లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

భారతదేశంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళి రోజులు టపాకాయలు కాల్చుకుంటూ చాలా సంతోషంగా గడిపేస్తారు. అయితే కొంతమంది టపాకాయలను సాధారణంగా కాల్చడం కంటే కొంత భిన్నంగా కాలిస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన నుంచి ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఏమిటి? ఎక్కడ జరిగింది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనలో ఒక వ్యక్తి ఒక కారుకి లక్ష టపాసులను అలంకరించి అందంగా తయారుచేసి పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

నిజానికి ఈ సంఘటన రాజస్థాన్‌ లోని అల్వార్‌ లో జరిగినట్లు తెలుస్తోంది. అమిత్‌ శర్మ అనే ఒక యూట్యూబర్‌ ఈ సంఘటనకు పాల్పడినట్లు మనకు తెలుస్తోంది. ఇతడు తన కారుకి మొత్తమ్ టపాసులను పేర్చాడు, అయితే ముందు భాగంలో ఉన్న గ్లాస్ మరియు లైట్స్ వంటి వాటిని అలాగే ఉంచాడు.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

ఇప్పటికే వెలువడిన వీడియోలో మీరు గమనించినట్లయితే.. టపాసులతో అలంకరించబడిన ఆ కారుని యూట్యూబర్ 1, 2 & 3 అంటూ పేల్చడం ప్రారంభించారు. దీంతో ఆ టపాసులు కాలడం స్టార్ట్ అవుతాయి, ఈ సంఘటనలో కొంత సమయం ఆ ప్రదేశం మొత్తం పెద్ద శబ్దంతో నిండిపోతుంది. ఆ టపాసుల దాటికి కారు మొత్తమ్ కలర్ మారిపోతుంది.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

వైట్ కలర్ లో ఉన్న కారు మొత్తం చివరికి బ్లాక్ కలర్ లోకి మారిపోయింది. అయితే ముందు భాగంలో ఉన్న గ్లాస్ పైన టపాసులు పేర్చలేదు కాబట్టి దానికి పెద్దగా డ్యామేజ్ కాలేదు, కానీ టపాసులు ఎక్కువగా పేలడం వల్ల అది కూడా కొంత దెబ్బతినింది, దీనిని మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

లక్ష టపాసులు ఒక్కసారిగా పేలడంతో ఆ కారు మొత్తమ్ పొగతో నిండిపోయింది. కొంతమంది ఆ కారు డోర్స్ ఓపెన్ చేయగానే లోపల ఉన్న పొగ మొత్తం బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అన్ని టపాసులు పేలినా కారు ఇంజిన్ మాత్రం ఏ ప్రమాదానికి గురి కాలేదు, కావున బాగానే పనిచేస్తోంది.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

కారు ఇంజిన్ ఎటువంటి ప్రమాదానికి లోను కాకపోవడం వల్ల ఆ యూట్యూబర్ హ్యాప్పీగా తన స్నేహితులతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసిన చాలామంది ఇదే పైత్యంరా నాయనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మనకు ఇక్కడ కనిపించే ఈ కారు దేశీయ మార్కెట్లో ఎంతగానో ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ అని తెలుస్తోంది. అన్ని తాపసులతో పేల్చినప్పటికీ కారు ఇంజిన్ కి ఏమి కాకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే, అయితే ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరం.

నిజానికి కారుని టపాసులతో పేల్చే సమయంలో పొరపాటున ఇంజిన్ కూడా పేలే అవకాశం ఉంటుంది. ఇదే జరిగి ఉంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఏర్పడి ఉండేదో మనం ఊహించవచ్చు. అయితే ఈ సన్నివేశం మొత్తమ్ ఒక బహిరంగా ప్రదేశంలో జరిగింది కాబట్టి ఒకవేలా పేలి ఉన్నప్పటికీ కారు మొత్తం పనికిరాకుండా పోయేది. మొత్తానికి ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. కానీ ఖరీదైన కారు పనికిరాకుండా పోయింది.

లక్షలు పెట్టి కొన్న కారు.. లక్ష టపాసులతో ఖతం: వీడియో వైరల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దీపావళి ఎంత సంతోషకరమైన పండుగో.. ఆదమరిస్తే ఆంత విషాదాన్ని కూడా మిగులుస్తుంది. కావున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే రాజస్థాన్‌ లో జరిగిన సంఘటన అంత ఆమోదయోగ్య కాదు, ఎందుకంటే ఈ సంఘటన చూసిన వారిలో కొంతమంది మళ్ళీ ఇలాంటి సంఘటనకే పాల్పడితే.. ఎలాంటి అవాంతలు జరుగుతాయో ఖచ్చితంగా తెలియదు, కావున ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ప్రోత్సహించకూడదు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2022, 9:47 [IST]
English summary
Youtuber bursts one lakh fire crackers pasted on a swift car was set on fire video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+