మీ వ్యక్తిత్వం గురించి తెలియజేసే మీ కారు కలర్
మనది అందమైన రంగుల ప్రపంచం. దాదాపు మన చూసే ప్రతి వస్తువులోను రంగు (కలర్) ఉంటుంది. అలాగే, మనకు నచ్చి వస్తువులను ఎన్నుకునేటప్పుడు కలర్ గురించి ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటుంటాం. ధరించే దుస్తులు మొదలుకు నడిపే వాహనాల వరకూ ప్రతి సందర్భంలో కలర్ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కార్ల విషయంలో దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే, ఒకేసారి పెద్ద మొత్తంలో కారు కొనుగోలుపై వెచ్చిస్తాం కాబట్టి మనసుకు నచ్చిన కలర్‌ను ఎంచుకుంటాం.
అయితే, ఈ మీరు ఎన్నుకునే కారు కలర్ మీ వ్యక్తితత్వాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా..!? వినడానికి చిత్రంగా ఉన్నా అనేక మందికి ఇది వర్తిస్తుంది. మీరు ఎంచుకునే కారు కలర్‌ను బట్టి మీరెలాంటి వారో, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు అంటున్నారు పరిశోధకులు. కార్ల రంగులు మరియు కొనుగోలుదారుల వ్యక్తిత్వాలపై పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. మరి మీరు ఎంచుకున్న కారు కలర్‌తో మీ వ్యక్తిత్వం సరిపోతుందో లేదో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
తెలుపు (వైట్):
సాధారణంగా తెలుపు రంగు అంటేనే స్వచ్ఛతకు నిర్మలత్వానికి ప్రతీక మనందరికీ తెలుసు. అలాగే, తెలుపు రంగు వాహనాలకు మంచి రీసేల్ వ్యాల్యూ కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు తెలుపు రంగు వాహనాన్ని కలిగి ఉన్నారంటే.. మీరు సహజ సిద్ధమైన వైఖరిని, విషయాల పట్ల స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారని అర్థం. మీరు సున్నితమైన మనస్కులు కూడా. అంతేకాదు.. తెలుపు రంగును ఇష్టపడేవారు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
నలుపు (బ్లాక్):
తెలుపు రంగు వాహనాల మాదిరిగానే నలుపు రంగు వాహనాలు కూడా ఎప్పటికీ రంగు వెలిసిపోకుండా ఉండి మంచి రీసేల్ వ్యాల్యూ పలుకుతాయి. ఒకవేళ మీరు నలుపు రంగు వాహనాన్ని కలిగి ఉంటే, మీరు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు, మీపై వేరొకరు అధిపత్యాన్ని చలాయించడం మీకు నచ్చదు. చరిత్రను ఇష్టపడే వారు కూడా నలుపు రంగు కార్లపై ఆసక్తి చూపుతారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
సిల్వర్ (వెండి కలర్):
తెలుపు, నలుపు రంగుల మిశ్రమంతో ఏర్పడే సిల్వర్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు గంభీరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
ఎరుపు (రెడ్):
సాధారణంగా ఎరుపు రంగు అంటే వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక. ఒకవేళ మీ వాహనం రంగు ఎరుపు గనుక అయితే మీరు సాహసోపేతమైన వ్యక్తి అని అర్థం. మీరు ఎల్లప్పుడూ ఇతరులను అధిగమించాలని భావిస్తుంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
పసుపు (యల్లో):
పసుపు రంగు శుభానికి ప్రతీక. పసుపు రంగు వాహనాలను ఇష్టపడేవారు చాలా హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
నారింజ (ఆరెంజ్):
ఎరుపు పసుపు రంగుల కలయికతో ఏర్పడేదే నారింజ రంగు. మన రోడ్లపై ఈ కలర్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఒకవేళ మీ వాహనం రంగు నారింజ గనుక అయితే మీరు మాటకారులని అర్థం. మీరు ఎల్లప్పుడూ చురుకుగా, సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
బ్రౌన్ (కాఫీ కలర్):
బ్రౌన్ కలర్ నిస్తేజానికి ప్రతీక, మరి మీరు కూడా అలానే ఉంటారా? ఈ రంగు వాహనాలను ఇష్టపడే వారు నిరాడంబరంగా ఉంటారు. ఎలాంటి ఢాంబికాలకుపోరు. చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
గ్రే (బూడిద రంగు):
గ్రే కార్పోరేట్ కలర్‌ను సూచిస్తుంది. ఈ కలర్ వాహనాలను ఇష్టపడే వారు, హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో ఆచరణాత్మకంగా ఉంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
గ్రీన్ (ఆకుపచ్చ):
సాధారణంగా గ్రీన్ (ఆకుపచ్చ) రంగు కళ్లకు చాలా మంచిది. మీరు గమనించినట్లయితే.. ఆస్పత్రులలో ఎక్కువగా గ్రీన్ కలర్‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు ఆకపచ్చ రంగు వాహనాలను ఇష్టపడే వారు అయితే.. సమానమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి సాంప్రదాయ బద్ధంగా వ్యవరిస్తారని అర్థం.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
పింక్ (గులాబీ):
పింక్ కలర్‌ను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. సాధారణంగా పింక్ కలర్‌ను ఇష్టపడేవారు కాస్తంత చిలిపిగా, అందంగా ఉంటారని చెప్పవచ్చు. ఒకవేళ మీ వాహనం రంగు పింక్ అయితే మీరు అమాయకంగా ఉండి యువత అయి ఉంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
పర్పల్ (వంగపూత రంగు):
ఇది కూడా చాలా అరుదైన రంగు. ఇది సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక. పర్పల్ కలర్ వాహనాలను ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలని అనుకుంటుంటారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
గోల్డ్ (స్వర్ణం):
ఒకవేళ మీరు బంగారు వర్ణపు కారును గనుక కలిగి ఉంటే.. మీకు విలాసాలంటే చాలా ఇష్టమని అర్థం. మీరు బాగా ధనికులై ఉంటారు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.

మీ కారు కలర్ మరియు మీ వ్యక్తిత్వం
మరి ఇందులో.. మీ కారు రంగు ఏంటి..? అలాగే, మీ కారు రంగు మీ వ్యక్తిత్వం గురించి కరెక్టుగానే చెప్పిందా..?


Click it and Unblock the Notifications








