వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం పోస్ట్ చేసినా అది చాలా పెద్దగా వైరల్ అవుతూ ఉంటుంది. దీంతో వ్లాగర్లు (వీడియోలు అప్‌లోడ్ చేసే యూజర్లు) కూడా కొత్త కొత్త వీడియోలను తీసి, తమ యూట్యాబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం అలాంటి ఓ వీడియో గురించి ఈ కథనంలో తెలుసుకోబోతున్నాం.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

సాధారణంగా, బైక్ రైడర్లు తమ రోడ్ ట్రిప్‌లు లేదా అడ్వెంచర్ రైడ్స్ కోసం ఆఫ్-రోడ్ బైక్‌ లను ఇష్టపడతారు. నిజానికి, ఇలాంటి బైక్స్ దూరప్రయాణాలకు చాలా ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే, ఈ బైకులు అన్ని రకాల రోడ్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, ఇటీవలి కాలంలో మనదేశంలో అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు బాగా పాపులర్ అయ్యాయి.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

అయితే, ఎప్పుడో సరదాకి హైవేపై లేదా రేస్‌ట్రాక్‌పై నడిపే సూపర్‌బైక్ లను ఆఫ్-రోడింగ్ కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? ఇది వినడానికి ఎంత వింతగా ఉందో, అంతే ప్రమాదంతో కూడుకున్న సాహసం కూడా. సుజుకి హయబుసా వంటి హెవీ వెయిట్ సూపర్‌బైక్స్‌ను ప్రత్యేకించి రోడ్ మరియు ట్రాక్ ప్రయోజనాల కోసం రూపొందిస్తారు.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఇలాంటి సూపర్‌బైక్స్ చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తాయి, కానీ వీటికి అంత ఉత్తమమైన ఆఫ్-రోడ్ సామర్థ్యం ఉండదు. హై-స్పీడ్ ప్రయోజనం కోసం ఇవి ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందిచబడ్డాయి. మరి ఇలాంటి హై-పెర్ఫార్మెన్స్ బైక్‌లను రాళ్లు రప్పలు మరియు వాగులు వంకలతో కూడిన రోడ్లపై నడిపడం అంటే పెద్ద సహాసమనే చెప్పాలి.

కానీ, బెంగుళూరికి చెందిన ఓ యూట్యూబర్ మాత్రం సునాయాసంగా ఈ ప్రయాణాన్ని పూర్తి చేశారు. యూట్యూబ్‌లో RB Moto Vlogs కి చెందిన రైడర్ తన సుజుకి హయబుసా సూపర్ స్పోర్ట్స్ బైక్‌పై బెంగళూరు నుండి లడఖ్ వరకు ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన రైడ్ వీడియోని తమ ఛానెల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

అంతేకాదు, దక్షిణ భారతదేశం నుండి సుజుకి హయబుసా పై లడఖ్‌ వరకూ ప్రయాణించిన మొదటి బైకర్ తానే అని అతను ఈ వీడియోలో చెప్పారు. సాధారంగా మోటార్‌సైకిళ్లపై లడఖ్‌కు వెళ్లే మార్గం చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, హీరో ఎక్స్‌ట్రీమ్ మరియు కెటిఎమ్ డ్యూక్ అడ్వెంచర్ వంటి మోడళ్లు చాలా అనుకూలంగా ఉంటాయి.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

