యూట్యూబర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ద జంట (వీడియో)
మనిషిని పరీక్షించడానికే దేవుడు కష్టాలు పెడతాడు అని పెద్దలు అంటారు. ఇది బహుశా నిజమేనేమో అనే సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అసలు విషయం ఏమిటనే.. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. ఒక యూట్యూబర్ ఓ వృద్ధ జంటకు స్కూటర్, ఫ్రిజ్ వంటి వాటితోపాటు టీ దుకాణం నడపడానికి కావాల్సిన వస్తువులను ఇవ్వడం చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ యూట్యూబర్ చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నివేదికల ప్రకారం మధుమేహం (షుగర్) కారణంగా ఓ వ్యక్తి తన కాలును కోల్పోయారు. అందరూ ఉన్నా ఆయన, ఆయన భార్య ఒంటరిగా ఆత్మాభిమానంతో జీవిస్తున్నారని సమాచారం. ఈ విషయం యూట్యూబర్ ద్వారా తెలిసింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ తాహిర్.. ఈ వృద్ధ జంటను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఆయనకు చేతనైన సహాయం అందించారు.
యజమానికి కాలు లేకపోవడం వల్ల ఆయన వేరే పని చేసుకోలేకపోవడాన్ని గమనించిన యూట్యూబర్ వారికి టీ షాప్ పెట్టించాలని ఆలోచిస్తాడు. అయితే వారి దగ్గర ఫ్రిజ్ కూడా లేదని తెలుసుకుంటాడు. మొత్తానికి వారికి సహాయం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. వారికి స్కూటర్, ఫ్రిజ్ మరియు టీ షాపుకు కావాల్సిన వస్తువును ఇచ్చాడు. వారికి కొంత డబ్బు ఇవ్వడం కూడా ఇక్కడ చూడవచ్చు.

యూట్యూబర్ తాహిర్ చేసిన పని నెటిజన్లను ఎంతగానే ఆకర్శించింది. అతని సహాయానికి ఆ వృద్ద జంట కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ ఉన్నా.. అనాధల్లా బతుకున్న మాకు చాలా గొప్ప సహాయం చేసావని.. ఆశీర్వదించడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. మొత్తానికి ఒక యూట్యూబర్ వారి జీవితంలో కొత్త వెలుగులు నింపాడు. ఇది చాలా గొప్ప విషయం. తప్పకుండా ప్రశంసించదగ్గ విషయం.
ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందడుగు వేయాలి..
ఇలాంటి ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కూడా కొందరు యూట్యూబర్స్ పేదవారికి, వృద్దులకు సహాయం చేయడం చూడవచ్చు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే.. మనిషి తప్పకుండా ఇతరులకు కూడా తన చేతనైన సాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలి.
జీవితంలో ఎవరైనా మంచి పని చేయాలని అనుకునే వారికి తాహిర్ చేసిన సాయమే మంచి ఉదాహరణ. అయితే తాహిర్ మాదిరిగా స్కూటర్ వంటి వాటిని ఇవ్వలేకపోయినా.. ఉన్నదాంట్లో అవతలి వ్యక్తి అవసరానికి ఉపయోగపడే వాటిని సహాయంగా కూడా ఇవ్వొచ్చు. నిజానికి మనిషి అనుకుంటే.. జీవితంలో ఎంతోమందికి సహాయం చేయవచ్చు. ఇతరులకు సహాయం చేయాలనంటే డబ్బు మాత్రమే ఉండాలి అనుకోవడం పొరపాటు. డబ్బుతో కాకుండా చేసే సహాయాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








