యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఇంత ఖరీదైన కార్లు కొనవచ్చా..?
దేశంలో డిజిటల్ యుగం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది స్టార్స్ వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా టిక్‌టాక్, రీల్స్, యూట్యూబర్స్ తమ సత్తాను చాటుతున్నారు. గతంలో కేవలం సినిమా స్టార్స్, సీరియళ్ నటీ నటులకు మాత్రమే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏదో ఓ మూలన రోజుకు ఓ స్టార్ పుట్టుకొస్తున్నారు.
ప్రస్తుతం యూట్యూబర్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో వీరు చేస్తున్న వీడియోలు చాలా హల్ చల్ చేస్తున్నాయి. అందులో చాలా మందికి ఇప్పటికే మంచి ఫేమ్ వచ్చింది. తమదైన శైలిలో ఈ విభాగంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ యూట్యూబర్ విశాఖ కూడా ఆ కోవకు చెందిన వారే కావడం విశేషం.

తాజాగా ఆమె ఒ సరికొత్త ఖరీదైన కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది ఈమె ప్రస్తుతం మోటార్ సైకిల్ మరియు బ్లాగర్ "రైడర్ గర్ల్ విశాఖ" పేరుతో అందరికీ ఫేమ్ సంపాదించింది. దేశంలో మొదటి మహిళా మోటార్ సైకిల్ వ్లాగర్ గా చెప్పుకునే విశాఖ తన కొత్త టయోటా ఇన్నోవా హైక్రోస్ కారును తన కుటుంబంతో కలిసి డెలివరీ తీసుకుంది.
కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలో చేసిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. షోరూంకి బయలు దేరే ముందు రైడర్ గర్ల్ విశాఖ తన మహీంద్రా థార్ ఎస్‌యూవీలో తన కుటుంబ సభ్యులతో కలిసి బయలు దేరుతుంది. ఈ మహీంద్రా థార్ ఆమె కొనుగోలు చేసిన మొదటి వాహనం. ఈ యూట్యూబర్ తన కుటుంబ సభ్యులతో పాటు తనకు ఇష్టమైన కుక్కను కూడా షోరూంకి తీసుకెళ్తుంది.

ఏడు నెలల క్రితం మహీంద్రా థార్ కారును విశాఖ కొనుగోలు చేసింది. తాజాగా ఖరీదైన టయోటా ఇన్నోవా హై క్రాస్ కారును కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యింది. మహీంద్రా థార్ కొనుగోలు చేస్తున్న సమయంలో కూడా ఓ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. రైడర్ గర్ల్ విశాఖ షోరూంకు వచ్చే వరకు ఆమె కుటుంబ సభ్యులను చూసి ఆశ్చర్యపోయింది.
తన కుటుంబానికి కారును ఎలా బహుమతిగా ఇచ్చారో వివరిస్తూ భావోద్వేగ క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు. టయోటా ఇన్నోవా హైక్రాస్ టాప్-స్పెక్ జెడ్ఎక్స్ (ఓ) వేరియంట్‌ను ఆమె కొనుగోలు చేశారు. ఈ వెర్షన్ మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో వస్తుంది. వీడియో చివర్లో రైడర్ గర్ల్ విశాఖ కొత్తగా కొనుగోలు చేసిన టయోటా ఇన్నోవా హై క్రాస్ తో పాటు మహీంద్రా థార్, హోండా మొబిలియో వాహనాలను ప్రదర్శించింది.

రైడర్ గర్ల్ విశాఖ కొనుగోలు చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు గురించి చెప్పాలంటే, ఈ ఇన్నోవా హై క్రాస్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. ఇది టయోటా యొక్క సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ, 2.0-లీటర్ నేచురల్-ఆస్పెక్ట్ మరియు 2.0-లీటర్ పెట్రోల్‌తో పనిచేస్తుంది. నాన్ హైబ్రిడ్ వెర్షన్ 172బిహెచ్ పి పవర్ మరియు 205ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 186 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ ఇన్నోవా క్రిస్టా కంటే 20 మిమీ పొడవు మరియు వెడల్పుగా ఉంటుంది. అయితే దీని ఎత్తు అలానే ఉంది, కానీ వీల్ బేస్ ను 100 మిమీ వరకు పొడిగించారు. వీల్ బేస్ పెరగడం వల్ల మంచి క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.
ఈ కొత్త హై-క్రాస్ ఎమ్ పివి టయోటా సేఫ్టీ సెన్స్ సూట్ ఆఫ్ ఎడిఎఎస్ (అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్) తో వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ప్రీ-కొలిషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








