మహీంద్రా స్కార్పియో కార్లపై డేంజరస్ స్టంట్స్.. లక్ష రూపాయల జరిమానా విధించిన పోలీసులు
యువత సోషల్ మీడియా క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. కెమెరా కనిపిస్తే చాలు ప్రమాదాకర విన్యాసాలు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. రీల్స్, వైరల్ వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరి వైఖరిలో మార్పు రావడం లేదు.
మహీంద్రా స్కార్పియో కార్లలో ప్రయాణించిన కొందరు యువకులు బానెట్‌పై నిలబడి ప్రమాదకర ప్రయాణం చేశారు. రెండు కార్లపైకి ఎక్కి హల్‌చల్ చేశారు. దీంతో ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వారు ఉపయోగించిన స్కార్పియో కార్లు ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్లను కలిగి ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో రెండు వాహనాలపై ఇద్దరు యువకులు ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ముందుకారులో ఉన్న ఓ వ్యక్తి ఆ వీడియోను రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో యువకులు ఇద్దరు ఎటువంటి భద్రతా ప్యాడ్‌లు ధరించలేదు. ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగితే... భారీగా గాయపడే అవకాశం ఉంటుంది. ముందు స్కార్పియో బానెట్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక వేళ జారిపడితే.. ప్రాణాలకే ప్రమాదం జరిగేది.
ఈ ఘటనపై ఓ వాహనదారుడు ట్విట్టర్ (X) ద్వారా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందిన పోలీసులు మహీంద్రా స్కార్పియో యజమానులకు భారీగా జరిమానా విధించారు. ఒక్కక్కరికి రూ.52,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు.

ఇటీవల ఇటువంటి ఘటనలు బాగా పెరుగుతున్నాయి. కెమెరా కనిపిస్తే చాలు వింత వింత విన్యాసాలు చేస్తున్నారు. పబ్లిక్ రోడ్లపై ఉన్నామనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనలపై సీసీ కెమెరాలు సహా ఇతర మార్గాల ద్వారా సమాచారం తీసుకుంటున్న పోలీసులు వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీగా జరిమానా విధిస్తున్నారు.
గత సంవత్సరం ముంబైలో బాగా రద్దీగా ఉన్న రోడ్లపై నిబంధనలు ఉల్లఘిస్తు వాహనాలు నడిపిన యువకులను అరెస్ట్ చేశారు. 6 నెలలపాటు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకున్నారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా యువకులను పట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇవే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇటువంటి ఘటనలు కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురవుతున్న దృష్ట్యా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. రోడ్లపైన ఉన్న సీసీ కెమెరాలు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వైరల్ అయిన వీడియోల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారానే చలాన్‌లు విధిస్తున్నారు.
భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రేటు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ శాతం మరణిస్తున్నారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా డ్రైవింగ్ చేయడం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా... కొందరిలో మార్పు రావడం లేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








