సూపర్ కారులో ప్రముఖ వ్యక్తితో ‘యువీ' ఫన్నీ రైడ్.. అతనెవరో తెలుసా.?.. వైరల్ వీడియో

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే క్రికెటర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకరు. కాగా ప్రస్తుతం యువీకి సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అందుకు కారణం యువీ.. ఓ ప్రముఖ వ్యక్తితో కలిసి మెక్‌లారెన్ కారులో ప్రయాణించడమే.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

టీమిండియా పురుషుల క్రికెట్‌లో యాక్షన్-ప్యాక్డ్ లెఫ్ట్ ఆర్మర్ యువరాజ్ సింగ్ గురించి తెలియని వారుండరు. దేశంలోనే అత్యంత ప్రాక్టికల్ క్రికెటర్ యువీ. 2011 వరల్డ్ కప్‌లో యువీ పర్ఫామెన్స్ తలచుకుంటే ఇప్పటికీ చప్పట్లు కొడతారు అభిమానులు. కాగా క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న యువరాజ్ సింగ్ అమెరికాలో జరుగుతున్న మియామీ గ్రాండ్ ప్రిక్స్ చూసేందుకు ఇటీవల వెళ్లాడు.

Yuvraj-Singh-Mika-Hakkinen-Viral-Video

ఆ సమయంలో, యువరాజ్ సింగ్ అక్కడ 2 సార్లు ప్రపంచ F1 ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న ఫిన్‌లాండ్‌కు చెందిన మికా హొక్కినెన్‌ను కలిశాడు. ఆ తర్వాత, అతనితో కలిసి యువరాజ్ సింగ్.. మెక్‌లారెన్ 750S సూపర్‌కార్‌లో ప్రయాణించాడు. ఈ రైడ్‌లో ఇద్దరి మధ్యా ఆసక్తికర ముచ్చట్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఫార్ములా 1 కార్ రేస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్ మరియు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరియు మాజీ F1 ఛాంపియన్ మికా హొక్కినెన్ మధ్య సంభాషణను ఈ వీడియోలో చూడవచ్చు. యువరాజ్ సింగ్ మెక్‌లారెన్ 750Sలోకి కారులోకి ప్రవేశించడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఇంకా మికా హొక్కినన్ యువరాజ్ సింగ్‌ను కొన్ని ప్రశ్నలు అడగడం తెలుస్తుంది.

Yuvraj-Singh-Mika-Hakkinen-Viral-Video

అందులో భాగంగా మికా.. యువీని "మీకు ఏదైనా స్పోర్ట్స్ కారు ఉందా?" అని అడుగుతారు. అప్పుడు యువరాజ్ సింగ్, "అవును. లంబోర్ఘిని మార్సియాలాగో మరియు బెంట్లీ కాంటినెంటల్ GT V8 అనే 2 కార్లు ఉన్నాయి" అని సమాధానమిచ్చాడు. ఆపై, యువరాజ్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మికా హొక్కినెన్ వెంటనే కారు యాక్సిలరేటర్‌ను నొక్కాడు.

వీడియోలో, యువరాజ్ సింగ్ మెక్‌లారెన్ 750S పనితీరును చూసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆశ్చర్యానికి గురయ్యాడు. రెండుసార్లు ఛాంపియన్ అయిన మికా హుక్కినెన్ టాలెంట్ ఇప్పటికీ తగ్గలేదు. కారు స్పీడ్‌గా వెళుతుండగా, యువరాజ్ సింగ్ తన సీటు నుండి కొంచెం ముందుకు రావడాన్ని చూడవచ్చు. ఇంకా మికా హొక్కినెన్‌కు ఒక టర్నింగ్ వద్ద సడెన్ బ్రేక్ ఇవ్వడాన్ని వీడియోలో చూడవచ్చు.

Yuvraj-Singh-Mika-Hakkinen-Viral-Video

మియామీ గ్రాండ్ ప్రిక్స్‌లో రేస్ ట్రాక్‌పై మికా హుక్కినెన్ వివిధ టర్నింగుల్లో కారును నడిపిన విధానానికి యువరాజ్ సింగ్‌తో పాటు ప్రపంచమంతా ఫిదా అయింది. ఇప్పుడు మెక్‌లారెన్ 750S అద్భుతమైన ప్రదర్శనతో మళ్లీ యువీ ఆశ్చర్యపడ్డాడు. వీడియో చివర్లో, ప్రయాణం ఎలా ఉంది? అని యువరాజ్ సింగ్‌ను మికా హొక్కినెన్ ప్రశ్నించారు.

దానికి యువరాజ్ సింగ్, "నా నోటి నుండి కాఫీ వస్తున్నట్లు అనిపించింది" అని ఛలోక్తిగా సమాధానమిచ్చారు. దీనికి ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత కారు దిగిన యువరాజ్ సింగ్.. మెక్‌లారెన్ F1 టీంని ఉద్దేశించి.. ''లోండో కంటే మైకా ఇంకా బాగా డ్రైవ్ చేస్తుంది'' అని జోక్ చేశాడు. లోండో నోరిస్ మెక్‌లారెన్ ఎఫ్1 టీమ్‌కి ప్రస్తుత డ్రైవర్.

కాగా యువరాజ్ సింగ్ ఈ మెక్‌లారెన్ 750Sని కొనుగోలు చేయబోతున్నట్లు పలుమార్లు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. అందువల్ల, యువరాజ్ సింగ్ భారత్‌కు వచ్చిన తర్వాత ఈ మెక్‌లారెన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా, MS ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో మనకి తెలిసిందే.. కానీ, యువరాజ్ సింగ్ కూడా కార్ల లవర్ అనే విషయం అర్థమవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 14, 2024, 9:15 [IST]
English summary
Yuvraj singh takes funny ride in mclaren 750s super car with world f11 champion mika hakkinen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+