టెస్ట్‌డ్రైవ్ కోసం అని స్కార్పియోను తీసుకెళ్లి చివరికి దొగంతనం చేశాడు
మోసానికి హద్దే ఉండదని నిరూపించాడు మరో ఘనుణుడు, మహీంద్రా స్కార్పియోను కొంటానని చెప్పిన వ్యక్తి టెస్ట్ డ్రైవ్ కోసం అని తీసుకెళ్లి చివరికి అదే కారుతో ఉడాయించాడు. దాని అమ్మదలుచుకున్న వ్యక్తి మాత్రం ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ సంఘటన బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పరిసర ప్రాంతంలో చోటుచేసుకుంది.

బెంగళూరు నివసించే ఐటి ఉద్యోగి అభిషేక్ కుమార్ తన స్కార్పియో వాహనాన్ని అమ్మదలుచుకున్నాడు. దాని కోసం వివిధ రకాల సామాజిక మరియు ఆన్‌లైన్ పోర్టల్‌ను తన స్కార్పియో అమమకానికి ఆశ్రయించాడు. ఇంతలో నా పేరు శంకర్ మీ స్కార్పియోను నేను కొంటాను అని ఫోన్ చేశాడు.
26 నిమిషాల్లో 20 శాటిలైట్లను ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వీ రాకెట్ గురించి నమ్మశక్యం కాని నిజాలు
ఆ తరువాత ఒకే వారంలో శంకర్ అభిషేక్‌ను మూడు మార్లు కలిశాడు. అయితే శంకర్ అనే వ్యక్తి వయస్సు కేవలం 20 ఏళ్లు ఉన్నాయని మీ పెద్దలతో వచ్చి సంప్రదించని ఆభిషేక్ తెలిపాడు. ఈ మధ్యలోనే శంకర్ ఒ సారి స్కార్పియోను టెస్ట్‌డ్రైవ్ కూడా చేసాడు. అప్పట్లో శంకర్ స్కార్పియోను నడిపే సమయంలో ఈ ఐటి ఉద్యోగి ఓ చిన్న షార్ట్ ఫిలిం కూడా తీశాడు.
నిస్సాన్ జిటి-ఆర్ రూపంలో మారుతి సుజుకి స్విఫ్ట్
మరో సారి వచ్చిన శంకర్ స్కార్పియోను మరో సారి టెస్ట్ డ్రైవ్ చేయాలని కోరాడు, దీనికి అభిషేక్ అంగీకరించాడు. ఇంకేముంది దొరికిందే అవకాశం అని ఆ బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియోతో ఉడాయించాడు. శంకర్ ఎంత సేపటికి రాకపోయేసరికి తన కెఎ 53 జడ్ 8098 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ గల స్కార్పియో వాహనం దొంగలించబడిందని సంభందిత పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేసాడు. మహీంద్రా స్కార్పియో వాహనం యాజమాని యొక్క వివరాలు క్రింది గమనించగలరు.



Click it and Unblock the Notifications