కానీ, సుజుకి హయబుసా వంటి భారీ బైక్స్‌తో నీటితో మరియు రాళ్లతో నిండిన ఆఫ్-రోడ్ ప్రాంతాల్లో ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి రోడ్లపై ఇంతటి భారీ బైక్‌లను హ్యాండిల్ చేయటం అంత సులువైన పనికాదు. ఈ వీడియోలో రైడర్ తన సాహసోపేతమైన ప్రయాణాన్ని తెలియజేశాడు. ఇందుకోసం రైడర్ తన సహచరులతో పాటుగా ఓ సపోర్ట్ ఎస్‌యూవీని కూడా తీసుకువెళ్లారు.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఈ వీడియోలో, బైకర్ రాళ్లు మరియు నీటితో నిండిన నదిని దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. నదిని దాటుతున్నప్పుడు, బైక్ వెనుక టైర్ రాళ్లపైకి జారిపోవడం మొదలవుతుంది మరియు ఆ తర్వాత ఈ బైక్ క్రింద పడిపోతుంది. చివరికి, ఇతర రైడర్‌ల సాయంతో బైకర్ చాలా ప్రయత్నం చేసిన తర్వాత తన హయబుసాను నది నుండి బయటకు లాగాడాన్ని మనం చూడొచ్చు.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఇదివరకు చెప్పుకున్నట్లుగా సుజుకి హయాబుసా ఓ సూపర్‌బైక్. ఇది ఆఫ్-రోడ్ రైడింగ్ కోసం తయారు చేయబడింది కాదు. చదునుగా ఉండే సిటీ రోడ్లు మరియు రేస్ ట్రాక్‌ల కోసం తయారు చేయబడింది. దీని బాడీ నిర్మాణం మరియు టైర్ల కారణంగా, ఇది ఆఫ్-రోడ్ ట్రాక్ లపై దాని పటుత్వాన్ని (గ్రిప్) కోల్పోతుంది. కాబట్టి, దీనిని ఇలాంటి అడ్వెంచర్ ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం ఉపయోగించకపోవటం మంచిది.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

సుజుకి హయబుసా ధరలు, ఫీచర్లు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తమ కొత్త 2021 సుజుకి హయబుసా సూపర్‌బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ బైక్ ప్రారంభ ధర రూ. 16.40 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది. పాత మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 మోడల్ ధర రూ. 3 లక్షలు ఎక్కువగా ఉంటుంది.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

కొత్త తరం 2021 సుజుకి హయబుసా మోడల్‌ను కంపెనీ మరింత మెరుగైన ఏరోడైనమిక్‌తో రూపొందించింది. ఫలితంగా, ఈ బైక్ మునుపటి కంటే మరింత మెరుగైన స్థిరత్వాన్ని మరియు వేగాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన టిఎఫ్‌టి ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది రైడర్‌కు కావల్సిన అనేక రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

అంతేకాకుండా, ఈ బైక్ ముందు భాగంలో స్ప్లిట్ ట్రిపుల్ ఎల్ఈడి హెడ్‌లైట్ సెటప్ ఉంటుంది. ఫ్రంట్ ఫెండర్స్‌పై రియర్ వ్యూ మిర్రర్స్ మరియు పెద్ద విండ్‌స్క్రీన్ అలాగే, బైక్ యొక్క సైడ్ ప్యానెల్స్‌లో ఎయిర్ వెంట్స్ ఉంటాయి. ఇవి దీని రూపాన్ని మరింత మెరుగ్గా చేయడంలో సహకరిస్తాయి. ఈ బైక్‌లో వివిధ రోడ్లపై నడపడానికి బైక్‌లో వివిధ రకాల రైడ్ మోడ్‌లు కూడా ఉంటాయి.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌లో పవర్‌ఫుల్ 1,340సిసి, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, డిఓహెచ్‌సి, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 187 బిహెచ్‌పి శక్తిని, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఈ ఇంజన్ స్లిప్ అసిస్ట్ క్లచ్ మరియు ద్విబై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2021 సుజుకి హయబుసా సూపర్ బైక్ కేవలం 3.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 228 కిలోమీటర్లుగా ఉంటుంది.

వామ్మో ఇంత రిస్కా..? బెంగుళూరు నుండి లడక్ వరకూ హయబుసా బైక్‌పై..

ఇక ఇందులో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, హయబుసాలో 6 యాక్సిస్ ఐఎమ్‌యూ ఆధారిత ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ మరియు మూడు పవర్ మోడ్‌లు ఉన్నాయి. ఇంకా ఇందులో టూ-వే క్విక్‌షిఫ్టర్ మరియు కార్నింగ్ ఏబిఎస్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Youtube vlogger rides his suzuki hayabusa superbike from bangalore to ladakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X