రవిశాస్త్రి చేతుల మీదుగా యువీకి 'ఆడి క్యూ5' కారు గిఫ్ట్

క్రికెట్ ప్రపంచ కప్ 2011లో యువరాజ్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నామని, క్రికెట్ రంగంలో యువీ చూపిన ప్రతిభ తామంత గర్వపడేలా చేసిందని ప్రెస్కీ చెప్పారు. అస్సలు ఆడిని భారత్‌కు తీసుకువచ్చింది క్రికెటేనని, ఆస్ట్రేలియాలో 1985లో జరిగిన ప్రపంచ కప్‌లో రవిశాస్త్రి విన్నింగ్ ఫెర్ఫామెన్స్‌కు గానూ "ఆడి 100" కారును బహుకరించామని ఆయన గుర్తు చేశారు. అప్పటి మ్యాచ్‌లో రవిశాస్త్రి "ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్" టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
కాగా.. ఈ కారును తనకు బహుమతిగా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, 28 ఏళ్ల తర్వాత ఇండియా ప్రపంచ కప్‌ను ఇంటికి తీసుకువచ్చిందని, ఆడి తమ సాంప్రదాయాన్ని కొనసాగించడాన్ని తాను గౌరవిస్తున్నానని యువరాజ్ సింగ్ చెప్పారు.
దేశపు తొలి ఆడి కారును ఇంటికి తీసుకువెళ్లినప్పటి నుండి ఈ ఐకానిక్ బ్రాండ్‌తో తన అనబంధం ప్రారభమైందని, ఆడి ఇండియా ఈ సంప్రదాయన్ని కొనసాగించడం తనకెంతో సంతోషంగా ఉందని, క్రికెట్ రంగంలో విజేతల విజయాలను గుర్తిస్తూ.. భవిష్యత్తులో కూడా ఆడి ఇదే సంప్రదాయాన్ని కొనసాగించగలదని భావిస్తున్నట్లు మాజీ క్రికెటర్ రవిశాస్త్రి చెప్పారు.


Click it and Unblock the Notifications








