స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

ప్రపంచంలో రోడ్డు వ్యవస్థ దుర్భరంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి సరైన రోడ్డు వ్యవస్థ లేదు. అయితే కేంద్ర రవాణా శాఖ భారతదేశంలో రహదారి అభివృద్ధి వేగం గురించి గణాంకాలను విడుదల చేస్తూనే ఉంది. కానీ దేశంలో చాలా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

ఇటీవల దీనికి సంబంధించిన ఒక సంఘటన బయటపడింది. ఈ సంఘటన రోడ్లు లేని తీరుని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. నివేదికల ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగర్ సమీపంలో జరిగింది. గ్రామంలో సరైన రోడ్డు లేకుపోవడాన్ని నిరసిస్తూ ఆ గ్రామంలో కొంతమంది యువకులు నిరసనలు తెలిపారు.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

నిరసనలో భాగంగానే ఆ యువకులు యమహా రే జెడ్ స్కూటర్‌ను భుజాలపై మోసుకుని వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. అంతే కాదు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యువకులు ఒక వెదురు కర్రకు స్కూటర్ ని వేలాడగట్టి భుజాలపై మోసుకెళ్తున్నారు.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

ఈ సంఘటన జరిగిన గ్రామం గురించి ఇక్కడ అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ యువకులు భుజంపై స్కూటర్ ని దాదాపు 8 కిలోమీటర్లు మోసుకెళ్లినట్లు తెలిసింది. సాధారణంగా నిరసన తెలిపే ఈ యువకుల పట్టణంలో స్కూటర్లు లేదా ఇతర వాహనాలు ఉన్నాయో లేదో తెలియదు.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నివేదికల ప్రకారం, ఏప్రిల్ మరియు మే నెలల్లో కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపు 1,470 కిలోమీటర్ల రహదారిని నిర్మించినట్లు తెలిసింది. గతేడాదితో పోల్చితే ఎన్‌హెచ్‌ఏఐ రహదారి నిర్మాణాన్ని 73.5% పెంచినట్లు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ తెలిపింది.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌హెచ్‌ఏఐ దాదాపు 4,350 కిలోమీటర్ల రహదారులను నిర్మించింది. ఎన్‌హెచ్‌ఏఐ దాని సామర్థ్యాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎక్కువ వేగంగా నిర్మించాలని కాంట్రాక్టర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

2021-2022 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 50 వేల కోట్ల ప్రణాళికను అథారిటీ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రహదారి నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారి నిర్మిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. భారతదేశంలో రహదారి అభివృద్ధిపనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2018 నుండి, కేంద్ర రవాణా శాఖ హైవే పొడవును పెంచడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది.

స్కూటర్ మనిషిని మోస్తుంది.. కానీ మనిషే స్కూటర్‌ని మోస్తే.. ఎందుకో మీరే చూడండి

అయితే ఇటీవలి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, హైవే యొక్క వెడల్పును కూడా ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు. 2018 కి ముందు నిర్మించిన హైవే లేన్లను ప్రభుత్వం పరిగణించలేదు. పొడవు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడింది. ఇప్పుడుద్ నిర్మాణంలో ఒక కొత్త ఫార్ములా రహదారి నిర్మాణ వేగాన్ని చాలా వరకు మార్చింది.

ఏది ఏమైనా రహదారులు పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, మారుమూల ప్రాంతాల్లో కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం నిజంగా చాలా దుర్భరం. కావున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వీటిని కూడా దృష్టిలో ఉంచుకుని మారుమూల ప్రాంతాల్లో కూడా సరైన రోడ్డు సదుపాయం కల్పించాలి.

Image Courtesy: News18 Virals

Most Read Articles

English summary
Youths Protests By Carrying Scooter On Shoulders For 8 Kms. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X