వీడియోస్ చేస్తూ రూ.1.5 కోట్ల బెంజ్ కారు కొన్న ఫేమస్ యూట్యూబర్
దేశంలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది ధనవంతులు కొనే ఈ బ్రాండ్ కారును ఓ యూట్యూబర్ కొనేసాడు. ఇంతకీ అతడెవరు? ఏ కారు కొన్నాడు, ధర ఎంతనే.. వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ యూట్యూబర్ సంజు సెహ్రావత్ 'మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ' (Mercedes Benz G63 AMG) కారు కొన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు ఇష్టపడే ఈ కారు యూట్యూబర్ సంజు సెహ్రావత్ గ్యారేజిలో కూడా చేరింది. ఖరీదైన ఈ కారును గత ఏడాది కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు గురించి యూట్యూబర్ వివరించే వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తన మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు గురించి చాలా విషయాలను యూట్యూబర్ సంజు సెహ్రావత్ వివరించడం వీడియోలో చూడవచ్చు. ఇది తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. ఇందులో ఈ కారును గత ఏడాది మార్చిలో కొనుగోలు చేసినట్లు, దాని మోడల్ గురించి కూడా వెల్లడించడం చూడవచ్చు. చూడగానే ఆకర్శించబడే ఈ కారును ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారు.
మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ కారు ధర రూ. 1.5 కోట్లు అని వెల్లడించారు. అంతే కాకుండా ఈ కారులోని ఇంటీరియర్ డిజైన్ వంటి వాటిని కూడా వివరించారు. ఇందులో 22 ఇంచెస్ మల్టి స్పోక్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, రియర్ స్పేర్ టైర్ కవర్ వంటి వాటిని గురించి తెలియజేశారు. ఇందులో చాలా వరకు కార్బన్ ఫైబర్ ఉపయోగించినట్లు స్పష్టం చేశారు.

బెంజ్ జీ63 ఏఎంజీ కారు దాదాపు ఎక్కువమంది సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎందుకంటే దీని ధర మాత్రమే కాదు,, మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమే. ఈ కారు కేవలం 2 నుంచి 3 కిమీ/లీటర్ మైలేజ్ మాత్రమే ఇస్తుందని యూట్యూబర్ వెల్లడించారు. ఈ కారణంగా ఈ కారు మెయింటెనెన్స్ కోసం నెలకు సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ (Mercedes Benz G63 AMG)
నిజానికి ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంజ్ కార్లలో జీ క్లాస్ ఒకటి. ఇది మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి అద్భుతమైన లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ధర ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ముందడుగు వేయరు, లగ్జరీ కార్లను వినియోగించడానికి ఆసక్తి కలిగిన వారు మాత్రమే ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తూ ఉంటారు.
మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ SUV 4.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 585 bhp పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఈ కారును పవన్ కళ్యాణ్, అనంత్ అంబానీ, దుల్కర్ సల్మాన్, సారా అలీ ఖాన్, హార్దిక్ పాండే మొదలైన సెలబ్రిటీలు కొనుగోలు చేశారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








