పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

రోడ్డుపై వాహనదారులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మరియు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులకులు కలిగించకుండా ప్రయాణించాలి. అలా కాదని ప్రజా రహదారులపై వెళ్ళేటప్పుడు అత్యధికవేగంతో వెళ్లడం మరియు బైక్ స్టంట్స్ లాంటివి చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు.

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల తప్పుచేసిన వారి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం మంచిది. తప్పుచేసిన వారిని అధికారులు సులభంగా పట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఒక యువకుడిని ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేయడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది.

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

యువకులు తమ కార్లు మరియు బైక్‌లను బహిరంగ రహదారులపై అత్యధికవేగంతో వెళ్లిన చాలా సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుత ఎబిఎన్ తెలుగు నివేదికలప్రకారం, ఒక యువకుడు ఇప్పుడు ఇలాంటి స్టంట్ చేసి పోలీసులకు చిక్కాడు.ఆ యువకుడి అరెస్టును సైబరాబాద్ పోలీసుల అధికారిక సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

గుర్తు తెలియని యువకుడు పబ్లిక్ రోడ్‌లో స్టంట్ చేస్తూ వీడియోను తన సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తరువాత, సైబరాబాద్ పోలీసులు అతని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్టయిన యువకుడిపై బహిరంగ రహదారిపై మరియు మోటారు వాహన చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రమాదకరమైన స్టంటింగ్ ఆరోపణలు ఉన్నాయి.

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

ఈ ప్రమాదకరమైన రైడింగ్ కి కారకుడైన యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారా లేదా అనేది కచ్చితంగా తెలియదు. బహిరంగ రహదారిపై ప్రమాదకరమైన స్టంటింగ్ వాహనదారుని మాత్రమే కాకుండా రహదారిపై ప్రయాణించే ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది.

MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

ఇప్పటికి కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఇలాంటి వార్తలు వెలుగులకి వస్తూనే ఉన్నాయి. అంతే కాదు ఇలాంటి ప్రమాదకర సంఘటనలకు కారణమైన వారిని పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పయికి ఇటువంటి సంఘటనలు పూర్తిగా నిలువరించలేకపోతున్నారు.

రహదారిపై ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల సహాయంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సిసిటివిల సహాయంతో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిని కూడా పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తున్నారు.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

బైక్ స్టంట్ వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

ఈ-చలాన్లు ఫోటో మరియు వీడియో ఆధారాలతో వాహన యజమానులకు పంపబడతాయి. ట్రాఫిక్ పోలీసులు లేనప్పుడు కూడా సిసిటివి కెమెరాలు వాహనదారులను పర్యవేక్షిస్తాయని వాహనదారులకు తెలుసు. కావున రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనదారులు అప్రమత్తంగా ఉండి తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.

Image Courtesy: ABN Telugu

Most Read Articles

English summary
Youth Arrested For Doing Bike Stunt In Hyderabad. Read in Telugu.
Story first published: Saturday, March 6, 2021, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X