సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. తాజాగా, ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అతడ్ని చిక్కుల్లో పడేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

సెల్ఫీలు తీసుకున్నందుకు కొంతమంది యువకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది. పోలీసులు సదరు యువకులపై కేసు నమోదు చేసి వారికి రూ.7,500 జరిమానా కూడా విధించినట్లు సమాచారం.

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది సర్వసాధారణమైన అంశం. అయితే, కొందరు సెల్ఫీ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సందర్భాలు మరియు సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా మనం చూశాం.

MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

తాజాగా జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఇంటర్నెట్‌లో

ట్రెండింగ్‌గా ఉండేందుకు గానూ కొందరు యువకులు చలనంలో ఉన్న కారు బానెట్‌పై కూర్చుని సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ప్రమాదకరమైన చర్యకు గానూ యూపీ పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

భారత మోటారు వాహన చట్టం ప్రకారం, ప్రజా రహదారులపై స్టంట్ చేయడం మరియు ప్రమాద భరితంగా వాహనాలను నడపటం శిక్షార్హమైన నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు గానూ సదరు యువతపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర సందర్భాలను నివారించేందుకు పోలీసులు చాలా కఠినమైన నిఘాను పాటిస్తున్నారు.

MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

అయినప్పటికీ, కొందరు అత్యుత్సాహంతో ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. కానీ, ఏదో ఒక సందర్భంలోనో లేక వారు చేసే చిన్నపాటి పొరపాట్ల కారణంగానో పోలీసులకు దొరికి, చిక్కుల్లో పడుతుంటారు. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకులు చేసిన పొరపాటు కూడా అలాంటిదే.

సదరు యువకులు ఈ స్టంట్ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి, సదరు వీడియోని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో, అది యూపీ పోలీసుల కంటపడింది. సదరు వీడియో ఆధారంగా ముగ్గురు యువకులపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. స్టంట్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు జప్తు చేశారు.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

అదనంగా, మోటారు వాహన చట్టం, ఐపిసి సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలో యువకులు తమ కాలేజీకి వెళ్లే దారిలో కారు బోనెట్ మీద కూర్చుని సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తారు. ఇందులో ఒక యువకుడు కారు నడుపుతుండగా, మిగతా ఇద్దరు యువకులు కారు బానెట్‌పై కూర్చుని వీడియో కోసం పోజు ఇస్తుంటారు.

సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

అతికొద్ది సమయంలోనే ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఆ వీడియోని సాక్ష్యంగా తీసుకున్న పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిని సదరు యువత స్టంట్ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ కారు పోలీసులు ఆధీనంలో ఉంది.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

Image Courtesy: Sakshya News

Most Read Articles

English summary
UP Police Fined Youngsters For Taking Selfie On Moving Car’s Bonnet. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X