Triangle Wheel Cycle త్రిభుజాకార చక్రాల సైకిల్.. ఇలాంటి సైకిల్ ఎక్కడా చూసి ఉండరు..
సైకిల్, బైక్, కారు ఇలా ఏ వాహనం చూసుకున్నా వాటి చక్రాలు గుండ్రంగా ఉంటాయి. కానీ ఒక యూట్యూబర్ తన సైకిల్ వీల్‌ను త్రిభుజాకార డిజైన్‌లో తయారు చేసి, సాధారణ సైకిల్‌లాగే నడుపుతూ చూపించాడు. ఇది ఎలా సాధ్యం.? త్రిభుజం ఆకారంలో సైకిల్ చక్రాన్ని ఎలా తయారు చేయవచ్చు.? వివరాల్లోకి వెళితే..
యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా మాధ్యమం ఏదైనా తమ ప్రతిభను చాటి చెప్పేందుకు ఔత్సాహికులు శ్రమిస్తుంటారు. సరికొత్త ప్రయోగాలతో ముందుకు వస్తూ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. తాజాగా The Q అనే యూట్యూబ్ ఛానల్ సరికొత్త ప్రయోగంతో నెటిజన్ల మనసు దోచుకున్నారు.

ఇటీవల ఓ యూట్యూబర్ వినూత్నంగా త్రిభుజాకారంలో చక్రాలు రూపొందించి ఔరా అనిపించారు. వాటిని సైకిల్‌కు జోడించి సాధారణ సైకిల్‌గా నడిపి సామాజిక మాధ్యమలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీన్ని షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఈ చక్రాల తయారీకి మెటల్ ఫ్రేమ్‌లు కాకుండా యూట్యూబర్ వుడెన్(చెక్క) చక్రాల ఫ్రేమ్‌లను రూపొందించారు. ఇందులో టైర్లను అమర్చారు. సాంప్రదాయ బేరింగ్, హబ్‌లు మరియు డిస్క్ బ్రేక్‌లతో ఈ చక్రాలను రూపొందించారు. ఈ చక్రం త్రిభుజాకారంలో రూపొందించారు. ఫ్రేమ్ నుంచి టైర్ల వరకు తానే స్వయంగా డిజైన్ చేసుకున్నారు.

సాధారణంగా చక్రం త్రిభుజాకారంలో ఉంటే అది కదలదు. ఇరుసు ఒకే చోట ఉండకుండా పైకి క్రిందికి కదలడం ప్రారంభమవుతుంది. ఈ ప్రధాన సమస్యను యూట్యూబర్ పరిష్కరించారు. వాహనం యొక్క ఇరుసు పైకి కదలకుండా నిరోధించడానికి చక్రాల పైన రోలర్ సెట్‌ను అమర్చారు.
ఈ ప్రయోగంలో అతను ఉపయోగించిన సస్పెన్షన్ సిస్టమ్ వాహనం యొక్క యాక్సిల్ ఎత్తు పెరగకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఈ త్రిభుజాకార చక్రాల సైకిల్‌ను నడుపుతున్న వీడియోను మనం చూడవచ్చు. ఈ త్రిభుజాకారపు చక్రాన్ని ఎలా తయారు చేశాడనే దానిపై ఈ యూట్యూబర్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఇంకో విషయమేమంటే అతను త్రిభుజాకార చక్రం తయారు చేయడమే కాదు, చతురస్రాకారపు చక్రాన్ని కూడా తయారు చేశారు. ఇలా సైకిల్‌లో రకరకాల మార్పులు చేసి మరీ వీడియోలు చేశారు. ఈ వీడియోలన్నీ వైరల్ కావడంతో సైకిల్ ప్రియులు చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం తమ ప్రతిభతో సూర్యరశ్మి ద్వారా వాహనం నడిచేలా చేశారు. పదేళ్లుగా మూలన పడి, పనికి రాని స్థితిలో ఉన్న వాహనాన్ని వెలికితీసి అతి తక్కువ ఖర్చుతో మళ్లీ నడిచేలా చేశారు. దానిపై సోలార్ ప్లేట్లను అమర్చి విజయవంతమయ్యారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








