రూపాయి.. రూపాయి పోగేసి KTM బైక్ కొనేసాడు [వీడియో]
ఈ ఆధునిక కాలంలో ఏదైనా ఒక చిన్న వస్తువును కొనుగోలు చేసినా ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ చేసేస్తున్నారు. కాలం అంతగా మారిపోయింది. అయితే ఇటీవల ఒక వ్యక్తి తనకు ఇష్టమైన బైకుని కేవలం రూపాయి నాణేలతోనే కొనేసాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.
నివేదికల ప్రకారం, తెలంగాణ మంచిర్యాల ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి తనకు ఇష్టమైన కెటిఎమ్ 250 బైక్ కొనటానికి సంచుల్లో రూపాయి నాణేలు నింపుకుని డీలర్‌షిప్‌కి వచ్చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేయాలనుకున్న బైక్ ధర రూ. 2.85 లక్షలు. ఈ మొత్తం డబ్బును కేవలం రూపాయి నాణేల రూపంలో తీసుకొచ్చాడు. ఈ మొత్తం నాణేలను చిన్న చిన్న 112 సంచుల్లో నింపుకుని ఒక మినీ వెహికల్ లో తీసుకొచ్చాడు.

వెంకటేష్ తీసుకువచ్చిన మొత్తం 112 సంచుల్లో ఒక్కొక్క సంచిలో 2,500 రూపాయి నాణేలు ఉన్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. మొదట డీలర్‌షిప్ వారు ఈ నాణేలు తీసుకోవడానికి కొంత వెనుకాడరు. అయితే ఈ బైక్ పట్ల వారికున్న ఆసక్తిని గమనించి ఆ నాణేలు తీసుకుని బైక్ డెలివరీ చేయడానికి ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో 'విలన్ మామా గేమింగ్' యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.
నిజానికి తనకు ఇష్టమైన కెటిఎమ్ డ్యూక్ 250 బైక్ కొనాలని చాలా రోజుల నుంచి అనుకున్నట్లు, అందుకంటే దాహం బాల్యం నుంచి 40,000 రూపాయి నాణేలను కోడబెట్టాడని చెప్పాడు. అయితే మిగిలిన మొత్తాన్ని కొన్ని బ్యాంకులను సంప్రదించి తీసుకున్నట్లు కూడా చెప్పాడు. మొత్తానికి తనకు ఇష్టమైన బైకుని రూపాయి నాణేలతో కొనేయాలని గట్టిగా అనుకోవడం వల్ల ఇది సాధ్యమయింది. ఈ రూపాయి నాణేలను మొత్తం లెక్కపెట్టడానికి ఆ డీలర్‌షిప్ లో ఒక ఐదు మంది సిబ్బందికి కనీసం ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉంది.
కెటిఎమ్ డ్యూక్ 250 బైక్ విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో చాలామంది యువకులకు ఇష్టమైన బైకులలో ఇది ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్, మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 248 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.5 బిహెచ్‌పి పవర్ మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
మొత్తానికి వెంకటేష్ తనకు నచ్చిన డ్రీమ్ బైక్ రూపాయి నాణేలతో కొనేసి చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే అతడు చేసిన పని వల్ల ఆ డీలర్‌షిప్ సిబ్బందికి మాత్రం పని ఎక్కువయిపోయింది. ఇలా నాణేలతో బైకులు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి కూడా మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇది వాటికి కొంత భిన్నంగా ఉందని మనకే తెలుస్తుంది.
గతంలో వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటనల్లో కొంత మొత్తం నాణేలు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నోట్ల రూపంలో ఇచ్చారని చదువుకున్నాం. కానీ వెంకటేష్ మాత్రం మొత్తం రూపాయి నాణేలను సేకరించి బైక్ కొనుగోలు చేసాడు. నిజానికి మొత్తం ఇన్ని నాణేలతో వాహనాలు గానీ ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే దానిని మాలీ బ్యాంకులో వేయడం కొంత సమస్యగా ఉంటుంది. అయితే వారు ఇన్ని నాణేలకు ఇంత డబ్బు అని వెచ్చించి తీసుకునే వెసులుబాటుని కల్పిస్తారు.
ఇదిలా ఉండగా గత మార్చిలో తమిళనాడులోని సేలం నగరంలో నివసించే 'భూపతి' అనే వ్యక్తి తాను ఎంతగానో ఇష్టమైన బజాజ్ డామినార్ బైక్ ను మొత్తం రూ. 1 నాణేలు చెల్లించి కొనుగోలు చేసాడు. ఈ నాణేల కోసం దేవాలయాలు, టీ దుకాణాలు మరియు హోటళ్లలో తన నోట్లను ఒక రూపాయి నాణేలకు మార్చుకునేవాడు. మొత్తానికి అనుకున్న విధంగా మొత్తం డబ్బు రెడీ చేసి బైక్ కొనుగోలు చేశాడు.


Click it and Unblock the Notifications








