Viral Video: రూ. 40 లక్షల బైక్ పై ఆమ్లెట్ వేసిన యూట్యూబర్.. ఆశ్చర్య పోయిన జనాలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రపంచంలో జరుగుతున్న వింతల్నీ తాజాగా అరచేతుల్లో వీక్షిస్తున్నాం. ఏదైనా వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యిందంటే చాలు ఆ క్లిప్ లేదా వీడియో ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. అలానే ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తుంది. ఆ వివరాలు మీకోసం..
సోషల్ మీడియాలో ఏదీ ఎప్పుడు వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ డిజిటల్ యుగంలో స్టార్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సినిమా స్టార్స్ కంటే సోషల్ మీడియా స్టార్స్ ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. వింత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వైరల్ చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియో..
ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. డైలీ రొటీన్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ మన జీవన శైలిలో భాగమైపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో నిమిత్తం లేకుండా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము రూపొందించిన వాటికి ఎక్కువ లైక్స్ వచ్చేందుకు వినూత్న పద్ధతుల్నీ ఎంచుకుంటున్నారు.
ఈ కథనంలో మనం తెలుసుకోబోయే విచిత్ర విషయం ఏమిటంటే దాదాపు రూ.40 లక్షలు ఖరీదైన బైక్ పై ఎగ్ ఆమ్లెట్ వేస్తూ ఓ యూట్యుబర్ వీడియోను అప్ లోడ్ చేశాడు. తన డుకాటీ సూపర్‌బైక్‌పై ఆమ్లెట్ చేస్తూ తన ఛానల్ లో పోస్ట్ చేశాడు. ఆన్ లైన్ లో పంచుకున్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వేడీగా ఉన్న ఇంజన్ పై గడ్డును వేసి ఆశ్చర్యపరిచాడు. బైక్ గురించి వివరిస్తూ తను చేసిన వీడియో బాగా ఆకట్టుకుంటోంది.
ఇదే ఏడాదిలో కొనుగోలు..
JS ఫిల్మ్స్ అనే యూట్యూబ్ కి దాదాపు 3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ వీడియోను పోస్ట్ చేయడంతో ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రీమియం బైక్స్ లో డుకాటే పనిగలే V4 Sకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాదిలోనే యూట్యూబర్ ఈ సూపర్‌బైక్‌ను కొనుగోలు చేశాడు.
వీడియో ప్రారంభం కాగానే, సైకిల్‌పై ఒక చిన్న పిల్లవాడు వచ్చి, యూట్యూబర్‌ని ఏం చేస్తున్నావని అడుగుతాడు దానికి అతను గుడ్డు ఆమ్లెట్ తయారు చేస్తున్నానని.. ఇంకా తినడానికి ఏదైనా కావాలా అని సరదాగా అడుగుతాడు. ఈ సంభాషణ అక్కడ ఉన్నవారిని ఎంతగానో అలరిస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఆమ్లెట్లు తిన్నాము కానీ ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని వీక్షకులు అనే సంభాషణ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు.

1000సీసీ ఆమ్లెట్ బైక్ గా నామకరణం..
రూ. 40 లక్షల ఖరీదైన బైక్ పై అల్యూమినియం ఫాయిల్ సహాయంతో ఎగ్ ఆమ్లెట్ వేశాడు. గుడ్డును వేడిచేసేందుకు బైక్ ఇంజన్ ను స్టార్ట్ చేశాడు. దీంతో అది సునాయాసంగా వేడి అయ్యింది. అనంతరం అప్పటికే ఫాయిలో సిద్ధంగా ఉంచిన ఎగ్ ద్రావణాన్ని ఆమ్లెట్ గా తయారు చేశారు. ఈ బైక్ ని అతను 1000సీసీ ఆమ్లెట్ బైక్ గా అభివర్ణించాడు.
Ducati Panigale V4 S అనేది Panigale V4 లైనప్‌లో మిడ్-స్పెక్ వెర్షన్ గా ఉంది. దీని ధర ₹33.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. Panigale V4 S 215 bhp వద్ద 13,000 rpm అలానే 9,500 rpm వద్ద 123 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 1,103cc ఇంజన్ కెపాసిటీతో పనిచేస్తుంది. డుకాటీ ప్రస్తుతం భారత మార్కెట్లోకి పలు కొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
మాన్‌స్టర్ SP, పానిగేల్ V4 R, స్ట్రీట్‌ఫైటర్ V4 SP2, డయావెల్ V4, స్క్రాంబ్లర్ 2G రేంజ్, మల్టీస్ట్రాడా V4 ర్యాలీ,స్ట్రీట్‌ఫైటర్ V4 లంబోర్ఘినిలను విడుదల చేయనున్నారు. బ్రాండ్ ఇటీవలే DesertX అడ్వెంచర్ టూరర్ డెలివరీలను ప్రారంభించింది. భారత్ లో రెండు కొత్త డీలర్‌షిప్‌లు తెరవబడ్డాయి. ఒకటి చండీగఢ్‌లో, మరొకటి అహ్మదాబాద్‌లో ఉంది. ఈ రెండు షోరూమ్‌లు 3S సౌకర్యాలను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








