Stunts on Road ఇదేం చిల్లర పని.. హైవే డివైడర్లపై స్టంట్స్ చేస్తూ వీడియో తీసిన యువకులు.. కార్లు సీజ్!!
పబ్లిక్ రహదారులపై విన్యాసాలు చేయడం నేరం. ఈ విషయం తెలిసినా కొందరు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతుంటారు. ఈ చర్యల వల్ల వారితో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతర వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులకూ తలనొప్పిని కలిగిస్తున్నారు కొందరు ఆకతాయిలు.
రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. కర్ణాటక ఉడిపిలోని 66వ జాతీయ రహదారిపై పలువురు కార్లతో స్టంట్స్ చేశారు. నాలుగు కార్లతో వేగంగా వెళ్తూ ప్రమాదకరంగా వాహనాలు నడిపారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

కర్ణాటక ఉడిపిలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని 66వ జాతీయ రహదారిపై కొందరు యువకులు నాలుగు కార్లతో ఇష్టారీతిన డ్రైవింగ్ చేశారు. డివైడర్ పైకి ఎక్కుతూ, రోడ్డుపై అటూఇటూ నడుపుతూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపించారు. ఈ తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనలో వారు నడిపిన మహీంద్రా థార్, టయోటా ఫార్చ్యూనర్, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ క్రెటా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్లు షానూన్ డిసౌజా (25), వివేక్ (23), అయాన్ (24), విశాలుద్దీన్ (23)లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అందరూ పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం. రహదారిపై వారు వాహనం నడుపుతున్న తీరుకు ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రోడ్డుపై స్టంట్ చేసినందుకు ఓ విద్యార్థికి భారీ జరిమానా విధించిన పోలీసులు అతని కారును సైతం పోలీసులు సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై స్టంట్స్ చేస్తూ బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా మహారాష్ట్ర, తమిళనాడులో ఇద్దరు స్కూటరిస్టులు స్కూటర్‌పై వెళ్తూ వింత చేష్టలకు పాల్పడ్డారు. బకెట్‌లో నీళ్లు పోసుకుని బండిపై పెట్టుకుని వాహనం నడుపుతూ స్నానం చేశారు. ఈ సన్నివేశాన్ని మరొకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారికి జరిమానా విధించారు.
పబ్లిక్ రోడ్లు లేదా జాతీయ రహదారులపై వాహనాల ద్వారా విన్యాసాలు చేయడం చట్టపరంగా నేరం. ఇలా విన్యాసాలు చేస్తూ చాలామంది ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా మృత్యువాత పడిన సందర్భాలూ ఉన్నాయి. పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా ఆకతాయి చేష్టలు మానడం లేదు. కేసు నమోదు చేసి జరిమానా విధించినా.. జరిమానా చెల్లించి మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








