Delhi Metro Viral Video మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇటీవల తరచూ కొందరు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. రోడ్డుపై వాహనం నడుపుతుండగా కారుపై పుషప్‌లు చేయడం, డోర్‌కు వేలాడుతూ నిలబడటం, బైక్‌పై వెళ్తూ అసభ్యకర పనులకు పాల్పడటం సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇటీవల మెట్రో రైలులో యువకులు చేసిన చర్య.. మెట్రో సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది.
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ నగరాల్లో మెట్రో రైళ్ల వినియోగం పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సాంకేతికత సాయంతో మెట్రో రైళ్లలో ప్రజల భద్రత కోసం ఆటోమేటిక్ డోర్లను అమర్చారు. ట్రైన్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత మాత్రమే ఈ తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం అన్ని డోర్లు మూసివేసిన తర్వాత మాత్రమే మెట్రో రైలు బయలుదేరుతుంది.
అయితే ఈ టెక్నాలజీ చాలా మంది మెట్రో రైలు ప్రయాణికులకు సుపరిచితమే. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ట్రైన్ కదిలేముందు డోర్లు మూసివేయబడుతుండగా.. అవి క్లోజ్ అవ్వకుండా కాళ్లతో అడ్డుకుంటున్నారు. ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో గమినిస్తే ఇద్దరు యువకులు మెట్రో రైలు తలుపుల దగ్గర నిలబడి ఉన్నారు. అప్పుడు రైలు డోర్ మూసేయడానికి ప్రయత్నించినప్పుడు.. యువకులు తమ కాళ్ళను అడ్డంగా ఉంచి, తలుపు మూసివేయడానికి లేకుండా అడ్డుకున్నారు. మెట్రో రైళ్లలో ఆటోమేటిక్ డోర్ల మధ్యలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే తెరుచుకుంటాయి.
ఈ వీడియోలో యువకులు కాళ్లతో తలుపు మూయకుండా ఆపుతున్నారు. ఈ సమయంలో వారి స్నేహితులు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఢిల్లీ మెట్రో అథారిటీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్‌కు స్పందించిన ఢిల్లీ మెట్రో అడ్మినిస్ట్రేషన్.. నిర్దిష్ట మెట్రో రైలు కోచ్ నంబర్‌ను కోరింది. ఇలా చేయడం శిక్షార్హమైన నేరమని, ఎవరైనా యువకులు మెట్రో ట్రైన్లలో ఇలాంటి చర్యలకు పాల్పడితే హెల్ప్‌లైన్ నంబర్ 155370కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వ్యక్తికి ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైన్‌లో ఇలా ప్రవర్తిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులకు కలిగించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలో ఉన్న యువకులు పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
మెట్రో ఉద్యోగులే కాకుండా వివిధ రంగాల్లో ఉన్న వారికి సౌకర్యవంతమైన రవాణా సదుపాయం. ఇది ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేగంగా మరియు ఇబ్బందులు లేకుండా గమ్యస్థానానకి చేరుస్తుంది. ఇందులో యువత రీళ్లు, వీడియోల కోసమో, స్వల్పకాలిక సంతోషం కోసమో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం నేరమని మెట్రో అధికారులు వెల్లడించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








