Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్
రోడ్డుపై వాహనదారులు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మరియు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులకులు కలిగించకుండా ప్రయాణించాలి. అలా కాదని ప్రజా రహదారులపై వెళ్ళేటప్పుడు అత్యధికవేగంతో వెళ్లడం మరియు బైక్ స్టంట్స్ లాంటివి చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు.

రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల తప్పుచేసిన వారి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం మంచిది. తప్పుచేసిన వారిని అధికారులు సులభంగా పట్టుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఒక యువకుడిని ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేయడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది.

యువకులు తమ కార్లు మరియు బైక్‌లను బహిరంగ రహదారులపై అత్యధికవేగంతో వెళ్లిన చాలా సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుత ఎబిఎన్ తెలుగు నివేదికలప్రకారం, ఒక యువకుడు ఇప్పుడు ఇలాంటి స్టంట్ చేసి పోలీసులకు చిక్కాడు.ఆ యువకుడి అరెస్టును సైబరాబాద్ పోలీసుల అధికారిక సోషల్ నెట్‌వర్కింగ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

గుర్తు తెలియని యువకుడు పబ్లిక్ రోడ్‌లో స్టంట్ చేస్తూ వీడియోను తన సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తరువాత, సైబరాబాద్ పోలీసులు అతని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్టయిన యువకుడిపై బహిరంగ రహదారిపై మరియు మోటారు వాహన చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రమాదకరమైన స్టంటింగ్ ఆరోపణలు ఉన్నాయి.

ఈ ప్రమాదకరమైన రైడింగ్ కి కారకుడైన యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారా లేదా అనేది కచ్చితంగా తెలియదు. బహిరంగ రహదారిపై ప్రమాదకరమైన స్టంటింగ్ వాహనదారుని మాత్రమే కాకుండా రహదారిపై ప్రయాణించే ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది.
MOST READ:మైసూర్‌లో రోడ్డెక్కిన అంబారీ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు

ఇప్పటికి కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఇలాంటి వార్తలు వెలుగులకి వస్తూనే ఉన్నాయి. అంతే కాదు ఇలాంటి ప్రమాదకర సంఘటనలకు కారణమైన వారిని పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పయికి ఇటువంటి సంఘటనలు పూర్తిగా నిలువరించలేకపోతున్నారు.
రహదారిపై ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల సహాయంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సిసిటివిల సహాయంతో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసేవారిని కూడా పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తున్నారు.
MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

ఈ-చలాన్లు ఫోటో మరియు వీడియో ఆధారాలతో వాహన యజమానులకు పంపబడతాయి. ట్రాఫిక్ పోలీసులు లేనప్పుడు కూడా సిసిటివి కెమెరాలు వాహనదారులను పర్యవేక్షిస్తాయని వాహనదారులకు తెలుసు. కావున రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనదారులు అప్రమత్తంగా ఉండి తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
Image Courtesy: ABN Telugu