యూట్యూబర్ మనసుదోచిన ఎలక్ట్రిక్ కారు!.. ధర తెలిస్తే మీరు కూడా కొనేస్తారు..

కరోనా మహమ్మారి సమయంలో చాలామంది యూట్యూబ్ క్రియేట్ చేసి సొంతంగా సంపాదించడం మొదలుపెట్టి కార్లు, బైకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓ యూట్యూబర్ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో..

నివేదికల ప్రకారం కేరళకు చెందిన 'ఎబ్బిన్ జోస్' ఫుడ్ అండ్ ట్రావెల్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు. దీని ద్వారా ప్రత్యేకమైన వంటలకాలను మాత్రమే కాకుండా ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా కూడా వెల్లడిస్తుందటాడు. ఇతడు తాజాగా ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు 'కామెట్' (Comet) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

Ebbin Jose Buys MG Comet EV

ఎంజి కామెట్ అనేది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సరసమైన కారు. ఇటీవల కంపెనీ కూడా ఈ కారు కొనుగోలుపైనా భారీ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. ఈ కారు మాత్రమే కాకుండా ఎబ్బిన్ జోస్ మహీంద్రా కంపెనీకి చెందిన XUV700 SUV కూడా కలిగి ఉన్నారు. అయితే కామెట్ ఎలక్ట్రిక్ కారును తన రోజువారీ వినియోగానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఎంజీ కామెట్ (MG Comet)

భారతదేశంలో అతై తక్కువ కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్స్ కంపెనీ 'కామెట్' అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ప్రస్తుతం దేశీయ విఫణిలో అతి తక్కువ ధరకే లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు ఇదే.. కావడం గమనార్హం. ఈ కారు చూడటానికి మంచి డిజైన్ కలిగి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని 1934 ఉకానిక్ బ్రిటీష్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రేరణతో రూపొందించినట్లు సమాచారం.

Ebbin Jose Buys MG Comet EV

రెండు డోర్స్ మరియు నాలుగు సీటింగ్ ఆప్షన్ కలిగిన ఈ కారులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి వాటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టం, మాన్యువల్ ఏసీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 2 స్పీకర్లు, USB ఛార్జింగ్ పోర్ట్, స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్స్ మరియు పవర్ అడ్జస్టబుల్ ఫీచర్స్ వంటి మరెన్నో ఉన్నాయి. ఈ కారు ధరలు రూ.6.99 లక్షల నుంచి రూ.8.58 లక్షలు.

కామెట్ ఎలక్ట్రిక్ కారులో రోటరీ డ్రైవ్ సెలెక్టర్ కూడా ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు కార్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రిమోట్ సెంట్రల్ లాకింగ్ఎం డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

బ్యాటరీ మరియు రేంజ్ విషయానికి వస్తే. ఎంజీ కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఒక ఫుల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు 3.3 kW ఆన్‌బోర్డ్ ఛార్జర్ పొందుతుంది. దీనిద్వారా ఇది పుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 7 గంటలు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, March 6, 2024, 12:02 [IST]
English summary
Youtuber ebbin jose buys mg comet electric car video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+