద్విచక్ర వాహనాలు మరియు అన్నిటితో సహా ప్రతి మోటారు వాహనం RTO లేదా ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుతుంది. ఈ ప్రత్యేకమైన వెహికల్ నెంబర్ దొంగతనం లేదా నేరం జరిగినప్పుడు వాహనాన్ని గుర్తించడానికి పోలీసులకు సహాయపడుతుంది.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

సాధారణంగా వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ దాని ఛాసిస్ నంబర్ మరియు ఇంజిన్ నంబర్‌కు లింక్ చేయబడి ఉంటుంది. భారతదేశంలో ఏ రెండు వాహనాలు ఒకే ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ మరియు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది చట్ట విరుద్ధం అవుతుంది.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

రిజిస్ట్రేషన్ నంబర్ మార్చడం చట్టరీత్యా నేరమని, వెంటనే వాహనాన్ని సీజ్ చేస్తారు. మోటారు వాహన చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన ఫాంట్‌లలో రిజిస్ట్రేషన్ నంబర్లు వ్రాయబడ్డాయి. భారతదేశంలోని ప్రతి రిజిస్ట్రేషన్ బోర్డు ఏకరూపతను కొనసాగించడానికి ఒకే సైజు అక్షరాలు మరియు సంఖ్యలను తప్పనిసరిగా ఉపయోగించాలి.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

ప్రధాన నగరాల్లో, పోలీసులు ఇటువంటి రిజిస్ట్రేషన్ బోర్డులపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. కావున వాహన వినియోగదారులు తప్పకుండా మోటార్ వాహన చట్టానికి బద్ధులై ఉండాలి. లేకుంటే భారీ జరిమానాలు, లేదా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వాహన వినియోగదారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.మొత్తానికి ఈ నెంబర్ ప్లేట్ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో త్వరలో తెలుస్తాయి.

కత్రినాకు షాక్.. వివాదంలో చిక్కుకున్న విక్కీ కౌశల్‌, అసలు విషయం ఏమిటంటే?

ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ కి సాధారణంగానే కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇతడు ఆధునిక కార్లను కలిగి ఉన్నారు. ఇందులో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ LWB, మెర్సిడెస్-బెంజ్ మరియు బిఎండబ్ల్యు 5జిటి వంటి ఆధునిక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

బాలీవుడ్ సినీ రంగంలో లగ్జరీ కార్లను ఎక్కువుగా ఇష్టపడే వారిలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు మరియు హిందీ మొదలైన భాషల్లోని సినిమాల్లో నటించి చాలా పాపులర్ అయ్యింది. కత్రినా కైఫ్ కలిగి ఉన్న లగ్జరీ కార్ల విషయానికి వస్తే, ఆడి క్యూ7, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ వంటి వాటిని కలిగి ఉంది.

Most Read Articles

English summary
Youngster filed complaint against vicky sara ali khan for using fake number plate details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X