రెండు వైపులా నడిచే మారుతీ 800.. బెడ్ రూమ్ కంటే పొడవు.. 2 ఇంజిన్లు, సన్‌రూఫ్ ఫీచర్‌తో సెన్సేషన్ లిమోజిన్
భారత రోడ్లపై పరుగులు తీసిన తొలి కలల కార్లలో మారుతీ 800 ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. చిన్నదైనా కూడా ఇప్పటికి మంచి ఆదరణ కలిగి ఉంది. తక్కువ ధరలో లభిస్తూ, సులభమైన మెయింటనెన్స్‌తో దేశీయంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన కారుగా నిలిచింది. బాగా ప్రజధారణ కలిగిన ఈ కారుకి ఇప్పుడు ఒక కొత్త రూపం లభించింది. ప్రముఖ యూట్యూబర్ దిల్‌రాజ్ సింగ్ రావత్, అతని స్నేహితుల బృందం కలిసి ఒక ప్రయోగాన్ని చేశారు. వారు రెండు మారుతి 800 కార్లను కలిపి, వాటిని ఒక పొడవైన లిమోజిన్ వాహనంగా మార్చేశారు. సాధారణంగా లిమోజిన్ అంటే చూడటానికి విలాసవంతమైన కారు అని ప్రపంచానికి తెలుసు. అయితే వారు మారుతి 800 కార్లను ఉపయోగించి కొత్తగా పొడవైన వాహనాన్ని తయారు చేశారు.
వారు కేవలం రెండు కార్ల బాడీలు కలపలేదు, మధ్యలో ప్రత్యేకంగా తయారు చేసిన అనుకూల ఛాసిస్‌ను జోడించారు. ఇదే ఈ వాహనానికి అసలు ఆకర్షణగా నిలిచింది. ఈ మోడిఫైడ్ మారుతీ లిమోజిన్ పొడవు ప్రారంభంలో 22 అడుగుల దాకా ఉండగా, చివరికి వారి ఐడియాతో ఇది 30 అడుగుల పొడవుకు చేరింది. ఇది సాధారణంగా మనం ఉండే బెడ్‌రూమ్ కంటే ఎక్కువ పొడవు.

చిన్న కారు నుంచి ఇంత పెద్ద వాహనాన్ని తయారు చేయడం అంటే ఒక వినూత్న ఆలోచన. అంతేకాదు, ఇది కేవలం పొడవుగా ఉండటం మాత్రమే కాదు, దీనిలో ఫినిషింగ్, ఇంటీరియర్ లుక్, బయట లైట్ సిస్టమ్, అన్నీ కూడా లిమోజిన్‌కి తీసిపోని విధంగా డిజైన్ చేశారు. ఇది రెండు వైపులా నడిచే వాహనం. రైలు తరహాలో, ఈ కార్‌కు ఒకే సారి రెండు వైపులా డ్రైవింగ్ మెకానిజం అమర్చారు.
ఈ కార్ మొత్తం 30 అడుగుల పొడవుతో తయారు చేయబడింది. దీంతో ఇది ప్రపంచంలోనే అతి పొడవైన మారుతి 800 కారుగా నిలిచింది. ఒక సాధారణ మారుతి 800 మోడల్‌కి ఈ స్థాయిలో కొత్త రూపాన్ని ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఇండియన్ ఇన్నోవేషన్‌కు గొప్ప ఉదాహరణ. దిల్‌రాజ్ సింగ్ రావత్, అతని స్నేహితుల బృందం ఆలోచనకు, కష్టానికి నిదర్శనం అని చెప్పవచ్చు.

దీనిలో రెండు వైపులా ఇంజిన్, స్టీరింగ్ వీల్, డ్రైవర్ సీట్లు కూడా ఉన్నాయి. అంటే కారు ఏ వైపునుంచి అయినా నడిపించవచ్చు. ఇలా రెండు వైపులా డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలు తక్కువే ఉంటాయి. మారుతి 800తో ఈ ఫీట్ సాధించారు. ఈ కారులో ఇంకో ముఖ్యమైన అప్‌గ్రేడ్ ఏమిటంటే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఇది సాధారణ మారుతి 800లో ఊహించలేని ఫీచర్. ఈ సన్‌రూఫ్‌తో లిమోజిన్ లుక్‌ను అందించడానికి ఇచ్చారు.
ఈ పెద్ద లిమోజిన్‌ను మొత్తం కూడా బ్లాక్ కలర్‌లో పూత పూశారు. ప్రీమియం లుక్‌కి తగ్గట్టే, ఆకర్షణీయమైన అలాయ్ వీల్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. దిల్‌రాజ్ సింగ్ రావత్ కారు లోపలి భాగాన్ని మరింత అందంగా మార్చారు. ప్రస్తుతం ఇది చాలా మందిని ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఇండియాలో ఇటువంటి వాహన మార్పులు నిషేధించబడ్డాయని గమనించాలి. అయితే, కొంతమంది ఇంకా ఇలాంటివి చేస్తున్నే ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








